HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Andhra Pradesh
  • >Andhrapradesh Cabinet Highlights

AP Cabinet Highlights : ఏపీ క్యాబినెట్ హైలైట్స్

AP Cabinet Highlights : భూ ఆక్రమణదారులపై ఉక్కుపాదం మోపేందుకు ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ప్రొహిబిషన్‌ (Prohibition of Land Grabbing Act)కు ఆమోదం తెలిపారు

  • By Sudheer Published Date - 04:15 PM, Wed - 6 November 24
  • daily-hunt
Ap Cabinet Meeting Highligh
Ap Cabinet Meeting Highligh

చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఏపీ క్యాబినెట్ సమావేశం ముగిసింది.  చంద్రబాబునాయుడు అధ్యక్షతన రాష్ట్రసచివాలయంలో జరిగిన ఐదో ఇ-క్యాబినెట్ సమావేశంలోపలు కీలక అంశాలపై తీసుకున్న నిర్ణయాలను రాష్ట్ర సచివాలయం నాల్గవ భవనం ప్రచార విభాగంలో రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖామాత్యులు శ్రీ కొలుసు పార్థసారధి మీడియాకు వివరించారు

1.మౌలిక సదుపాయాలు మరియు పెట్టుబడులు:
-ఆంధ్రప్రదేశ్ డ్రోన్ పాలసీ 4.0 కి మంత్రిమండలి ఆమోదం తెలిపింది..డ్రోన్ వినియోగాభిరుచిని పెంచేలా.. అత్యవసర, ఇతర సేవలను వేగవంతం చేసేలా రాష్ట్ర డ్రోన్‌ కార్పొరేషన్‌ రూపొందించిన ఈ పాలసీకి ఆమోదం తెలపడం జరిగింది..
-రాష్ట్రాన్ని డ్రోన్‌ హబ్‌గా మార్చే దిశగాప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. దీనికోసం కర్నూలులో డ్రోన్‌ డెవల్‌పమెంట్‌ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
-ప్లగ్ అండ్‌ ప్లే విధానంలో డ్రోన్‌ డెవల్‌పమెంట్‌, ట్రైనింగ్‌, తయారీ కేంద్రాన్ని కర్నూలులో ఏర్పాటు చేయడం జరుగుతుంది..
-ఈ పాలసీతో రాష్ట్రంలో వందకుపైగా డ్రోన్‌ తయారీ కంపెనీలు ఏర్పాటవుతాయి.
-దాదాపు 20 డ్రోన్‌ పైలట్‌ శిక్షణ కేంద్రాలు, 50 నైపుణ్యాభివృద్ధి సంస్థలను స్థాపించే అవకాశం ఉంటుంది.
-డ్రోన్‌ రంగంలో రూ.1,000 కోట్ల పెట్టుబడులు, రూ.3,000 కోట్ల రాబడి వస్తుందని అంచనా.డ్రోన్‌ పాలసీతో ప్రత్యక్షంగా 15 వేల మందికి, పరోక్షంగా 25 వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి.

2.ఇన్పర్మేషన్ టక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ మరియు కమ్యూనికేషన్స్:
-ఆంధ్రప్రదేశ్ డేటా సెంటర్ పాలసీ 4.0 కి మంత్రిమండలి ఆమోదం తెలిపింది.
-ఈ పాలసీ ద్వారానియమితకాలంలో ఆంధ్రప్రదేశ్‌లో 200 మెగావాట్ల అదనపు డేటా సెంటర్ సామర్థ్యాన్ని చేర్చడమే లక్ష్యం.
-కృత్రిమ మేధస్సు (AI) సామర్థ్యాలతో కూడిన అధునాతన డేటా సెంటర్ల నుండి పెట్టుబడులను ఆకర్షించడానికి మరియు పెద్ద స్థాయి డేటా ఎంబసీల మరియు డేటా సెంటర్ పార్కులకు ఆకర్షణీయమైన గమ్యస్థానంగా ఆంధ్రప్రదేశ్నుమార్చడంపైదృష్టి సారించడం జరుగుతుంది.
-ప్రతిపాదిత డేటా సెంటర్ విధానం (4.0) 2024-29 ఆధునిక డేటా సెంటర్ల నుండి ఆర్థిక పెట్టుబడులను ఆకర్షించడానికి ఆశించబడుతోంది.

