Atchannaidu : అచ్చెన్నాయుడి ఇంట విషాదం..
90 ఏళ్ల కళావతమ్మ గత కొంతకాలంగా వయోభారంతో వచ్చిన సమస్యలతో ఇబ్బందిపడుతున్నారు
- Author : Sudheer
Date : 31-03-2024 - 8:56 IST
Published By : Hashtagu Telugu Desk
టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు (Kinjarapu Atchannaidu) ఇంట తీవ్ర విషాదం నెలకొంది. అచ్చెన్నాయుడు తల్లి కళావతి (Kalavathi) (90) వృద్ధాప్యం కారణంగా కన్నుమూశారు. ఆదివారం నాడు 3 గంటల సమయంలో.. స్వగృహం శ్రీకాకుళం జిల్లా నిమ్మాడలో కళావతి తుదిశ్వాస విడిచారు. ఈ విషయం తెలిసి అచ్చెన్నాయుడు ..హుటాహుటిన ఇంటికి వెళ్లారు. కళావతి మృతిపట్ల టీడీపీ అధినేత చంద్రబాబు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, పలువురు పార్టీ నేతలు, జిల్లాకు చెందిన సీనియర్లు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారంలో ఉండగా చంద్రబాబుకు విషయం తెలియగానే వెంటనే అచ్చెన్నకు ఫోన్ చేసి మాట్లాడినట్లు సమాచారం.
We’re now on WhatsApp. Click to Join.
90 ఏళ్ల కళావతమ్మ గత కొంతకాలంగా వయోభారంతో వచ్చిన సమస్యలతో ఇబ్బందిపడుతున్నారు. కింజరపు అచ్చెన్నాయుడు నాన్న దాలినాయుడు సుమారు15 ఏళ్ల కిందట కన్నుమూశారు. కింజరపు దాలినాయుడు, కళావతమ్మ దంపతులకు నలుగురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు సంతానం. పెద్ద కొడుకు ఎర్రన్నాయుడు టీడీపీలో కీలక నేతగా ఎదిగారు. 12 ఏళ్ల కిందట రోడ్డు ప్రమాదంలో ఎర్రన్నాయుడు కన్నుమూశారు. రెండో కొడుకు హరివరప్రసాద్ కోటబొమ్మాళిలో పీఏసీఎస్ అధ్యక్షుడిగా వ్యవహరించారు. మూడో కొడుకు ప్రభాకర్ పోలీస్ శాఖలో డీఎస్పీగా కొనసాగుతుండగా.. అచ్నెన్న టీడీపీ పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు.
Read Also : Vinukonda MLA Bolla Brahmanaidu : టీడీపీ నేతలపై వినుకొండ ఎమ్మెల్యే అసభ్య దూషణలు..