AP High Court given Green Signal for Amaravati Farmers: అమరావతి రైతులకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్
గతంలో ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం మహాపాదయాత్రను కొనసాగించడానికి అనుమతి ఇవ్వాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది.
- By Hashtag U Published Date - 04:52 PM, Tue - 1 November 22

గతంలో ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం మహాపాదయాత్రను కొనసాగించడానికి అనుమతి ఇవ్వాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. ఒక వేళ రైతులు మార్గదర్శకాలను ధిక్కరిస్తే కోర్టుకు తెలియచేయాలని సూచించింది. ఐడీ కార్డులను వెంటనే జారీ చేయడం ద్వారా పాదయాత్రకు భద్రత కల్పించాలని పోలీసులకు ఆదేశాలను జారీ చేసింది. ఏపీ హైకోర్టు ఇచ్చిన డైరెక్షన్ మేరకు తిరిగి మహా పాదయాత్ర ప్రారంభం కానుంది.
అమరావతిని ఏకైక రాజధానిగా కోరుతూ రైతులు చేస్తున్న పాదయాత్రను నిలిపివేయాలంటూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించిన రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్‌ను తిరస్కరించింది. రైతులు వెంటనే పాదయాత్ర ప్రారంభించవచ్చని కోర్టు తీర్పునిచ్చింది. మార్గదర్శకాల ప్రకారం గుర్తింపు కార్డులు ఉన్న వ్యక్తులు మాత్రమే యాత్రలో పాల్గొనడానికి అనుమతిస్తారు. యాత్రకు సంబంధించి గతంలో ఇచ్చిన తీర్పును సవరించబోమని మంగళవారం హైకోర్టు తీర్పునిచ్చింది.
Also Read: Jagan Master Sketch on Amaravati: జగన్ మాస్టర్ స్కెచ్, అమరావతి రైతులు ఔట్!
గత పాదయాత్రకు సంబంధించిన ఆదేశాలకు అనుగుణంగా యాత్రను అనుకున్న విధంగా కొనసాగించాలని కోర్టు తీర్పునిచ్చింది. గుర్తింపు కార్డులు ఉన్న రైతులు మాత్రమే యాత్రకు హాజరు కావాలని కోర్టు తీర్పునిచ్చింది. యాత్రలో పాల్గొనే రైతులకు త్వరగా గుర్తింపు కార్డులు అందించాలని పోలీసులను ఆదేశించింది. పాదయాత్రకు మద్దతిచ్చే వారెవరైనా సరే తమ మద్దతును ఏ విధంగానైనా తెలియజేయవచ్చని పేర్కొంది. యాత్రలో పాల్గొనే రైతులు కోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తే తమను సంప్రదించాలని కోర్టు పోలీసులను ఆదేశించింది.