AP Formation Day : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అవతరణ గురించి తెలుసా..?
AP Formation Day : దేశంలో తొలి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గుర్తింపు పొందింది. భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పాటు చేయాలన్న అమరజీవి పొట్టి శ్రీరాములు గారి ఆలోచన నిజమైన రోజది
- By Sudheer Published Date - 09:16 AM, Fri - 1 November 24

AP Formation Day : పొట్టి శ్రీరాములు దీక్ష, ప్రాణత్యాగంతో 1953 అక్టోబర్ 1న ఆంధ్రరాష్ట్రం అవతరించింది. తెలుగు వారంతా ఒకే రాష్ట్రంగా ఉండాలనే ప్రతిపాదన తెరపైకి వచ్చింది. కొందరు దీన్ని వ్యతిరేకించినప్పటికీ విస్తృత చర్చల తర్వాత ఆంధ్రరాష్ట్రం, హైదరాబాద్ (తెలంగాణ) కలయికతో 1956 నవంబర్ 1న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆవిర్భవించింది (AP Formation Day).
దేశంలో తొలి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గుర్తింపు పొందింది. భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పాటు చేయాలన్న అమరజీవి పొట్టి శ్రీరాములు గారి ఆలోచన నిజమైన రోజది. ఆ రోజునే ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవంగా జరుపుకుంటూ వచ్చారు. 2014 జూన్ 2న రాష్ట్రం విడిపోయిన తర్వాత చంద్రబాబు ప్రభుత్వం సంప్రదాయంగా వస్తున్న అవతరణ దినోత్సవానికి స్వస్తి పలికి, జూన్ 2న నవ నిర్మాణ దీక్షల పేరుతో కొట్ల రూపాయల ప్రజాధనాన్ని ధుర్వినియోగం చేసింది. ఇప్పుడు తెలంగాణ లేదు కాబట్టి పూర్వపు ఆంధ్రరాష్ట్ర అవతరణ అయిన అక్టోబర్ 1న జరుపుకోవాలనే ఒక వాదన ఉన్నప్పటికినీ మొదటి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్ర ప్రదేశ్ ఏర్పడిన నవంబర్ 1న మాత్రమే అవతరణ దినోత్సవాన్ని జరపాలని ప్రస్తుత వై యస్ జగన్ ప్రభుత్వం నిర్ణయించి పాత సాంప్రదాయాన్నే పాటిస్తుంది. ఆంధ్రప్రదేశ్ నుండి విడిపోయి కొత్తగా ఏర్పడిన రాష్ట్రం తెలంగాణ కాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం ఎలా మారుతుందని ఎక్కువ మంది అభిప్రాయం.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఏపీ అవతరణ దినోత్సవం ఎప్పుడనే ప్రశ్న ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైన నుంచి నవంబర్ ఒకటో తేదీని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అవతరణ దినోత్సవంగా నిర్వహించేవారు. దాదాపు ఆరు దశాబ్దాలపాటు నవంబర్ 1న తెలుగు వాళ్లు ఆంధ్రప్రదేశ్ అవతోరణోత్సవాలు జరుపుకుంటూ వచ్చారు. 2014 జూన్ 2 న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించింది. ఆ తర్వాత జూన్ రెండో తేదీని తెలంగాణ అవతరణ దినోత్సవంగా జరుపుకుంటూ వస్తున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని ఎప్పుడు జరపాలనే దానిపై గందరగోళం నెలకొంది. టీడీపీ ప్రభుత్వ హయాంలో జూన్ 2న నవ నిర్మాణ దీక్షలను నిర్వహించింది. అనంతరం వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నవంబర్ 1న అవతరణ దినోత్సవాలు నిర్వహించింది.
Read Also : NTR : ‘దేవర’ సక్సెస్ తర్వాత ఫ్యామిలీతో ఎన్టీఆర్ దీపావళి.. అభయ్ రామ్ ఎంత పెద్దోడు అయ్యాడో..