CBN : ఆరడుగుల నిజాయితీకి నిదర్శనం చంద్రబాబు – బుద్దా వెంకన్న
ఆరడుగుల నిజాయితీకి నిదర్శనం చంద్రబాబు అని, ఏపీని అభివృద్ధి దిశగా నడిపిస్తున్నారని కొనియాడారు. ఐదడుగుల తాచుపాము జగన్ అని, ఆయనకు తన మన భేదం లేదని విమర్శించారు
- By Sudheer Published Date - 04:02 PM, Sat - 13 July 24

ఆరడుగుల అబద్ధం నడిచొస్తే ఎలా ఉంటుందో చంద్రబాబు (Chandrababu) నడిచొస్తే అలా ఉంటుందని, 2014, 2024లో టీడీపీ విడుదల చేసిన మేనిఫెస్టోలన్నీ మోసం, దగా అని, చంద్రబాబు అసత్యాలతో శ్వేతపత్రం విడుదల చేస్తున్నారని, అందులో పేర్కొన్నవన్నీ పచ్చి అబద్ధాలేనని మాజీ మంత్రి పేర్ని నాని (Perni Nani) పేర్కొండడం ఫై టీడీపీ నేత బుద్దా వెంకన్న (Buddha Venkanna) మండిపడ్డారు. ఆరడుగుల నిజాయితీకి నిదర్శనం చంద్రబాబు అని, ఏపీని అభివృద్ధి దిశగా నడిపిస్తున్నారని కొనియాడారు. ఐదడుగుల తాచుపాము జగన్ అని, ఆయనకు తన మన భేదం లేదని విమర్శించారు. తప్పుడు కేసులతో చంద్రబాబును జైలుకు పంపారని ఆరోపించారు. అందుకే ప్రజలు బుద్ధి చెప్పారన్నారు. రాష్ట్రానికి నిధుల కోసం సీఎం కృషి చేస్తున్నారని తెలిపారు.
We’re now on WhatsApp. Click to Join.
చంద్రబాబు రాష్ట్రానికి ఎన్నో పరిశ్రమలు తేస్తే.. జగన్‌ను చూసి వారంతా ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోయారని విమర్శించారు. సూపర్ సిక్స్ పథకాలు అన్ని చంద్రబాబు అమలు చేస్తారని ధీమా వ్యక్తం చేశారు. జగన్ ఇదే నెలరోజుల్లో పదవులు పంచే పనిలో ఉన్నారని ఎద్దేవా చేశారు. నిజమైన ముసలివాడు జగన్ అని, 74 ఏళ్ల వయసులోనూ చంద్రబాబు 24 ఏళ్ల కుర్రాడిలా పరుగులు పెడుతున్నారని తెలిపారు. జగన్ రాక్షస పాలన తట్టుకోలేక రాష్ట్ర ప్రజలు చంద్రబాబుకు మళ్లీ పట్టం కట్టారని బుద్దా వెంకన్న పేర్కొన్నారు. సంయమనం పాటించాలని తమను చంద్రబాబు ఆపారని, ఇంకోసారి అబద్ధాలు ప్రచారం చేస్తే ఊరికునేది లేదని బుద్దా వెంకన్న హెచ్చరించారు.
Read Also : Aishwarya – Abhishek Divorce : ముకేశ్ పెళ్లి సంబరాల్లో బయటపడ్డ ఐశ్వర్య – అభిషేక్‌ల ఎడబాటు