HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Ap Budget Launch Of Thalliki Vandanam Scheme

AP Budget: ‘‘తల్లికి వందనం’’ పథకం ప్రారంభం

ప్రభుత్వ నిర్లక్ష్యంతో 2.43 లక్షల మంది విద్యార్థులు బడి మానేశారని తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో విద్యా వ్యవస్థను సరి చేసేందుకు అత్యంత కఠినమైన బాధ్యతను మంత్రి నారా లోకేశ్ తన భజస్కందాలపై వేసుకున్నారని చెప్పారు.

  • By Latha Suma Published Date - 12:41 PM, Fri - 28 February 25
  • daily-hunt
Thalliki Vandanam
Thalliki Vandanam

AP Budget : ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌ శాసనసభలో 2025-26 ఆర్థిక సంవత్సరానికి ఏపీ పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా పయ్యావుల మాట్లాడుతూ..2025-26 ఆర్థిక సంవత్సరానికి నైపుణ్యాభివృద్ధి, శిక్షణ కోసం రూ. 1,228 కోట్లు కేటాయింపును ప్రతిపాదిస్తున్నామని పేర్కొన్నారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో 2.43 లక్షల మంది విద్యార్థులు బడికి వెళ్లడం లేదని వెల్లడించారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో 2.43 లక్షల మంది విద్యార్థులు బడి మానేశారని తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో విద్యా వ్యవస్థను సరి చేసేందుకు అత్యంత కఠినమైన బాధ్యతను మంత్రి నారా లోకేశ్ తన భజస్కందాలపై వేసుకున్నారని చెప్పారు.

Read Also: AP Budget 2025-26 : ప్రతి కుటుంబానికి రూ.25 లక్షల బీమా

ప్రతి తన పిల్లలను తల్లి పాఠశాలకు పంపేలా ప్రోత్సహించే లక్ష్యంతో మరో సూపర్ సిక్స్ హామీని అమలు పర్చే దిశగా ‘‘తల్లికి వందనం’’ పథకాన్ని ప్రారంభిస్తున్నామని చెప్పారు. 2025-26 విద్యా సంవత్సరం నుంచి ఈ పథకం కింద రూ. 15 వేలు ఆర్థిక సాయాన్ని తల్లికి అందించనున్నామని తెలిపారు. చదువుకునే ప్రతి విద్యార్థి తల్లికి ఈ పథకాన్ని అందించడానికి కేటాయింపులు జరుపుతున్నామన్నారు. ఈ పథకం ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో ఒకటవ నుంచి 12వ తరగతి చదువుతున్న విద్యార్థులకు వర్తిస్తుందని తెలిపారు.

నేటి బాలలే రేపటి పౌరులు అనే భావనతో విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేయడం మొదలు పెట్టారు మంత్రి నారా లోకేశ్. రిజల్ట్ ఓరియెంటెడ్ ఎడ్యుకేషన్‌పై దృష్టి సారించారని తెలిపారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి టెక్నాలజీ విషయాలను ప్రధాన పాఠ్యాంశాలుగా తీసుకురావడానికి ఆయన చేసిన ప్రయత్నాలతో రాష్ట్ర పిల్లలు ప్రపంచ స్థాయిలో పోటీ పడి రాణించడానికి సిద్ధమవుతున్నారని మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. సర్వేపల్లి రాధాకృష్ణ విద్యా మిషన్ పథకం ద్వారా 35.69 లక్షల మంది విద్యార్థులకు ఉచితంగా పుస్తకాలు, యూనిఫారమ్‌లు అందిస్తున్నామని, అలాగే డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం పథకం ద్వారా విద్యార్థులకు పౌష్టికాహారాన్ని అందిస్తున్నామని మంత్రి పయ్యావుల పేర్కొన్నారు.

Read Also: AP Budget 2025-26 : ఒక్కొక్క రైతుకు రూ.20వేలు


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • AP budget
  • Minister Lokesh
  • Minister Payyavula Keshav
  • Talliki Vandanam Scheme

Related News

CM Chandrababu

CM Chandrababu: లండన్‌ పర్యటనకు సీఎం చంద్రబాబు.. ఆస్ట్రేలియా పర్యటనకు మంత్రి లోకేశ్!

దీంతో పాటు మంత్రి నారా లోకేష్ సీఐఐ భాగస్వామ్య సమ్మిట్ విజయవంతం కోసం ఆస్ట్రేలియాలో రోడ్ షోలకు కూడా హాజరుకానున్నారు. ఈ సదస్సుకు ప్రపంచవ్యాప్తంగా పారిశ్రామిక దిగ్గజాలను, వాణిజ్యవేత్తలను ఆహ్వానించేందుకు ఆయన ఈ అంతర్జాతీయ వేదికను ఉపయోగించుకుంటారు.

  • Minister Lokesh

    Minister Lokesh: రేపు విశాఖ‌కు మంత్రి లోకేష్‌.. ఎందుకంటే?

Latest News

  • BC Bandh : BCలను రోడ్డెక్కించిన ‘రాజకీయం’.. కారణమెవరు?

  • Layoffs: ఉద్యోగాలు కోల్పోవ‌డానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కార‌ణ‌మా?!

  • BC Bandh: బీసీ బంద్.. కవిత ఆటో ర్యాలీ

  • Kiran Navgire: చ‌రిత్ర సృష్టించిన టీమిండియా క్రికెట‌ర్‌!

  • Garib-Rath Train: త‌ప్పిన పెను ప్ర‌మాదం.. రైలులో అగ్నిప్ర‌మాదం!

Trending News

    • RCB For Sale: ఆర్సీబీని కొనుగోలు చేయ‌నున్న అదానీ గ్రూప్‌?!

    • Diwali: దీపావ‌ళి రోజు ప‌టాకులు కాల్చుతున్నారా? అయితే ఈ వార్త మీకోస‌మే!

    • Gold Prices: 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 1.35 ల‌క్ష‌లు?!

    • Tamil Nadu : హిందీ హోర్డింగులు, సినిమాలు, పాటలు బ్యాన్.. డీఎంకే “భాషా” సెంటిమెంట్‌

    • Rivaba Jadeja: గుజరాత్ మంత్రిగా టీమిండియా క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd