BJP : టాలీవుడ్ `కమల`గుబాళింపు,మోడీ-షా`మెగా`ఎత్తుగడ
మోడీ, అమిత్ షా (BJP) ద్వయం మెగా కుటుంబం(Mega Family) మీదుగా రాజకీయానికి పదును పెడుతోంది.
- By CS Rao Published Date - 12:37 PM, Sat - 18 March 23

మోడీ, అమిత్ షా (BJP) ద్వయం మెగా కుటుంబం(Mega Family) మీదుగా తెలుగు రాష్ట్రాల రాజకీయానికి పదును పెడుతోంది. ఒక వైపు జూనియర్ ఎన్టీఆర్ ను ఇంకో వైపు మెగా హీరోలను లైన్లోకి తీసుకుంటోంది. వచ్చే ఎన్నికల్లో తెలంగాణ రాజ్యాధికారం బీజేపీ టార్గెట్. ఏపీలో 2029 నాటికి అధికారంలో ఉండాలని వాళ్ల బ్లూ ప్రింట్. ఆ దిశగా చాలా ప్లాన్డ్ గా పావులు కదుపుతున్నారు. ఆ క్రమంలో మెగా హీరోలను ఇప్పటికే కట్టిపడేశారు. వాళ్లు ఎప్పుడు ఎలా ఉపయోగించుకోవాలి? అనేది మాత్రమే ఇక మిగిలింది.
మోడీ, అమిత్ షా ద్వయం మెగా కుటుంబం..(BJP)
పొత్తు రూపంలో ఇప్పటికే పవన్ కల్యాణ్ ను బీజేపీ(BJP) ఆడిస్తోంది. ఒకానొక సమయంలో జనసేన పార్టీని విలీనం చేసుకోవడానికి కూడా ప్రయత్నం చేసింది. ఆ విషయాన్ని పరోక్షంగా జనసేనాని మూడేళ్ల క్రితం పరోక్షంగా బయట పెట్టారు. ఇప్పుడు బీజేపీ, జనసేన పొత్తు ఏపీలో కొనసాగుతోంది. కానీ, గ్రౌండ్లో ఎక్కడా కలిసి పనిచేయవు. తాజాగా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో జనసేన దూరంగా ఉండగా, బీజేపీ అభ్యుర్థులు బరిలో నిలిచారు. అంతకముందు జరిగిన తిరుపతి లోక్ సభ ఎన్నికల్లో రెండు పార్టీలు కలిసి వెళ్లినప్పటికీ డిపాజిట్లు దక్కలేదు. ఆ తరువాత జరిగిన బద్వేల్, ఆత్మకూరు ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు పోటీలో ఉండగా, జనసేన మాత్రం సైలెంట్ అయింది. ప్రస్తుతం బీజేపీ కలిసి రావడంలేదని అసంతృప్తిగా ఉన్న పవన్ భవిష్యత్ లో టీడీపీతో కలిసి వెళ్లడానికి సిద్దమవుతున్నారు. ఆ మేరకు పదో వార్షికోత్సవ సభ సందర్బంగా మచిలీపట్నంలో సంకేతాలు ఇచ్చారు. ఇలాంటి పరిస్థితుల్లో చిరంజీవి, రామ్ చరణ్ (Mega Family) ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ కావడం రాజకీయ కోణాన్ని సంతరించుకుంది.
చిరంజీవితో ప్రధాని నరేంద్ర మోడీ అప్యాయం
మెగాస్టార్ చిరంజీవికి (Mega Family) ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గత సంక్రాంతి నుంచి విందు అందించారు. ప్రత్యేక విమానంలో హైదరాబాద్ నుంచి తాడేపల్లికి పిలిపించుకున్న జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన విందుకు మెగా కుటుంబం ఫిదా అయింది. ఆ తరువాత సినిమా టిక్కెట్ల ఆన్ లైన్, ధరల తగ్గింపు రాద్దాంతం జరిగినప్పుడు చిరంజీవి ప్రత్యేకంగా జగన్మోహన్ రెడ్డిని