Ashok Gajapathi Raju: టీడీపీకి రాజీనామా చేసిన అశోక్ గజపతిరాజు
Ashok Gajapathi Raju: అధికారికంగా పార్టీ హైకమాండ్‌కు లేఖ పంపిన ఆయన, భావోద్వేగానికి గురయ్యారు. గత మూడు దశాబ్దాలుగా పార్టీతో తనకు ఉన్న అనుబంధాన్ని, కార్యకలాపాల్లో తన పాత్రను గుర్తు చేసుకుంటూ పార్టీని విడిచి వెళ్లడం బాధ కలిగిస్తోందన్నారు.
- By Sudheer Published Date - 06:28 PM, Fri - 18 July 25

తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు (Ashok Gajapathi Raju) గోవా గవర్నర్(Governor of Goa)గా నియమితులైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన టీడీపీ సభ్యత్వానికి, పోలిట్ బ్యూరో సభ్యత్వానికి రాజీనామా (Resignation from TDP membership and Politburo membership) చేశారు. అధికారికంగా పార్టీ హైకమాండ్‌కు లేఖ పంపిన ఆయన, భావోద్వేగానికి గురయ్యారు. గత మూడు దశాబ్దాలుగా పార్టీతో తనకు ఉన్న అనుబంధాన్ని, కార్యకలాపాల్లో తన పాత్రను గుర్తు చేసుకుంటూ పార్టీని విడిచి వెళ్లడం బాధ కలిగిస్తోందన్నారు.
Se* : సె** నిరాకరించినా విడాకులివ్వొచ్చు – బాంబే హైకోర్టు సంచలన తీర్పు
అశోక్ గజపతిరాజు సేవలను టీడీపీ నేతలు ప్రశంసల వర్షం కురిపించారు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర అభివృద్ధిలో ఆయన పోషించిన పాత్రను గుర్తు చేశారు. విశాఖ జిల్లాలోని పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాత్ర కీలకమని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనకు అన్ని విధాలుగా న్యాయం చేశారని, ఆయన నడిచే మార్గంలోనే తాను కొనసాగానని తెలిపారు. పసుపు శుభసూచకమని, దాన్ని నమ్మినవారు ఎదుగుతారని వ్యాఖ్యానించారు.
BRS : ఇప్పటికిప్పుడు ఎన్నికలువస్తే బిఆర్ఎస్ 100 సీట్లతో విజయం సాధిస్తుంది – కేటీఆర్
ఈ సందర్భంగా శుక్రవారం అశోక్ గజపతిరాజు కుటుంబ సభ్యులతో కలిసి విశాఖపట్నంలోని సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు, అధికారులు పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతం పలికారు. ఆలయ ప్రాంగణంలో ఆయనను మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ శాలువాతో సత్కరించారు. గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టే ముందు స్వామివారి ఆశీస్సులు తీసుకోవడం విశేషం. ఆయన రాజకీయ ప్రయాణం కొత్త మలుపు తిరిగిందని అనుకోవచ్చు.