YS Jagan: సీఎం జగన్ అనంతపురం పర్యటన రద్దు
రేపు సోమవారం అనంతపురం జిల్లాలో జగనన్న వసతి దీవెన కార్యక్రమంలో పాల్గొననున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్
- By Praveen Aluthuru Published Date - 11:23 AM, Sun - 16 April 23

YS Jagan: రేపు సోమవారం అనంతపురం జిల్లాలో జగనన్న వసతి దీవెన కార్యక్రమంలో పాల్గొననున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్. అయితే అనూహ్యంగా షెడ్యూల్ లో మార్పు జరిగింది. రేపటి సీఎం పర్యటన రద్దయింది. ఈ విషయాన్ని స్థానిక ఎమ్మెల్యే అధికారికంగా ప్రకటించారు. అనంతపురం జిల్లాలోని శింగనమల నియోజకవర్గం నార్పల మండల కేంద్రంలో జగనన్న వసతి దీవెన కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హాజరై వసతి దీవెన పథకంలో భాగంగా లబ్ధిదారులకు చెక్కులు పంపిణి చెయ్యాలని నిశ్చయించుకున్నారు. అయితే అనివార్య కారణాల వల్ల రేపు సీఎం జగన్ పర్యటన రద్దు అయినట్లు సమాచారం.
సీఎం జగన్ పర్యటన రద్దైన క్రమంలో తదుపరి పర్యటన తేదీని త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు స్థానిక జిల్లా కలెక్టర్ గౌతమి. సీఎంఓ నుంచి స్పష్టమైన సమాచారం వచ్చిన తర్వాత జగనన్న వసతి దీవెన కార్యక్రమం తేదీని ప్రకటిస్తామని తెలిపారు.
Read More: Amazon Layoffs: 27,000 మంది ఉద్యోగులను తొలగించటానికి కారణాలేంటో చెప్పిన అమెజాన్ సీఈవో..!