3.ఇన్పర్మేషన్ టక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ మరియు కమ్యూనికేషన్స్:
-ఆంధ్రప్రదేశ్ సెమీకండక్టర్ అండ్ డిస్‌ప్లే ఫ్యాబ్ పాలసీ (4.0) కి మంత్రిమండలి ఆమోదం తెలిపింది
-సెమీకండక్టర్ల రంగంలో పెట్టుబడుల ఆకర్షణ లక్ష్యంగా ప్రభుత్వం మొదటిసారి ప్రత్యేకంగా తీసుకొచ్చిన ఆంధ్రప్రదేశ్ సెమీకండక్టర్ అండ్ డిస్‌ప్లే ఫ్యాబ్ పాలసీ 4.0 కి మంత్రిమండలి ఆమోదం తెలిపింది.
-2024-29 మధ్య కాలంలో అమలు ఉండేలా దీనిని రూపొందించడం జరిగింది..
-కేంద్రం 50 శాతం రాయితీని దశలవారీగా అందజేయడం జరుగుచున్నది. దీనికి అదనంగా రాష్ట్ర ప్రభుత్వం మరో 30 శాతం వరకూ పలు రకాల రాయితీలను అందించనున్నది.
-అమెరికా, యూరప్ దేశాలకు సంబంధించిన పలు సెమీ కండక్టర్ల తయారీ పరిశ్రమలు గుజరాత్, కర్ణాటక, మహారాష్ట్రల్లో ఏర్పాటయ్యాయి..అదేవిధంగాఆంధ్రప్రదేశ్ ను కూడా తీర్చిదిద్దేందుకు ఈపాలసీ ఎంతగానో ఉపయోగపడుతుంది.
-ఆయా రాష్ట్రాల్లో పెట్టుబడులు పెట్టే సంస్థలకు కేంద్ర ప్రభుత్వం కూడా ప్రోత్సాహకాలు ఇస్తోంది..దాదాపు 30 శాతం రాయితీలను రాష్ట్రప్రభుత్వం ఇవ్వడం జరుగుతుంది.
-ఈ నేపథ్యంలో.. చిప్‌లు, సెమీకండక్టర్ల తయారీ రంగంలో విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వ ఈ కొత్త విధనాన్ని తీసుకు వచ్చింది.
-డ్రోన్ పాలసీ మరియు సెమీకండక్టర్ అండ్ డిస్‌ప్లే ఫ్యాబ్ పాలసీల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం పలు ప్రోత్సాహకాలు కూడా ఇవ్వడం జరుగుతుంది..

