Ayyanna Patrudu : లోకేష్ ని అరెస్ట్ చేస్తే బ్రాహ్మణిని ముందు పెట్టి పార్టీ నడిపిస్తాం.. అయ్యన్న పాత్రుడు ఆసక్తికర వ్యాఖ్యలు..
మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు(Ayyanna Patrudu) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ నుంచి వచ్చిన అనంతరం మీడియాతో మాట్లాడారు అయ్యన్న.
- Author : News Desk
Date : 20-09-2023 - 7:00 IST
Published By : Hashtagu Telugu Desk
ఏపీ(AP)లో చంద్రబాబు(Chandrababu) అంశం రోజురోజుకి మరింత రగులుతున్న సంగతి తెలిసిందే. టీడీపీ నాయకులు వైసీపీ(YCP) ప్రభుత్వంపై ఈ విషయంలో తీవ్రంగా ఫైర్ అవుతున్నారు. అయితే చంద్రబాబు లేని లోటు పార్టీలో కనిపిస్తుంది. అలాగే లోకేష్(Nara Lokesh) ని కూడా అరెస్ట్ చేస్తారంటూ వినిపిస్తుంది. వైసీపీ అందుకు కూడా ప్రయత్నాలు చేస్తున్నట్టు పలువురు ఆరోపిస్తున్నారు.
ఈ నేపథ్యంలో మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు(Ayyanna Patrudu) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ నుంచి వచ్చిన అనంతరం మీడియాతో మాట్లాడారు అయ్యన్న.
అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ.. చంద్రబాబు తర్వాత లోకేష్ ను అరెస్ట్ చేస్తారంటూ వస్తున్న వార్తలపై ఢిల్లీలో చర్చించాం. పార్టీ నాయకత్వానికి ఎలాంటి ఢోకా లేదు. లోకేష్ ను అరెస్టు చేస్తే నారా బ్రాహ్మణిని ముందు పెట్టి పార్టీని నడిపిస్తాం. ఈ అంశంపై మొన్న ఢిల్లీలో నేతలు కూర్చున్నప్పుడు చర్చ జరిగింది. తెలుగుదేశం పార్టీ పెట్టిన ముహూర్తం చాలా గొప్పది. సంక్షోభాలు టీడీపీకి కొత్త కాదు అని అన్నారు.
గత కొంతకాలంగా నారా బ్రాహ్మణి(Nara Brahmani)నే పార్టీ నడిపిస్తుందని వార్తలు వస్తున్నాయి. బ్రాహ్మణి కూడా ఇప్పుడు ప్రజల్లో తిరుగుతూ, మీడియాతో మాట్లాడుతూ, వైసీపీ మీద ఫైర్ అవుతుంది. ఇక లోకేష్ అరెస్ట్ వార్తలు కూడా బాగా వినిపిస్తున్నాయి. ఇలాంటి సమయంలో అయ్యన్నపాత్రుడు ఈ వ్యాఖ్యలు చేయడంతో వైరల్ గా మారాయి. నిజంగానే లోకేష్ ని అరెస్ట్ చేస్తారా? బ్రాహ్మణికి టీడీపీ(TDP) పగ్గాలు ఇస్తారా చూడాలి.
Also Read : AP : చంద్రబాబు కస్టడీపై వాదనలు పూర్తి..రేపు తీర్పు