AP : టీడీపీ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్..ఆ అకౌంట్ గా మార్చిన కేటుగాళ్లు…!!
ఈ మధ్యకాలంలో ట్విట్టర్ హ్యాకింగ్స్ కలకలం స్రుష్టిస్తున్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ లోని ప్రధాన ప్రతిపక్షం అయిన టీడీపీ అధికారిక ట్విట్టర్ అకౌంట్ హ్యాకింగ్ కు గురయ్యింది.
- Author : hashtagu
Date : 01-10-2022 - 4:59 IST
Published By : Hashtagu Telugu Desk
ఈ మధ్యకాలంలో ట్విట్టర్ హ్యాకింగ్స్ కలకలం స్రుష్టిస్తున్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ లోని ప్రధాన ప్రతిపక్షం అయిన టీడీపీ అధికారిక ట్విట్టర్ అకౌంట్ హ్యాకింగ్ కు గురయ్యింది. టీడీపీ ట్విట్టర్ ఖాతాను హ్యాక్ చేసిన కేటుగాళ్లు…టైలర్ హబ్స్ గా పేరుగా మార్చారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన పోస్టులు టీడీపీ ట్విట్టర్ ఖాతో కనిపిస్తున్నాయి. అంతేకాదు బయోలో తాను ఆర్టిస్టునని మార్చుకున్నాడు హ్యాకర్ . ఈ మేరకు ఏపీ టీడీపీ డిజిటల్ వింగ్ శనివారం ట్విట్టర్ వేదికగా ప్రకటన చేసింది. వైసీపీ మద్దతుదారులే తమ పార్టీ అధికారిక ట్విట్టర్ అకౌంట్ ను హ్యాక్ చేసినట్లు తెలిసిందని తెలిపింది. ఈ కుట్రను త్వరలోనే ఛేదిస్తామని వెల్లడించింది. గతంలో కూడా టీడీపీ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయ్యింది.
It felt like a good day to collect some wonderful art 🙂 https://t.co/yUSSfI3Ldg
— Tyler Hobbs (@tylerxhobbs) September 28, 2022