4.రెవిన్యూ (ల్యాండ్స్):
-A.P. ల్యాండ్ గ్రాబింగ్ (నిషేధం) చట్టం -1982 ని రద్దు చేస్తూ A.P ల్యాండ్ గ్రాబింగ్ (నిషేధం) బిల్లు-2024 అమలుకు సంబంధించిన ముసాయిదా బిల్లు ఆమోదం కోసం చేసిన ప్రతిపాదనకు రాష్ట్రమంత్రి మండలి ఆమోదం తెలిపింది.
-ల్యాండ్గ్రాబింగ్కుపాల్పడేవారిని కఠినంగా శిక్షించే విధంగా ఈ చట్టాన్ని రూపొందిస్తున్నాము.
-10 నుండి 14 సంవత్సరాలు పాటు శిక్ష, గ్రాబ్ చేయ బడిన ల్యాండ్ విలువతో పాటు నష్టపరిహారాన్ని కూడా వసూలు చేయడం జరుగుతుంది.
-గుజరాత్, కర్ణాటలోని చట్టాలను కూడా పరిగణిలోకి తీసుకుంటూ ఈ చట్టాన్ని రూపొందించండ జరిగింది.
-ప్రభుత్వ భూముల రక్షణకు పదునైన చట్టం అమల్లోకి తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నకసరత్తులోభాగంగాప్రభుత్వంఈనిర్ణయంతీసుకుంది.
-గత ప్రభుత్వహయాంలో లక్షల ఎకరాలు అన్యాక్రాంతం అయినట్టు కూటమి ప్రభుత్వం గుర్తించింది.
5.పంచాయితీరాజ్&గ్రామీణాభివృద్ది:
-2014-19మధ్యకాలంలోజరిగిన అభివృద్ధి పనులకు గత ప్రభుత్వం చెల్లింపులు చేయకపోగా వారిపై విజిలెన్స్ ఎంక్వైరీ వేసి ఆర్థికంగా, మానసికంగా వేధించడంతో వారందరూ కోర్టును ఆశ్రయించారు.
-ఈ నేపథ్యంలో.. 4.45 లక్షల పనులకు సంబంధించి గుత్తేదారులకు రూ.331 కోట్లు చెల్లించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. సదరు కాంట్రాక్టర్లకు 12 శాతం వడ్డీ కూడా ఇవ్వాలన్న విషయంపై ప్రభుత్వం పరిశీలన చేస్తోంది.
6.ఆర్థిక శాఖ:
-ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ఎంప్లాయ్‌మెంట్ (రెగ్యులేషన్ ఆఫ్ ఏజ్ ఆఫ్ సూపర్‌యాన్యుయేషన్) చట్టం – 1984 పరిధిలోకి వచ్చే జ్యుడీషియల్ ఆఫీసర్ల పదవీ విరమణ వయస్సును 60 నుండి 61 సంవత్సరాలకు తే.01.11.2024దీనుండి పెంచడానికి సంబందిత చట్టంలోని సెక్షన్ 3(1Α) ని సవరించడానికి రూపొందించిన ముసాయిదా బిల్లుకు రాష్ట్రమంత్రి మండలి ఆమోదం తెలిపింది.
7.రెవిన్యూ (వాణిజ్యపన్నులు):
-ఆంధ్రప్రదేశ్ వస్తువులు మరియు సేవల పన్ను చట్టం, 2017 (2017 చట్టం 16)ను సవరిస్తూ ఆంధ్రప్రదేశ్ వస్తువులు మరియు సేవల పన్ను (సవరణ) బిల్లు, 2024 ముసాయిదా బిల్లుకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
8.రెవిన్యూ (ఎక్సైజ్):
-ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ (సవరణ) ఆర్డినెన్స్, 2024 (A.P. ఆర్డినెన్స్ నం.4 ఆఫ్ 2024), ఆంధ్రప్రదేశ్ ప్రొహిబిషన్ (సవరణ) ఆర్డినెన్స్, 2024 (A.P. ఆర్డినెన్స్నెం.5 ఆఫ్ 2024) మరియు ఆంధ్రప్రదేశ్ (ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్, ఫారిన్ లిక్కర్‌లో వాణిజ్య నియంత్రణ) ఆర్డినెన్స్, 2024 (Α.Ρ. ఆర్డినెన్స్ నం.6ఆఫ్ 2024) తదితర ఆర్డినెన్సుల స్థానంలో రూపొందించబడిన మూడు ముసాయిదా బిల్లులకు రాష్ట్రమంత్రి మండలి ఆమోదం తెలుపుతూ రాష్ట్రశాస సభ ముందుంచేందుకు అనుమతించింది.
-నాసిరకం మద్యంతో గత ప్రభుత్వం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడితే.. మా ప్రభుత్వం ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని నూతన మద్యం విధానం అమలు చేయడం జరుగుతోంది.
9.సాధారణపరిపాలనావిభాగం (GAD):
-చిత్తూరు జిల్లా కుప్పం ప్రధాన కేంద్రంగా కుప్పం ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ (KADA) పునరుద్దరణకు మరియు దాని పరిధిలోని (4) మండలాలు మరియు (1) మున్సిపాలిటీ సమగ్ర ఆర్థిక వృద్ధి, అభివృద్ధి, స్థిరమైన అభివృద్ధి సాధిస్తూ పేదరికాన్నినిర్మూలించాలనే లక్ష్యంతో ఇప్పటికే తే.09.07.2024దీన జారీ చేయబడిన G.O.Ms.No.58, G.A (SC.A) ఉత్తర్వులను ధృవీకరిస్తూ (Ratification) రాష్ట్రమంత్రి మండలి ఆమోదం తెలిపింది.
10.సాధారణపరిపాలనావిభాగం (GAD):
-పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గ అభివృద్ధికై పిఠాపురం ప్రధాన కేంద్రంగా పిఠాపురం ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ (PADA) ఏర్పాటుకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
11.పురపాలకమరియుపట్టణాభివృద్దిశాఖ:
-APCRDA సహజ పరిధి అయిన 8,352.69 చ.కి.లను పునరుద్దరించేందుకు 1069.55 చ.కి. సత్తెనపల్లి మున్సిపాలిటీని మరియు పల్నాడు జిల్లాలోని PAUDA పరిధిలోని ఆరు మండలాల్లోని 92 గ్రామాలను మరియు బాపట్ల జిల్లాలోని BAUDA పరిధిలోని 5 మండలాల్లోని 62 గ్రామాలను APCRDA పరిధిలోకి తీసుకువచ్చేందుకు రాష్ట్రమంత్రి మండలి ఆమోదం తెలిపింది.
-ఇటీవల రాజధాని నిర్మాణ పనులను సీఎం చంద్రబాబు పునః ప్రారంభించారు..
-ఉద్దండరాయునిపాలెం వద్ద సీఆర్డీఏ భవన పనులు ప్రారంభించారు..

