HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Ap Police Tdp Worker

AP : వైసీపీ జెండా కాల్చాడని.. వ్యక్తిని కొడుతూ నగ్నంగా ఊరేగించిన పోలీసులు

  • Author : Sudheer Date : 08-01-2024 - 9:34 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Lokesh Appolice
Lokesh Appolice

అధికారం చేతిలో ఉందని ఏపీలో పోలీసులు దారుణాలకు పాల్పడుతున్నారు. సభ్య సమాజం ఏమనుకుంటుందో..అసలు ఏంచేస్తున్నామో అనేది కూడా చూడకుండా..మీము మనుషులమే అనేది కూడా మరచిపోయే దారుణంగా ప్రవర్తిస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాలతో కొంతమంది పోలీసులు రెచ్చిపోతుంటే..మరికొంతమంది మీము పోలీసులం..మీము ఏం చేస్తే అదే కరెక్ట్ అనే తీరుగా ప్రవర్తిస్తున్నారు.

తాజాగా వైసీపీ జెండా కాల్చాడని టీడీపీ పార్టీకి చెందిన ఓ కార్యకర్తను పోలీసులు నగ్నంగా చేసి కొడుతూ ఊరేగించారు. ఈ ఘటన అనంతపురం జిల్లా విడ‌ప‌న‌క‌ల్లు మండ‌లం చీక‌ల‌గురిలో చోటుచేసుకుంది. దీనికి సంబదించిన వీడియో ను టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ట్విట్టర్ లో షేర్ చేసి ఆగ్రహం వ్యక్తం చేసారు.

We’re now on WhatsApp. Click to Join.

అనంతపురం జిల్లా విడ‌ప‌న‌క‌ల్లు మండ‌లం చీక‌ల‌గురిలో వైసీపీ జెండాను కాల్చేశార‌నే ఆరోప‌ణ‌ల‌పై టీడీపీ కార్యకర్త, బీసీ బోయ సామాజిక‌వ‌ర్గానికి చెందిన చంద్రమోహన్‌ను అరెస్టు చేసిన పోలీసులు.. న‌గ్నంగా కొడుతూ ఊరేగించిన ఘోరం చూశాక తన గుండె చెదిరిపోయిందన్నారు. వైసీపీ ఆదేశాల‌తో కొంద‌రు పోలీసులు వ్య‌వ‌హ‌రిస్తున్న‌ తీరుతో ప్ర‌జాస్వామ్యం సిగ్గుప‌డుతోందని లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

సభ్య సమాజం సిగ్గుపడే దారుణ ఘటన ఏపీలో చోటు చేసుకోవటం ఏపీలో రాక్షస పాలనకు నిదర్శనం అన్నారు. రాక్ష‌స రాజులు కూడా సైకో జ‌గ‌న్‌లాంటి దుర్మార్గ‌చ‌ర్య‌ల‌కు పాల్ప‌డ‌లేదని లోకేష్ విమర్శలు గుప్పించారు. స‌భ్య‌స‌మాజం త‌ల‌దించుకునేలా వ్య‌వ‌హ‌రించిన మీరు ప్ర‌జాధ‌నం జీతంగా తీసుకునే పోలీసులా ? ఫ్యాక్ష‌నిస్టు జ‌గ‌న్ కిరాయి సైన్య‌మా? అంటూ పోలీసులను లోకేష్ ప్రశ్నించారు.

ఒక క‌ర‌డుగ‌ట్టిన నేర‌గాడు పెట్టిన పార్టీ జెండా అంత ప‌విత్ర‌మైన‌దా అంటూ వైసీపీ జెండా గురించి వ్యాఖ్యలు చేసిన లోకేష్ జాతీయ జెండా పెడ‌తామ‌న‌డం నేర‌మా? అంటూ నిలదీశారు. మా టిడిపి సైనికుడు చంద్ర‌మోహ‌న్ ను న‌గ్నంగా ఊరేగించారు, ప‌క్క‌టెముక‌లు విర‌గ్గొట్టారు. మీరు చేసిన న‌ర‌రూప రాక్ష‌స చ‌ర్య‌ల‌కు చ‌ట్ట‌బ‌ద్ధ‌మైన శిక్ష అనుభ‌వించేందుకు సిద్ధంగా ఉండండి అంటూ లోకేష్ పోలీసులను హెచ్చరించారు.

ఇదొక్కటే వైసీపీ అండతో చాలామంది పోలీసులు చాలాసార్లు టీడీపీ కార్యకర్తలను అరెస్ట్ చేసి..జైల్లో చితకబాదిన ఘటనలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి. తాజాగా ఘటన తో ఇప్పుడు మరోసారి పోలీసుల తీరు బయటపడింది. ఈ ఘటన ఫై టీడీపీ శ్రేణులు , నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

వైకాపా ఆదేశాల‌తో కొంద‌రు పోలీసులు వ్య‌వ‌హ‌రిస్తున్న‌ తీరుతో ప్ర‌జాస్వామ్యం సిగ్గుప‌డుతోంది. రాక్ష‌స రాజులు కూడా సైకో జ‌గ‌న్‌లాంటి దుర్మార్గ‌చ‌ర్య‌ల‌కు పాల్ప‌డ‌లేదు. అనంతపురం జిల్లా విడ‌ప‌న‌క‌ల్లు మండ‌లం చీక‌ల‌గురిలో వైకాపా జెండాని కాల్చేశార‌నే ఆరోప‌ణ‌ల‌పై టిడిపి కార్యకర్త బీసీ… pic.twitter.com/9BLdFEiB67

— Lokesh Nara (@naralokesh) January 8, 2024

Read Also : World’s Rarest Blood Groups : ప్రపంచంలోనే అత్యంత అరుదైన బ్లడ్ గ్రూపు ఏదో మీకు తెలుసా..?


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Ananthapuram
  • ap police
  • nara lokesh
  • TDP worker

Related News

Nara Lokesh

AP ECET 2026 results: ఏపీ ఈసెట్‌ ఫలితాలు విడుదల : నారా లోకేశ్

ఆంధ్రప్రదేశ్‌లో ఇంజినీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఏపీ ఈసెట్-2026) ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ శుక్రవారం ఈ ఫలితాలను ‘ఎక్స్’ వేదికగా అధికారికంగా ప్రకటించారు. ఈ పరీక్షలో మొత్తం 91.72 శాతం ఉత్తీర్ణత నమోదైనట్టు ఆయన వెల్లడించారు. ఈ ఏడాది ఏప్రిల్ 23న రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన ఈ ప్రవేశ పరీక్షకు మొత్తం 32,434 మంది విద్యార్థులు హాజరు కాగా, వారిలో 29,7

    Latest News

    • Amazon Great Summer Sale : హై-ఎండ్ హెడ్‌ఫోన్లపై డిస్కౌంట్లు

    • Amazon : కిరాణా సామాగ్రిపై 50% ఆఫ్.. అమెజాన్ సమ్మర్ సేల్ 2026 టాప్ డీల్స్ ఇవే!

    • CM Vijay: సీఎంకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు

    • Weight Loss: సడెన్‌గా బరువు తగ్గారా..?

    • CM Joseph Vijay: మీ విజయ్‌ మామ అండగా ఉంటాడు : సీఎం విజయ్‌

    Trending News

      • TVK విజయ్‌ అను నేను..

      • CM VIJAY: టీవీకేకు వీసీకే మద్దతు: ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్

      • CM Vijay Thalapathy: ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్..!

      • Tamil Nadu Politics: విజయ్ను ముప్పుతిప్పలు పెడుతున్న VCK.. డిప్యూటీ సీఎం పదవి ఇస్తేనే

      • Cm Thalapathy Vijay: విజయ్‌కి లైన్ క్లియర్!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd