Cabinet Meeting : క్యాబినెట్లో పవన్ నోటి దురుసుపై చర్చ, అరెస్ట్ దిశగా..?
జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో కీలక క్యాబినెట్ (Cabinet Meeting)సమావేశం జరిగింది. సంక్షేమ పథకాలు,కొత్త వాటికి పలు తీర్మానాలను చేసింది.
- Author : CS Rao
Date : 12-07-2023 - 2:43 IST
Published By : Hashtagu Telugu Desk
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో కీలక క్యాబినెట్ (Cabinet Meeting)సమావేశం బుధవారం జరిగింది. పలు సంక్షేమ పథకాల అమలు, కొత్త వాటికి గ్రీన్ సిగ్నల్ ఇస్తూ పలు తీర్మానాలను చేసింది. అంతేకాదు, మంత్రులకు ముందస్తు సంకేతాలు ఇచ్చినట్టు తెలుస్తోంది. ఢిల్లీ కేంద్రంగా ప్రధాని నరేంద్ర మోడీ సమక్షంలో కేంద్ర క్యాబినెట్ సమావేశం జరిగింది. అదే సమయంలో రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గ సమావేశాన్ని నిర్వహించడం గమనార్హం.
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో కీలక క్యాబినెట్ (Cabinet Meeting)
కేంద్ర మంత్రివర్గంలో (Cabinet Meeting) ప్రధానంగా ఉమ్మడి పౌరస్మృతి బిల్లుపై సీరియస్ చర్చ జరిగిందని తెలుస్తోంది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశ పెట్టడానికి క్యాబినెట్ ఆమోదం తెలిపింది. దానితో పాటు ముందస్తు ఎన్నికల అంశాన్ని కూడా ప్రస్తావించినట్టు తెలుస్తోంది. రాబోవు ఐదు రాష్ట్రాలతో పాటు వచ్చే ఏడాది జరిగే మరో మూడు రాష్ట్రాల ఎన్నికలను కూడా కలుపుకుని లోక్ సభ ఎన్నికలకు వెళ్లాలని కేంద్రం భావిస్తోంది. అదే విషయాన్ని కేంద్ర క్యాబినెట్లో చర్చించినట్టు ఢిల్లీ వర్గాల్లోకి టాక్.
ఉమ్మడి పౌరస్మృతి బిల్లు గురించి జగన్మోహన్ రెడ్డి చర్చించారని
ఇక రాష్ట్రంలోనూ జగన్మోహన్ రెడ్డి ఉమ్మడి పౌరస్మృతి బిల్లు గురించి చర్చించారని తెలుస్తోంది. పార్లమెంట్ వేదికగా ఈ బిల్లుకు మద్ధతు ఇవ్వడంపై మంత్రులతో జగన్మోహన్ రెడ్డి ప్రస్తావించినట్టు తెలుస్తోంది. మద్ధతు ఇవ్వకుండా ఉండలేని పరిస్థితిని తెలియచేసినట్టు సమాచారం. ఒక వేళ మద్ధతు ఇవ్వాల్సి వస్తే, ఓటింగ్ సమయంలో బయటకు వెళ్లేలా మధ్యేమార్గ నిర్ణయాన్ని వెలుబుచ్చినట్టు తెలుస్తోంది. రాష్ట్రంలోని పరిస్థితులు, పవన్ వ్యాఖ్యల మీద సీరియస్ గా మంత్రివర్గంలో (Cabinet Meeting) ప్రస్తావనకు వచ్చింది.
ముందస్తు ఎన్నికల ప్రచారం క్రమంలో కొత్త పథకాలతో (Cabinet Meeting)
అమరావతిలో ఇళ్ల పట్టాలు పొందిన లబ్ధిదారులకు ఇళ్ల నిర్మాణంపైనా కేబినెట్‌లో (Cabinet Meeting) చర్చ జరిగింది. సీఎం జగన్ మోహన్ రెడ్డి మంగళవారం పోలవరం ప్రాజెక్టును పరిశీలించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులపై పలు కీలక నిర్ణయాలపై తీర్మానాలు చేశారు. ముందస్తు ఎన్నికల ప్రచారం క్రమంలో కొత్త పథకాలతో పాటు, పలు వర్గాల ప్రజలపై వరాల జల్లుకురిపించేలా కేబినెట్ లో నిర్ణయాలపై చర్చించారు. దీనికితోడు ఇటీవల సీఎం జగన్ అమిత్ షాతో భేటీ అయ్యారు. ఆ తరువాత అమిత్ షా, జేపీ నడ్డాలతో చంద్రబాబు భేటీ అయ్యారు. చంద్రబాబు ఢిల్లీ టూర్ పైనా సమావేశంలో ప్రస్తావనకు వచ్చినట్టు తెలుస్తోంది.
సీపీఎస్ రద్దు చేసి మెరుగైన పెన్షన్ విధానం అమలు చేసేలా
పీఆర్సీ, డీఏ బకాయిలు 16వాయిదాల్లో చెల్లించేలా నిర్ణయంతో పాటు యూనివర్సిటీ ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు 62ఏళ్లకు పెంచుతూ కేబినెట్ గ్రీన్ సిగ్నల్ (Cabinet Meeting) ఇవ్వనుంది. అదేవిధంగా సీపీఎస్ రద్దు చేసి మెరుగైన పెన్షన్ విధానం అమలు చేసేలా మంత్రిమండలి కీలక నిర్ణయం తీసుకునే దిశగా తీర్మానం చేసింది. త్వరలో గ్రూప్-1, గ్రూప్ -2 ఉద్యోగాల నోటిఫికేషన్ జారీకి కేబినెట్ ఆమోదం తెలిపేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జూన్, జులై నెలలో అమలు చేయాల్సిన సంక్షేమ పథకాలకు మంత్రివర్గం సమావేశంలో ఆమోద ముద్ర పడింది.
Also Read : Pawan Kalyan : మరోసారి వాలంటీర్స్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన పవన్.. వ్యక్తిగత సమాచారం వాలంటీర్లకు ఎందుకు??
రాష్ట్ర ప్రభుత్వం తీరుపై కొద్దికాలంగా ఏపీ ఉద్యోగులు అసంతృప్తిగా ఉన్న విషయం తెలిసిందే. తమ డిమాండ్లను పరిష్కరించాలని వారు ఏపీ ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈ క్రమంలో ఉద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పేలా కేబినెట్ లో నిర్ణయాలు తీసుకున్నారు. సుమారు 10వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులకు ప్రభుత్వ నిర్ణయం ద్వారా లబ్ధి చేకూరనుంది.
Also Read : Janasena fever : డిప్రషన్లో పవన్ ? సోషల్ మీడియాలో YCP దుమారం!!