12.సాంఘికసంక్షేమశాఖ:
-కోర్సు పూర్తి అయిన వెంటనే విద్యార్థులకు సర్టిఫికెట్లు జారీ చేయాలనే లక్ష్యంతో పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్‌ల (ట్యూషన్ ఫీజు రీయింబర్స్‌మెంట్) చెల్లింపు విధానాన్ని మార్చేందుకై G.O.Ms.No.76 SW (Edu.I) Dept., తేదీ 21.11.2023 ను సవరించేందుకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఈనూతన విధానం ద్వారా 2024-25 విద్యాసంవత్సరం నుండి SC లు కాకుండా ఇతర విద్యార్థులందరికీ సంబంధించి పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్‌లను (ట్యూషన్ ఫీజు రీయింబర్స్‌మెంట్) సంబందిత కళాశాలల బ్యాంకు ఖాతాలకు నేరుగా జమచేయడం జరుగుతుంది.
-గత ప్రభుత్వంలో అమలు చేసిన విధానానికి ప్రస్తుత ప్రభుత్వం స్వస్తి పలికింది.
-2014-19 మధ్య టీడీపీ ప్రభుత్వ హయాంలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను.. విద్యార్థులకు సంబంధం లేకుండా యాజమాన్యాల అకౌంట్‌లలోకి జమచేయడం జరిగేది.
-గత ప్రభుత్వ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా కాలేజీల యాజమాన్యాలు నిర్దేశిత గడువుకు ఫీజుల్ని చెల్లించాల్సిందేనని విద్యార్థులపై ఒత్తిడి తీసుకొచ్చేవారు.
-ఈ క్రమంలో కొంతమంది విద్యార్థులు ఫీజులు కట్టలేక పరీక్షలు కూడా రాయలేదనే విమర్శలు ఉన్నాయి.
-ఈ ఇబ్బందులన్నింటినీ గమనించిన ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను కాలేజీ యాజమాన్యాల అకౌంట్‌లలోకే జమ చేయాలని నిర్ణయం తీసుకుంది.
13.ఆరోగ్య వైద్య &కుటుంబ సంక్షేమ శాఖ:
-కాకినాడ జిల్లా పిఠాపురంలోని 30 పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌ను 100 పడకల ప్రాంతీయ ఆసుపత్రిగా రూ.38,32,37,720/- (నాన్రికవరింగ్వ్యయం రూ.34,00,00,000/- మరియు రికరింగ్ (హెచ్‌ఆర్) వ్యయంరూ.4,32,37,720/-) అంచనా వ్యయంతో అప్‌గ్రేడ్ చేయడంతో పాటు 66 నూతన పోస్టులనుమంజూరు చేసేందుకు చేసినప్రతిపాదనలకుమంత్రి మండలి ఆమోదం తెలిపింది.
-దీని ద్వారా 5-6 లక్షల మందికి ఆరోగ్య సంరక్షణ సేవలను అందించడం జరుగుతుంది.

