Galiveedu MPDO : వైసీపీ నాయకులకు భీమ్లా నాయక్ ట్రీట్మెంట్
Galiveedu MPDO : విధి నిర్వహణలో ఉన్న జవహర్ బాబుపై వైసీపీ నేత దాడి చేయడం అప్రజాస్వామిక చర్య అని, ఇటువంటి దౌర్జన్యాలకు, రౌడీ చర్యలకు కూటమి ప్రభుత్వంలో తావు లేదని
- By Sudheer Published Date - 11:27 AM, Sat - 28 December 24

వైసీపీ నాయకులకు భీమ్లా నాయక్ (Pawan Kalyan) ట్రీట్మెంట్ ఏంటి రుచిచూపించాడు. అన్నమయ్య జిల్లాలోని గాలివీడు(Galiveedu )లో వైసీపీ నేత సుదర్శన్ రెడ్డి (Sudharshan Reddy) ఎంపీడీవో జవహర్ బాబు(Galiveedu MPDO Javahar Babu)పై దాడి చేసిన ఘటన కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఎంపీపీ గది తాళాలు ఇవ్వాలని సుదర్శన్ రెడ్డి డిమాండ్ చేయగా, ఎంపీపీ లేకుండా తాళాలు ఇవ్వలేనని ఎంపీడీవో చెప్పాడు. ఈ మాటలకు ఆగ్రహించిన సుదర్శన్ రెడ్డి, తన అనుచరులతో కలిసి ఎంపీడీవోపై దాడికి పాల్పడడంతో ఎంపీడీవో గాయపడ్డాడు. ప్రస్తుతం రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రి లో ఆయనకు చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటన పై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు హోంమంత్రి అనిత సీరియస్ అయ్యారు.
ఈ ఘటనను ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తుందని, ఈ దాడికి పాల్పడినవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. విధి నిర్వహణలో ఉన్న జవహర్ బాబుపై వైసీపీ నేత దాడి చేయడం అప్రజాస్వామిక చర్య అని, ఇటువంటి దౌర్జన్యాలకు, రౌడీ చర్యలకు కూటమి ప్రభుత్వంలో తావు లేదని పవన్అన్నారు. ఎంపీడీవోపై జరిగిన దాడి గురించి అధికారులతో పవన్ కల్యాణ్ చర్చించారు.
బాధితుడి పిర్యాదు తో పాటు పవన్ కళ్యాణ్ ఆదేశాలతో రంగంలోకి దిగిన పోలీసులు ఈరోజు సుదర్శన్ రెడ్డి ని అదుపులోకి తీసుకున్నారు. అది కూడా సినిమా రేంజ్ లో గల్లా పట్టుకొని ఈడ్చుకుంటూ, కొట్టుకుంటూ పోలీస్ జీప్ ఎక్కించారు. ఇది చూసిన ప్రజలు భీమ్లా నాయక్ (Pawan Kalyan) ట్రీట్మెంట్ అంటే ఇలాగే ఉంటుంది. ఇకనైనా వైసీపీ శ్రేణులు , నేతలు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉంటె బాగుంటుందని హెచ్చరిస్తున్నారు.
బిగ్ బ్రేకింగ్ 💥💥 వైసీపీ నేతను తన్నుకుంటూ తీసుకు వెళ్తున్న పోలీసులు
🤙🤙
గాలివీడు ఎంపీడీఓ జవహర్ బాబుపై దాడి చేసిన వైసీపీ నేత సుదర్శన్ రెడ్డిని లక్కెళుతున్న పోలీసులు!!
ఇప్పటికే దాడికి పాల్పడినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను @PawanKalyan గారు ఆదేశించారు 💥 pic.twitter.com/gNTBUunkZy— Team PoliticalSena (@Teampolsena) December 28, 2024
Read Also : Fees Fear : ప్రైవేటు స్కూళ్లు, కాలేజీల్లో ఫీ‘జులుం’.. నియంత్రణకు రెడీ అవుతున్న రేవంత్ సర్కార్