AP Temple Tragedies : ఎందుకు.. ఏపీలో వరుసగా దేవాలయాల్లో విషాద ఘటనలు ?
AP Temple Tragedies : నేడు విశాఖ సింహాచలం చందనోత్సవం (Simhachalam Chandanotsavam)లో గోడకూలి ఎనిమిది మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారు
- By Sudheer Published Date - 01:07 PM, Wed - 30 April 25

ఆంధ్రప్రదేశ్‌లో ప్రముఖ దేవాలయాల్లో ఇటీవల వరుసగా జరిగే విషాద ఘటనలు(Temple Tragedies) భక్తుల్లో (Devotees) తీవ్ర ఆందోళనను రేకెత్తిస్తున్నాయి. నాలుగు నెలల్లో రెండు పెద్ద ప్రమాదాలు చోటుచేసుకోవడం అనేక ప్రశ్నలకు దారితీస్తోంది. జనవరిలో తిరుపతి వైకుంఠ ఏకాదశి (Tirupati Vaikuntha Ekadashi) సందర్భంగా తొక్కిసలాటలో ఆరుగురు మృతి చెందిన ఘటన మరువకముందే, నేడు విశాఖ సింహాచలం చందనోత్సవం (Simhachalam Chandanotsavam)లో గోడకూలి ఎనిమిది మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలతో “ఏం జరుగుతోంది? దేవుళ్లకు కోపం వచ్చిందా? లేక మానవ తప్పిదాల ఫలితమా? అంటూ భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
PM Modi AP Tour : వైఎస్ షర్మిల హౌస్ అరెస్ట్ .. ఏపీ రాజకీయాల్లో ఉద్రిక్తత
తిరుపతిలో టోకెన్ల జారీ సమయంలో అప్రమత్తంగా ఉండాల్సిన అధికారులు భక్తులను ఒక్కసారిగా క్యూలైన్‌ల్లోకి అనుమతించడం వల్ల తొక్కిసలాట చోటుచేసుకుంది. ఇదే తరహాలో సింహాచలంలో కూడా గోడ కూలి భక్తులే మృతి చెందారు. ఆలయ పరిసరాల్లో రిటైనింగ్ వాల్‌ను తక్కువ నాణ్యత గల ఫ్లైయాష్ బ్రిక్స్‌తో నిర్మించడం వల్ల వర్షపు నీరుతో అది కూలిపోయింది. ప్రమాద స్థలంలో నిర్మాణ నిబంధనలను పాటించకపోవడం, భద్రతా జాగ్రత్తలు లేకపోవడం వల్లే ఇంతటి ఘోరం జరిగిందని తెలుస్తుంది.
ఈ వరుస ఘటనల నేపథ్యంలో దేవాలయాల్లో భద్రతను పటిష్టం చేయాల్సిన అవసరం తీవ్రంగా ఏర్పడింది. మానవ తప్పిదాలు తిరగలేని ముప్పుగా మారుతున్నాయి. కొండ ప్రాంతాల్లో నిర్మాణాలు చేపడుతున్నప్పుడు నాణ్యమైన ఫౌండేషన్, కాంక్రీట్ నిర్మాణాలు తప్పనిసరి. స్వామి కోపిస్తే ఇలా జరుగుతుందన్న భక్తుల విశ్వాసం కంటే ముందు, యంత్రాంగం బాధ్యతగా వ్యవహరించాలి. లేదంటే, ఎప్పటికప్పుడు దేవాలయాలు విషాద వేదికలుగా మారే ప్రమాదం ఉంది.