14.ఇంధన శాఖ:
-ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ డ్యూటీ (సవరణ) చట్టం, 2020 లోని సెక్షన్ 3ని సవరించడానికి ముసాయిదా బిల్లు ఆమోదం కోసం చేసిన ప్రతిపాదనకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. 1990 లో 6 పైసలు ఉన్న ఎలక్ట్రిసిటీ డ్యూటీ ని 2020 లో రూ.1.00 కు పెంచడం జరిగింది. అయితే ప్రైవేటు పెట్టుబడిదారులు ఈ ఎలక్ట్రిసిటీ డ్యూటీ నుండి తప్పించుకునేందుకు కోర్టులకు వెళ్లడం జరిగింది. ఈ క్రమంలో ఎలక్ట్రిసిటీ డ్యూటీ బకాయిలను వసూలు చేసేందుకు ఈముసాయిదా బిల్లును రూపొందించండం జరిగింది.
15.పరిశ్రమలు మరియు వాణిజ్యం:
-APIIC యొక్క రాష్ట్ర స్థాయి కేటాయింపు కమిటీ సిఫారసుల ప్రకారం (ప్రతి కేసుకు 50 ఎకరాల కంటే తక్కువ), APIIC యొక్క కేటాయింపు నియమాల ప్రకారం, తే. 21.10.2024 దీన జరిగిన రాష్ట్ర స్థాయి కేటాయింపు కమిటీ (SLAC) సమావేశం లో 311 పారిశ్రామిక భూమి కేటాయింపులకై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి మంత్రిమండలి ఆమోదం తెలిపింది.
-గతంలో జారీ చేయబడిన G.O.Ms.No.571, రెవెన్యూ (అసైన్‌మెంట్.I) విభాగం, తేదీ 14.09.2012 ప్రకారం 50 ఎకరాల వరకు APIIC ద్వారా పరిశ్రమల యూనిట్లకు భూమని కేటాయించే విదానాన్ని పునరుద్ధరించేందుకు మంత్రి మండలి నిర్ణయం తీసుకుంది.
16.రవాణా, రహదారులు మరియు భవనాలు:
-అవుటర్ రింగ్ రోడ్, అమరావతి సిటీ మరియు విజయవాడ తూర్పు బైపాస్ మంజూరు కోసం పరిశీలనకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
-రాజధాని అమరావతికి అవుటర్‌ రింగ్‌ రోడ్డు (ఓఆర్‌ఆర్‌) ను 189 కిలోమీటర్ల పొడవున నిర్మించాలన్నది ప్రతిపాదన.
-ఎక్స్‌ప్రెస్ వేలు, ఎకనమిక్‌ కారిడార్లు, జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులు, పోర్టులు, ఎయిర్‌పోర్టులు, పారిశ్రామిక పార్కులను ఓఆర్‌ఆర్‌కు అనుసంధానించనుండడంతో రాజధానికే ప్రధానఆకర్షణగానిలుస్తాయి.
-సీఆర్డీఏ పరిధిలోకి సత్తెనపల్లి మున్సిపాలిటీ, పల్నాడు జిల్లాలోని 92 గ్రామాలు, బాపట్ల జిల్లాలోని 62 గ్రామాలను తీసుకురావడం జరుగుతుంది.
-ఓఆర్‌ఆర్‌ పరిధిలోకి.. బెంగళూరు-విజయవాడ కారిడార్‌, విజయవాడ-నాగపూర్‌ కారిడార్‌, ఎన్‌హెచ్‌-16, ఎన్‌హెచ్‌-65, ఎన్‌హెచ్‌-30, ఎన్‌హెచ్‌-216హెచ్, ఎన్‌హెచ్‌-544, ఎన్‌హెచ్‌-541జీ వంటివి అనుసంధానమవుతాయి.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • AP Cabinet discuss
  • ap cabinet highlights
  • AP Cabinet Meeting
  • ap cabinet meeting 2024
  • chandrababu

Related News

Chandrababu Helicopter

CBN New Helicopter – సీఎం చంద్రబాబుకు కొత్త హెలికాప్టర్..ప్రత్యేకతలు ఇవే..!

CBN New Helicopter : దీనిలో ఉన్న అత్యాధునిక నావిగేషన్ వ్యవస్థ, మెరుగైన భద్రతా ఫీచర్లు, తక్కువ శబ్దం చేయడం దీని ముఖ్య లక్షణాలు. ఇది ప్రయాణాన్ని మరింత సురక్షితంగా, సౌకర్యవంతంగా చేస్తుంది

  • Ap Universal Health Policy

    Universal Health Policy : యూనివర్సల్ హెల్త్ పాలసీ పూర్తి వివరాలు!

  • Ap Cabinet Meeting Today

    CM Chandrababu : నేడు ఏపీ కేబినెట్ భేటీ .. చర్చించే కీలక అంశాలు ఇవే..!

  • Vizag Technology Hub Chandr

    Technology Hub : టెక్నాలజీ హబ్ ఆఫ్ ఇండియాగా విశాఖ – చంద్రబాబు

  • Chandrababu Distributes Pen

    Distribution of Pensions : నేడు రాజంపేటలో పెన్షన్ల పంపిణీ చేయనున్న సీఎం చంద్రబాబు

Latest News

  • ‘Mahindra’ Bumper offer : కార్లు కొనే వారికి ‘మహీంద్రా’ బంపరాఫర్

  • Delhi : తీహార్‌ జైలును పరిశీలించిన బ్రిటన్‌ అధికారులు.. భారత్‌కు నీరవ్ మోదీ, మాల్యాను అప్పగిస్తారా..?!

  • ACB Court : ఏపీ లిక్కర్ స్కామ్ కేసు..ముగ్గురు నిందితులకు బెయిల్ మంజూరు

  • MP Mithun Reddy : జైలు నుంచి ఎంపీ మిథున్ రెడ్డి విడుదల

  • AI Effect : 2030 కల్లా 99% ఉద్యోగాలు మటాష్!

Trending News

    • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

    • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

    • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

    • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

    • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd