HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Ap Cid Files Pt Warrant Against Chandrababu In Fibernet Scam Case

AP : చంద్రబాబు ఫై మరోకేసు నమోదు చేసిన CID

ఏపీ ఫైబర్ నెట్ స్కాంపై సీఐడీ పీటీ వారెంట్ వేసింది. టెర్రా సాఫ్ట్ కి అక్రమంగా టెండర్లు ఇచ్చారని సీఐడీ ఆరోపించింది. అందులో చంద్రబాబును ప్రధాన ముద్దాయిగా సీఐడీ పేర్కొంది.

  • Author : Sudheer Date : 19-09-2023 - 7:16 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt

టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) ఫై AP CID మరో కేసు నమోదు చేసింది. స్కిల్ డెవలప్ మెంట్ (Skill Development) లో స్కామ్ కు పాల్పడ్డారంటూ చంద్రబాబు ఫై ఇప్పటికే కేసు నమోదు చేసి జైల్లో పెట్టిన CID ..ఈ కేసు ఇంకా నడుస్తుండగానే మరో కేసు పెట్టింది. ఏపీ ఫైబర్ నెట్ స్కాం (AP Fiber Net Scam)పై సీఐడీ పీటీ వారెంట్ వేసింది. టెర్రా సాఫ్ట్ (Terasoft) కి అక్రమంగా టెండర్లు ఇచ్చారని సీఐడీ ఆరోపించింది. అందులో చంద్రబాబును ప్రధాన ముద్దాయిగా సీఐడీ పేర్కొంది. ఆ పిటిషన్‌ను ఏసీబీ కోర్టు విచారణకు స్వీకరించింది.

టెరాసాఫ్ట్ కంపెనీకు నిబంధనలకు విరుద్దంగా ఫైబర్ నెట్ కాంట్రాక్ట్ ఇచ్చారనేది ఈ కేసులోని ప్రధాన ఆరోపణ. పీటీ వారెంట్ ఫైల్ నంబర్ 2916/2023. రూ.121 కోట్ల నిధులు గోల్ మాల్ అయ్యాయని దర్యాప్తులో తేలినట్లు సిట్ ఆరోపిస్తోంది. కాగా.. 2021 లోనే ఫైబర్ నెట్ కుంభకోణంలో 19 మందిపై సీఐడీ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. అప్పటి ఎఫ్ఐఆర్‌లో A1గా వేమూరి హరిప్రసాద్, A2గా మాజీ MD సాంబశివరావును సీఐడీ చేర్చింది. ఒకటి తర్వాత ఒకటి అక్రమ కేసు పెట్టి చంద్రబాబును ఎన్నికల ముందు టార్గెట్ చేస్తున్నారని రాజకీయ, న్యాయ నిపుణులు చెబుతున్నారు.

ఇక పీటీ వారెంట్ అంటే (ప్రిజనర్ ఇన్ ట్రాన్సిట్ – Prisoner in Transit). ఇప్పటికే జైలులో ఉన్న ఖైదీని మరో కేసులో విచారణ కోసం, జైలు నుంచి ఇంకో ప్రాంతానికి తరలించేలా కోర్టు అనుమతి కోరడం. మరోపక్క ఇన్నర్ రింగ్ రోడ్డు విషయంలో చంద్రబాబుపై ఏసీబీ కోర్టులో పీటీ వారెంట్ ఉన్న సంగతి తెలిసిందే. ఈ కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై ఈరోజు విచారణ కూడా జరిగింది. ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ ఈనెల 21 కి వాయిదా పడింది. కౌంటర్ దాఖలు చేసేందుకు ప్రభుత్వం తరఫు న్యాయవాదులు సమయం కోరడంతో విచారణ వాయిదా పడింది. ఇంకోవైపు స్కిల్ డెవలప్మంట్ కేసులో క్వాష్ పిటిషన్‌పై ఏపీ హైకోర్టు తీర్పును రిజర్వులో పెట్టింది. రెండ్రోజుల తర్వాత కోర్టు తీర్పును వెలువరించనుంది. ఇలా వరుస కేసుల ఫై విచారణ జరుగుతుండగానే..మరో కేసు పెట్టింది ప్రభుత్వం. మరి వీటిన్నింటి నుండి చంద్రబాబు ఎప్పుడు బయటపడతారో అని టీడీపీ శ్రేణులు ఖంగారుపడుతున్నారు.

Read Also : Women’s Reservation Bill : మహిళా నేతలను కించపరిచే విధంగా ఖర్గే మాట్లాడారంటూ బిజెపి ఫైర్

ఇప్పటికే చంద్రబాబు జైల్లో వేసిన దగ్గరి నుండి టీడీపీ శ్రేణులు , అభిమానులు మనోవేదనకు గురై ఆత్మహత్య చేసుకోవడం..గుండెపోటు తో మరణించడం జరుగుతుంది. ఇప్పటివరకు దాదాపు 30 మంది చనిపోయారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • AP CID
  • ap cid pt warrant
  • AP Fiber Net Scam
  • chandrababu

Related News

Pemmasani Vs Ambati

Pemmasani Vs Ambati : వచ్చే ఎన్నికల్లో బ్యాలెట్ తో తంతే అమెరికాలో పడతావ్ జాగ్రత్త – పెమ్మసాని కి అంబటి కౌంటర్

ప్రస్తుత పరిణామాలు గమనిస్తుంటే ఏపీలో టీడీపీ-వైసీపీ మధ్య వైరం కేవలం విధానపరమైన విమర్శలకే పరిమితం కాకుండా, వ్యక్తిగత దూషణల స్థాయికి చేరుకుంది. కేంద్రమంత్రి స్థాయిలో ఉన్న పెమ్మసాని 'చంపేస్తాం' అనే అర్థం వచ్చేలా మాట్లాడటంపై వైసీపీ నేతలు మండిపడుతుండగా

  • Lokesh Rtd2

    Rural Development Trust: మాట ఇచ్చారు.. మడమ తిప్పకుండా నెరవేర్చారు దటీజ్ నారా లోకేష్

Latest News

  • Challapalli Police Station: చల్లపల్లి పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు..

  • Peddi : ‘పెద్ది’ చిత్ర యూనిట్ కు క్షమాపణలు చెప్పిన మెగా ప్రొడ్యూసర్

  • New Rules: ఏప్రిల్ 1 నుంచి కొత్త రూల్స్..

  • Gold Price : మళ్లీ దడ పుట్టిస్తున్న బంగారం ధరలు..ఈరోజు తులం ఎంత పెరిగిందంటే !!

  • Vijayawada Durga Temple: దుర్గ గుడి లో సిబ్బంది చేతివాటం

Trending News

    • వివాహిత స్త్రీ ద‌గ్గ‌ర ఎంత బంగారం ఉండొచ్చు?

    • రూ. 25.20 కోట్లకు కొనుగోలు.. బౌలింగ్‌కు దూరంగా ఆల్‌రౌండ‌ర్‌?!

    • Green S** : పర్యావరణ హిత శృంగారాన్ని కోరుకుంటున్న యువత ..ఏంటి పర్యావరణ హిత శృంగారం ?

    • నేడు సీఎస్కే- ఆర్ఆర్ మ‌ధ్య పోరు.. హెడ్-టు-హెడ్ రికార్డులివే!!

    • AP Assembly: అమరావతికి చట్టబద్ధత

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd