AP Cabinet : రేపు ఏపీ కేబినెట్ సమావేశం…చర్చించే అంశాలు ఇవేనా..?
AP Cabinet : సచివాలయంలో ఉదయం 11 గంటలకు సీఎం చంద్రబాబు (CM Chandrababu) అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో వివిధ కీలక ప్రతిపాదనలపై రాష్ట్ర మంత్రివర్గం చర్చించనుంది.
- By Sudheer Published Date - 06:57 PM, Wed - 9 October 24

భారీ మెజార్టీ తో విజయం సాధించి అధికారం చేపట్టిన కూటమి..ప్రజలకు మెరుగైన పాలనా అందిస్తూ ప్రజల మన్నలను పొందుతుంది. ఇప్పటికే పలు హామీలను నెరవేర్చిన సర్కార్…త్వరలో మిగతా హామీలను కూడా నెరవేర్చే విధంగా ప్రణాళిక సిద్ధం చేస్తుంది. ఇదిలా ఉండగా రేపు కేబినెట్ సమావేశం (AP Cabinet) నిర్వహించబోతుంది. సచివాలయంలో ఉదయం 11 గంటలకు సీఎం చంద్రబాబు (CM Chandrababu) అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో వివిధ కీలక ప్రతిపాదనలపై రాష్ట్ర మంత్రివర్గం చర్చించనుంది.
వరద ప్రభావిత ప్రాంతాల్లో రుణాల రీ షెడ్యూల్ కు సంబంధించి స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజుల మినహాయింపు , చెత్త పన్ను రద్దు ,13 కొత్త మున్సిపాలిటీల్లో 190 కొత్త పోస్టుల భర్తీ , వివిధ దేవాలయాలకు పాలక మండళ్ల నియామకంలో చట్ట సవరణ వంటి అంశాల ప్రతిపాదనపై చర్చించనున్నారు. దేవాలయాల పాలక మండలిని 15 మంది నుంచి 17 మందికి పెంచే ప్రతిపాదనపై చర్చించి, పాలక మండళ్లలో ఇద్దరు బ్రాహ్మణులను సభ్యులుగా నియమించే అంశంపై ఓ నిర్ణయం తీసుకునే చాన్సుఉంది. ఆలాగే రాష్ట్ర శాసనసభ నిర్వహణ, ఆర్ధిక సంవత్సరంలో మిగిలిన ఆరు నెలల కాలానికి బడ్జెట్ , మల్లవల్లి పారిశ్రామిక పార్కులో భూ కేటాయింపుల విషయం , ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్ల పంపిణీ పథకం , సంక్రాంతి నుంచి పీ-4 విధానం అమలు వంటి అంశాల పై కూడా మంత్రివర్గంలో చర్చ జరిగే ఛాన్స్ ఉంది.