AP CM JAGAN: దేవిక కుటుంబానికి రూ.10లక్షల ఆర్థిక సాయం..!!
కాకినాడ ఘటనపై ఏపీ ఎసీ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనపై కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబుతో ఫోన్ లో మాట్లాడారు.
- By hashtagu Published Date - 11:40 AM, Sun - 9 October 22

కాకినాడ ఘటనపై ఏపీ ఎసీ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనపై కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబుతో ఫోన్ లో మాట్లాడారు. యువతి దేవిక కుటుంబానికి అండగా నిలవాలని జగన్ ఆదేశించారు. దేవిక కుటుంబానికి పదిలక్షల రూపాయల ఆర్థిక సాయం ప్రకటించారు. దిశ చట్టం కింద నిందితుడిని శిక్షించాలని పోలీసులను ఆదేశించారు. విచారణ పూర్తి చేసి ఛార్జిషీటు దాఖలు చేయాలన్నారు. బాధిత కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకోవాలని సీఎం సూచించారు.
దేవిక స్వగ్రామం కోనసీమ జిల్లా రామచంద్రాపురం మండలం గంగవరం. కరప మండలం కూరాడ గ్రామంలో అమ్మమ్మ వద్ద ఉంటూ డిగ్రీ పూర్తి చేసింది. పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తోంది. బాలవరం గ్రామానికి చెందిన గుబ్బల సూర్యనారాయణ కూడా కూరాడలో అమ్మమ్మ ఇంటి వద్దే ఉంటున్నాడు. కొంతకాలంగా వీరిద్దరి మధ్య పరిచయం ఉంది. వీరి ప్రేమ తెలిసిన కుటుంబ సభ్యులు పెళ్లి ప్రయత్నాలు చేశారు. అయితే అది కుదరలేదు. సూర్యనారాయణకు తమ కూతురును ఇవ్వడానికి దేవిక కుటుంబం ఒప్పుకోలేదు. సూర్యనారాయణకు దూరంగా ఉండటంతో..దేవిక మరోకరితో సన్నిహితంగా ఉంటున్న సూర్యనారాయణ అనుమానించాడు. ఆమె పై పగ పెంచుకున్నాడు. ఈ క్రమంలోనే దేవికపై దాడి చేశాడు.