Vallabhaneni Vamshi : 10 కోట్లు విలువైన స్థలం కబ్జా చేసారంటూ వంశీ పై కేసు
Vallabhaneni Vamshi : గన్నవరం పోలీస్‌స్టేషన్ పరిధి గాంధీ బొమ్మ సెంటర్ సమీపంలో 10 కోట్లు విలువైన స్థలం అక్రమంగా కబ్జా చేసారనే ఆరోపణలతో వంశీ పై భూకబ్జా కేసు నమోదు
- Author : Sudheer
Date : 25-02-2025 - 11:53 IST
Published By : Hashtagu Telugu Desk
గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఫిర్యాదుదారుడు, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ(Vallabhaneni Vamshi)పై మరో కేసు నమోదు అయ్యింది. గన్నవరం పోలీస్‌స్టేషన్ పరిధి గాంధీ బొమ్మ సెంటర్ సమీపంలో 10 కోట్లు విలువైన స్థలం అక్రమంగా కబ్జా చేసారనే ఆరోపణలతో వంశీ పై భూకబ్జా కేసు నమోదు (Land Grabbing Case) చేసారు పోలీసులు. ఈ కేసులో హైకోర్ట్ న్యాయవాది సతీమణి సీతామహాలక్ష్మి పేరిట ఉన్న స్థలం కబ్జా అయినట్టు ఆరోపిస్తూ ఫిర్యాదు చేశారు.
Surgeon Vs 299 Patients : 299 మంది రోగులపై సర్జన్ అత్యాచారం.. సంచలన కేసు
ఈ కేసులో వంశీతో పాటు మరో 15 మందిపై కూడా ఫిర్యాదు నమోదు చేయబడినట్లు న్యాయవాది సతీమణి సీతామహాలక్ష్మి తెలిపారు. తమ వద్ద ఉన్న ఆధారాలు, స్థలానికి సంబంధించిన డాక్యుమెంట్లను ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) పంపించడం జరిగిందని పేర్కొన్నారు. ఇటీవల ఏలూరు రేంజ్ ఐజీ అశోక్‌కుమార్ నేతృత్వంలో ఏర్పడిన సిట్ బృందానికి ఈ కేసును అప్పగించే అవకాశాన్ని ఫిర్యాదుదారులు కోరుతున్నారు.
Elephants Attack : మృతులకు రూ.10 లక్షల పరిహారం
మరోవైపు ఈరోజు నుంచి మూడు రోజుల పాటు వంశీని విజయవాడ ఎస్సీ, ఎస్టీ స్పెషల్ కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు పోలీస్ కస్టడీకి తీసుకుని విచారించనున్నారు. కస్టడీ సమయంలో ఉదయం 10 నుండి సాయంత్రం 5 గంటల వరకు విచారణ జరగుతుండగా, వంశీకి అవసరమైన సౌకర్యాలు – వెస్ట్రన్ టాయిలెట్, మంచం వంటి వాటిని అందించాలని కోర్టు ఆదేశించింది. అలాగే రోజుకు నాలుగు సార్లు న్యాయవాదుల సమావేశం బెయిల్ పిటిషన్‌పై చర్చలు జరగనున్న నేపథ్యంలో వంశీ కేసు సంబంధించి పలు ప్రశ్నలతో పోలీసులు విచారణ జరుపుతుండాలని వివరించారు.