Nadendla Manohar : శ్రీవారిని దర్శించుకున్న మంత్రి నాదెండ్ల మనోహర్
AP Minister Nadendla Manohar : తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) అధికారులు ఆయనకు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికి, ఆలయ నిబంధనల ప్రకారం స్వామివారి దర్శనం ఏర్పాట్లు చేశారు.
- By Sudheer Published Date - 09:01 PM, Sun - 3 November 24

రాష్ట్ర ఆహారం, పౌరసరఫరాలు, వినియోగదారుల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ (AP Minister Nadendla Manohar) తన కుటుంబ సభ్యులతో కలిసి నేడు తిరుమల (Tirumala)లో శ్రీవారిని దర్శించుకున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) అధికారులు ఆయనకు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికి, ఆలయ నిబంధనల ప్రకారం స్వామివారి దర్శనం ఏర్పాట్లు చేశారు. స్వామివారి దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు నాదెండ్ల మనోహర్, ఆయన కుటుంబ సభ్యులకు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. అలాగే, ఆలయం వెలుపల మంత్రి నాదెండ్ల మనోహర్‌ను కలిసేందుకు జనసేన అభిమానులు, నాయకులు భారీగా తరలివచ్చారు. మంత్రి తో సెల్ఫీలు దిగేందుకు అభిమానులు ఉత్సాహంగా పోటీ పడడం విశేషం.
నాదెండ్ల మనోహర్ ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో ప్రశంసలు పొందిన నేత. ఆయన సుదీర్ఘ రాజకీయ అనుభవంతో, నిఖార్సయిన సేవలతో ప్రజల మన్ననలు పొందారు. నాదెండ్ల మనోహర్ రాజకీయ ప్రస్థానం కాంగ్రెస్ పార్టీతో ప్రారంభమైంది, అయితే 2019లో జనసేనలో చేరి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో రాష్ట్రానికి సేవలు అందిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్‌గా పనిచేసిన కాలంలో ఆయన పార్లమెంటరీ ప్రక్రియలపై మంచి పట్టుదల చూపారు. స్పీకర్ పదవిలో ఉన్నప్పుడే ఆయన నిష్పక్షపాతంగా వ్యవహరించడంతో, సభా కార్యకలాపాలు సజావుగా సాగాయి. జనసేనలో ఆయన కీలక నేతగా కొనసాగుతూ.. పార్టీ అభివృద్ధి, రాష్ట్ర సమస్యల పరిష్కారంలో ఆయన పూర్తి స్థాయిలో కృషి చేస్తూ వస్తున్నారు. ఇక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆయనకు ఆహారం, పౌరసరఫరాలు, వినియోగదారుల శాఖ మంత్రిగా బాధ్యతలు అప్పగించారు. ఈ శాఖలో ఆయన తన మార్క్ కనపరుస్తూ వస్తున్నారు.
Read Also : Ration card : సంక్రాంతి తర్వాత సన్నబియ్యం పంపిణీ : మంత్రి ఉత్తమ్..!