Ayyanna Patrudu : స్పీకర్‌గా అయ్యన్న పాత్రుడు ఏకగ్రీవం
ఏపీ శాసనసభాపతిగా అయ్యన్న పాత్రుడ్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు
- By Sudheer Published Date - 11:46 AM, Sat - 22 June 24

ఏపీ అసెంబ్లీ స్పీకర్ గా అయ్యన్న పాత్రుడు (Ayyanna Patrudu ) ఏకగ్రీవంగా ఎన్నికున్నారు. ఏపీ 16వ శాసనసభ సమావేశాల్లో రెండో రోజైన ఈరోజు స్పీకర్ ఎన్నిక ప్రక్రియ జరిగింది. ఉదయం పదిన్నర గంటలకు సభ సమావేశంకాగానే తొలి రోజు మిగిలిపోయిన సభ్యుల ప్రమాణ స్వీకారం చేసారు. ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు, కాకినాడ ఎమ్మెల్యే వనమాడి ప్రమాణం చేయడం జరిగింది. అనంతరం.. ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి స్పీకర్ ఎన్నిక ప్రక్రియ మొదలుపెట్టారు.
ఏపీ శాసనసభాపతిగా అయ్యన్న పాత్రుడ్ని ఏకగ్రీవంగా (speaker of AP) ఎన్నుకున్నారు. అనంతరం సీఎం చంద్రబాబు, డిప్యూటీసీఎం పవన్ కల్యాణ్, మంత్రి సత్యకుమార్ ఆయన్ని సభాపతి స్థానంలో కూర్చోబెట్టి ఆల్‌ది బెస్ట్ చెప్పారు. ఈ సందర్బంగా అయ్యన్న..చంద్రబాబు , పవన్ కళ్యాణ్ లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అనంతరం సీఎం చంద్రబాబు అసెంబ్లీ లో మాట్లాడడం మొదలుపెట్టారు. ఈ స్పీకర్ ఎన్నిక ప్రక్రియకు వైసీపీ దూరంగా ఉంది.
We’re now on WhatsApp. Click to Join.
ఇక అయ్యన్న పాత్రుడు విషయానికి వస్తే…
1983 నుంచి టీడీపీతో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన అయ్యన్న..ఎన్నో బాధ్యతలు చేపట్టారు. 42 ఏళ్ల ప్రయాణంలో ఎన్నో గెలుపు ఓటములు చూసారు. అలాగే మంత్రిగా కూడా పని చేసి ప్రజలకు ఎంతో సేవ చేసారు. నర్సీపట్నం నుంచి 1983-1989, 1994-1996, 2004-2009, 2014-2019 మధ్య కాలంలో టిడిపి నుండి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 1984-1986లో ఎడ్యుకేషన్ మినిస్టర్‌గా , 1994-96లో ఆర్ అండ్‌బీ మినిస్టర్‌గా ప్రజలకు సేవ చేసారు. 1996లో ఎంపీగా కూడా అనకాపల్లి నుంచి పోటీ చేసి విజయం సాధించారు. 1999లో చంద్రబాబు సీఎం అయ్యాక అయ్యన్నకు అటవీశాఖ బాధ్యతలు అప్పగించారు. 1989, 2009, 2019 లో అయ్యన్నపాత్రుడు ఓటమి పాలయ్యారు.
Read Also : Life Expectancy : చిన్న చేపలను ముళ్లతో సహా తింటే.. ఆయుష్షు అప్!