HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Case File On Perni Nani 2

Perni Nani Rappa Rappa Comments : దూల తీరింది..పేర్ని నానిపై కేసు

Perni Nani Rappa Rappa Comments : టీడీపీ నేత కనపర్తి శ్రీనివాసరావు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, అవనిగడ్డ పోలీస్ స్టేషన్‌లో పేర్ని నానిపై కేసు నమోదు చేశారు

  • Author : Sudheer Date : 12-07-2025 - 7:43 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Perni Nani Kutami
Perni Nani Kutami

ఏపీ మాజీ మంత్రి పేర్ని నాని (Perni Nani) చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి. “రప్పా.. రప్పా.. వేసేస్తాం.. అంతు చూస్తాం..” (Rappa Rappa Comments) అంటూ వైసీపీ కార్యకర్తల ఆగ్రహపు వ్యాఖ్యలను ప్రోత్సహించేలా నాని మాటలాడారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల జరిగిన ఎన్నికల ఫలితాల్లో ఓటమి తర్వాత వాపోయిన వైసీపీ నేతలు ఇప్పుడు కొత్తగా రెచ్చిపోతున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఫ్లెక్సీలు, ప్లకార్డులు, నినాదాలతో జగన్ 2.0 అంటూ వైసీపీ శ్రేణులు ప్రత్యర్థులపై తూటాలు పేల్చేలా వ్యవహరిస్తున్నట్టు ప్రత్యర్థి పార్టీలు ఆరోపిస్తున్నాయి.

Sreeleela : శ్రీలీల కెరీర్‌కి టర్నింగ్ పాయింట్ కావాలెప్పుడో..!

పేర్ని నాని వ్యాఖ్యలు కొట్టిపారేయలేనివిగా మారాయి. ఆయన “చీకట్లో కన్ను కొడితే జరిగిపోవాల్సిన పనులు పట్టపగలు మాట్లాడుకుంటామా?” అన్న వ్యాఖ్య తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. ఈ మాటల వెనుక దాగిన ఉద్దేశ్యం ఏమిటన్న ప్రశ్నలు చుట్టుముట్టాయి. “రప్పా రప్పా అనొద్దు, కానీ చాటుగా చేసేయండి” అన్న సూచనలా నానిని ఆరోపిస్తున్నారు ప్రత్యర్థులు. టీడీపీ శ్రేణులు ఈ మాటలను హత్యా రాజకీయాలకు ప్రోత్సాహమని, చట్టవ్యతిరేకంగా వైసీపీ శ్రేణులను రెచ్చగొట్టే కుట్రగా అభివర్ణిస్తున్నాయి.

ఇక రెడ్‌బుక్‌పై టీడీపీ ఆరోపణలను వ్యంగ్యంగా కొట్టిపారేస్తూ పేర్ని నాని చేసిన వ్యాఖ్యలు మరింత వివాదస్పదంగా మారాయి. “అరిచే కుక్క కరవదు.. కరిచే కుక్క అరవదు” అన్న వ్యాఖ్యతో పాటు, “మనవాళ్లు రప్పా.. రప్పా అంటున్నారు.. జగన్ 2.0లో మిత్తితో సహా చెల్లిస్తాం” అన్న మాటలు కార్యకర్తలను రెచ్చగొట్టేలా ఉన్నాయన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. అధికార పార్టీకి తిరిగి వచ్చిన మద్దతుతో వైసీపీ నేతలు అదుపు తప్పినట్టు ప్రవర్తిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

Term Insurance : ప్రమాద సమయంలో కుటుంబానికి ఆర్థిక భద్రత ఇవ్వాలంటే.. టర్మ్ ఇన్షూరెన్స్ తప్పనిసరి..!

ఈ వ్యాఖ్యలపై టీడీపీ నేత కనపర్తి శ్రీనివాసరావు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, అవనిగడ్డ పోలీస్ స్టేషన్‌లో పేర్ని నానిపై కేసు నమోదు చేశారు. నాని వ్యాఖ్యలు హింసకు ప్రేరేపించేవిగా ఉన్నాయని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ వ్యవహారం పట్ల అధికార కూటమి ఎలా స్పందిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Case file on Perni Nani
  • perni nani
  • Rappa Rappa Comments
  • tdp
  • ycp

Related News

Lokesh Foreign Tour

ఏపీ అభివృద్ధికి జగన్ అడ్డు వస్తున్నాడు – లోకేష్ సంచలన ఆరోపణలు

ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామికాభివృద్ధి మరియు ఐటీ రంగ విస్తరణ లక్ష్యంగా వస్తున్న ప్రాజెక్టులపై రాజకీయ దుమారం రేగుతోంది. మంత్రి నారా లోకేష్ తాజాగా సోషల్ మీడియా వేదికగా చేసిన ఆరోపణలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.

  • Btechravi

    జగన్‌కు షాక్.. టీడీపీలోకి వైసీపీ కీలక నేత

  • Botsa Satyanarayana Daughte

    YCP : రాజకీయాల్లోకి మంత్రి బొత్స సత్యనారాయణ కుమార్తె ..?

Latest News

  • ఈ నెల 24న కొడంగల్ లో పర్యటించబోతున్న సీఎం రేవంత్

  • రేపే పల్స్ పోలియో! అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన ఏపీ సర్కార్

  • లంచాలు తీసుకుంటున్న ప్రభుత్వ అధికారులపై సీఎం రేవంత్ సీరియస్

  • మరోసారి మంత్రి పదవి పై కీలక వ్యాఖ్యలు చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్

  • రైతులకు తీపి కబురు తెలిపిన రేవంత్ సర్కార్

Trending News

    • అభిషేక్ శర్మ రికార్డు బద్దలు కొట్టిన పాండ్యా!

    • 10 గ్రాముల బంగారం ధర రూ. 40 ల‌క్ష‌లా?!

    • ఆ కార్యక్రమంలో అవినీతి.. ప్రధాని మోదీపై జగన్ ఆరోపణలు!

    • అధిక ఐక్యూ ఉన్న వ్యక్తుల 5 ముఖ్యమైన అలవాట్లు ఇవే!

    • ఆర్‌బీఐ అన్‌లిమిటెడ్ నోట్లను ముద్రిస్తే ఏమ‌వుతుందో తెలుసా?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd