Bomb Attempt : వైసీపీ ఎమ్మెల్యేపై బాంబ్ దాడి
'గడపగడపకు మన ప్రభుత్వం' కార్యక్రమం ప్రారంభించారు. ఆయన వాహనం దిగి కొంత దూరం నడిచారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే కాన్వాయ్‌లోని ఓ వాహనంపై ఓ ఆకతాయి డిటోనేటర్ విసరడం కలకలం రేపింది.
- Author : Sudheer
Date : 08-10-2023 - 3:46 IST
Published By : Hashtagu Telugu Desk
పెనుకొండ వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి శంకర నారాయణ (Shankar Narayana) కాన్వాయ్‌పై డిటోనేటర్ దాడి (Bomb Attempt) జరిగింది. సత్యసాయి జిల్లా గోరంట్ల మండలంలోని గడ్డం తండా పంచాయతీ పరిధిలో ఈ ఘటన జరిగింది. దుండగులు విసిరిన ఈ బాంబ్ పేలకపోవడం పెను ప్రమాదం తప్పింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు (AP Police) వెంటనే ఆ పేలుడు వస్తువును విసిరిన వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్న పోలీసులు లోతుగా విచారణ చేపట్టారు. నిందితులు ఎవరు? ఈ పని చేయించింది ఎవరు? అన్న కోణంలో విచారణ చేపట్టారు.
We’re now on WhatsApp. Click to Join.
ఎమ్మెల్యే శంకర నారాయణ ఆధ్వర్యంలో సుమారు 12 గంటలకు గ్రామంలో ‘గడపగడపకు మన ప్రభుత్వం’ (Gadapa Gadapaku Mana Prabhutvam) కార్యక్రమం ప్రారంభించారు. ఆయన వాహనం దిగి కొంత దూరం నడిచారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే కాన్వాయ్‌లోని ఓ వాహనంపై ఓ ఆకతాయి డిటోనేటర్ విసరడం కలకలం రేపింది. అయితే, డిటోనేటర్ గురితప్పి పొదల్లో పడటం, అది పేలకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అక్కడున్న నాయకులు నిందితుడిని అదుపులోకి పోలీసులకు అప్పగించారు. ఈ రోజు లేదా రేపటిలోగా పూర్తి విషయాలు బయటకు వస్తాయని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. ఏకంగా అధికార పార్టీ ఎమ్మెల్యేపైనే దాడి జరగడంతో ఏపీలో తీవ్ర చర్చనీయాంశమైంది.
Read Also : Manipur Minister – Explosion : మంత్రి ఇంటిపై గ్రెనేడ్ దాడి.. ఇద్దరికి గాయాలు.. సంఘటనా స్థలికి సీఎం