కలిశారు. తదనంతరం భీమవరం కేంద్రంగా జరిగిన అల్లూరి సీతారామరాజు విగ్రహం ఆవిష్కరణ సభకు చిరంజీవికి ప్రత్యేక ఆహ్వానం లభించింది. ఆ వేదిక మీద చిరంజీవితో ప్రధాని నరేంద్ర మోడీ(BJP) అప్యాయంగా మాట్లాడిన దృశ్యం ఇప్పటికీ అందరికీ గుర్తుండే ఉంటుంది. ఇక విశాఖ వచ్చిన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ జనసేనాని పవన్ ను పిలిపించుకున్నారు. ఆ రోజు నుంచి పవన్ వాయిస్ మారిపోయింది.
Also Read: T BJP : తెలంగాణకు ఢిల్లీ పెద్దల `ముందస్తు`సంకేతం ! స్ట్రీట్ ఫైట్ కు దిశానిర్దేశం!!
ప్రధాని నరేంద్ర మోడీతో ప్రత్యేక అనుబంధం ఉందని పవన్ చెబుతున్నారు. అంతే మోతాదులో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా రాజకీయాలకు అతీతమైన బంధం మోడీతో(BJP) ఉందని ఇటీవల వెల్లడించారు. ఇక మెగాస్టార్ చిరంజీవి ప్రధాని నరేంద్ర మోడీ పలకరింపుకు పులకించిపోయారు. ఇప్పుడు ఢిల్లీ వేదికగా చిరంజీవి, రామ్ చరణ్ ఇద్దరూ (Mega Family) మోడీని కలిశారు. ఆ తరువాత అమిత్ షాతో భేటీ అయ్యారు. ఇదంతా ఆస్కార్ సాధించిన త్రిబుల్ ఆర్ సినిమా అభినందనలు తెలపడానికి మోడీ, షా పిలిపించుకున్నారని అనుకోవడానికి లేదు. ఎందుకంటే, ఫక్తు రాజకీయాలు మోడీ, షా ద్వయం చేస్తోంది. పొలిటికల్ వేదికపై మెగా కుటుంబం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో రాజకీయాలకు అతీతంగా ఈ భేటీలు జరిగి ఉంటాయని అనుకోలేం.
జూనియర్ ఎన్టీఆర్ ద్వారా ఇటీవల మోడీ, అమిత్ షా
జూనియర్ ఎన్టీఆర్ ద్వారా ఇటీవల మోడీ, అమిత్ షా (BJP) కొంత రాజకీయాన్ని నడిపారు. ఇప్పుడు మెగా హీరోలతో దాన్ని కొనసాగించారు. గతంలో మెగా కోడలు ఉపాసన కూడా మోడీతో భేటీ అయ్యారు. ఇంకో వైపు మోహన్ బాబు కుటుంబాన్ని మోడీ పిలిపించుకుని మాట్లాడారు. ఈ పరిణామాలను చూస్తుంటే, దక్షిణ భారత దేశం మీద బీజేపీ ఎత్తుగడ సినిమాటిక్ గా ఉందని తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల నుంచి దక్షిణ భారత దండయాత్రకు పునాదులు వేస్తున్నారని మాత్రం ఇప్పటి వరకు జరిగిన భేటీలను బేరీజు వేసుకుంటే ఒక అంచనాకు రావచ్చు. మొత్తం మీద మెగా హీరోలకు(Mega Family) కమలాభిషేకం చేయడానికి మోడీ, షా ద్వయం ఎత్తుగడ వేసిందని తెలుస్తోంది.
Also Read : PM Narendra Modi: మోదీని అధికారం నుంచి దించాలని చూస్తున్న ఇంగ్లండ్, అమెరికా..!

Related News

Samantha: మళ్లీ ప్రేమలో పడొచ్చు కదా అంటూ సమంతకు సలహా.. అదిరిపోయే సమాధానం ఇచ్చిన బ్యూటీ?
ఎవరి సపోర్ట్ లేకుండా సొంత టాలెంట్ తో ఇండస్ట్రీలో అడుగుపెట్టి ఒక స్టార్ హీరోయిన్ రేంజ్ లో దూసుకుపోతుంది సమంత.