Lovers Suicide: గుంటూరులో దారుణం.. రైలు కిందపడి ప్రేమజంట ఆత్మహత్య
- By Kode Mohan Sai Published Date - 12:39 PM, Fri - 18 October 24
Lovers Suicide: గుంటూరు జిల్లాలో జరిగిన ఓ దారుణ ఘటనలో ఒక ప్రేమజంట రైలుకు కొట్టుకొని ఆత్మహత్య చేసుకుంది. మృతులను పెదకాకాని గ్రామానికి చెందిన 22 ఏళ్ల దానబోయిన మహేశ్ మరియు నందిగామ మండలం రుద్రవరానికి చెందిన 21 ఏళ్ల నండ్రు శైలజగా గుర్తించారు.
మహేశ్ డిప్లొమా పూర్తిచేసి, రెండు సంవత్సరాల క్రితం హైదరాబాద్‌లో ఒక మొబైల్ స్టోర్‌లో పని చేయడం ప్రారంభించాడు. అక్కడే శైలజతో ఆయన పరిచయం ఏర్పడింది, అది ప్రేమగా మారింది. ఇరు కుటుంబాలకు ఈ ప్రేమ వ్యవహారం తెలిసిన తర్వాత, మహేశ్ కుటుంబం పెళ్లికి అంగీకరించింది. కానీ శైలజ కుటుంబం మాత్రం నిరాకరించింది.
ఈ పరిస్థితుల్లో, దసరా సమయంలో మహేశ్ మరియు శైలజ ఇంటి నుంచి బయటకు వెళ్లారు, తర్వాత వారు కనిపించకుండా పోయారు. శైలజ కుటుంబ సభ్యులు గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో ఈ తెల్లవారుజామున పెదకాకాని సమీపంలోని రైల్వే ట్రాక్‌పై ఇద్దరు విగత జీవులుగా కనిపించారు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.