AP Cabinet : కులాలవారీగా ఏపీ మంత్రుల వివరాలు..
చంద్రబాబు కేబినెట్ మంత్రుల ఎంపికలో 7/1 ఫార్ములా పాటించారు. అంటే ప్రతి ఏడుగురు ఎమ్మెల్యేలకు ఒక మంత్రి పదవిని కేటాయించారు
- By Sudheer Published Date - 09:28 AM, Wed - 12 June 24

ఏపీలో కూటమి భారీ విజయం సాధించిన నేపథ్యంలో మరికాసేపట్లో 4 వ సారి సీఎం గా చంద్రబాబు ప్రమా స్వీకారం చేయబోతున్నారు. అలాగే డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్, మరో 23 మంది మంత్రులతో గవర్నర్ జస్టిస్ నజీర్ ప్రమాణం చేయించనున్నారు. గన్నవరం మండలం కేసరపల్లిలో ఈ ప్రమాణ స్వీకారం వేదిక ఏర్పాటైంది. ఇక ఈసారి మంత్రిపదవులపై పెద్ద ఎత్తున ఆశపడే నేతలు ఉండడంతో చంద్రబాబు ఆచితూచి నిర్ణయం తీసుకున్నారు. పవన్ కల్యాణ్ సహా మొత్తం 24 మంది మంత్రుల జాబితాను గత అర్ధరాత్రి దాటాక చంద్రబాబు ప్రకటించారు. ఒక స్థానాన్ని మాత్రం ఖాళీగా ఉంచారు.
We’re now on WhatsApp. Click to Join.
చంద్రబాబు కేబినెట్ మంత్రుల ఎంపికలో 7/1 ఫార్ములా పాటించారు. అంటే ప్రతి ఏడుగురు ఎమ్మెల్యేలకు ఒక మంత్రి పదవిని కేటాయించారు. ఈ క్రమంలో 133 మంది ఎమ్మెల్యేలు ఉన్న టీడీపీకి 21 మంత్రి పదవులు, 21 మంది ఎమ్మెల్యేలు ఉన్న జనసేనకు 3 మంత్రి పదవులు(పవన్ డిప్యూటీ సీఎం), 8 మంది ఎమ్మెల్యేలు ఉన్న బీజేపీకి 1 మంత్రి పదవి దక్కింది. అది కూడా మొదటిసారి ధర్మవరం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన సత్య కుమార్ యాదవ్ కు అవకాశం వచ్చింది. అన్ని కులాలకు చంద్రబాబు పెద్దపీఠం వేశారు. అన్ని కులాల వారు సమానమే అని విధంగా అందరికి ఛాన్స్ ఇచ్చారు.
సీనియర్లు, యువతకు మధ్య సమతూకం పాటిస్తూ చంద్రబాబు మంత్రివర్గాన్ని రూపొందించారు. 17 మంది కొత్తవారికి అవకాశం కల్పించగా ముగ్గురు మహిళలకు చోటు లభించింది. ఎనిమిది మంది బీసీలు, ఇద్దరు ఎస్సీలు, ఎస్టీ నుంచి ఒకరికి, ముస్లిం మైనారిటీల నుంచి ఒకరికి, వైశ్యుల నుంచి ఒకరికి అవకాశం దక్కింది. నలుగురు కాపులు, నలుగురు కమ్మ, ముగ్గురు రెడ్లకు అవకాశమిచ్చారు. టీడీపీ నుంచి పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మంత్రివర్గంలో చేరారు. ఆనం రామనారాయణరెడ్డి, కొలుసు పార్థసారథిలకు ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నారు. పార్టీ కష్టకాలంలో పోరాట పంథాలో ఉన్న అచ్చెన్నాయుడు, అనగాని సత్యప్రసాద్, గొట్టిపాటి రవి, నిమ్మల రామానాయుడు, బీసీ జనార్దన్‌రెడ్డి, కొల్లు రవీంద్ర, పి.నారాయణ, బాలవీరాంజనేయస్వామి, వంగలపూడి అనిత వంటివారికి ప్రాధాన్యమిచ్చారు.
Read Also : Chandrababu : చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి హాజరుకానున్న ప్రముఖులు వీరే..!