Andhra Tourist Killed : గోవాలో ఏపీ యువకుడి దారుణ హత్య
Andhra Tourist Killed : గోవాలోని ఒక రెస్టారెంట్‌లో డిసెంబర్ 29న అర్ధరాత్రి దిగారు. 31వ తేదీన ఆరుగురు యువకులు రెస్టారెంట్ సిబ్బందితో ఫుడ్ ఆర్డర్ విషయంలో గొడవ పడడంతో, రెస్టారెంట్ నిర్వాహకులు వారిపై దాడికి పాల్పడ్డారు
- Author : Sudheer
Date : 02-01-2025 - 4:00 IST
Published By : Hashtagu Telugu Desk
గోవా(Goa)లో కొత్త సంవత్సరం వేడుకల (New Year Celebrations ) సందర్భంగా ఏపీ యువకుడి దారుణ హత్య జరిగింది. తాడేపల్లిగూడెం(Tadepalligudem)కు చెందిన ఎనిమిది మంది యువకులు గోవా(Goa)లోని ఒక రెస్టారెంట్‌లో డిసెంబర్ 29న అర్ధరాత్రి దిగారు. 31వ తేదీన ఆరుగురు యువకులు రెస్టారెంట్ సిబ్బందితో ఫుడ్ ఆర్డర్ విషయంలో గొడవ పడడంతో, రెస్టారెంట్ నిర్వాహకులు వారిపై దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో రవితేజ (Bhola Ravi Teja) తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స కోసం ఆస్పత్రికి తీసుకెళ్లినప్పటికీ, రవితేజ ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాద ఘటనతో రవితేజ కుటుంబంలో విషాదం నెలకొంది. తల్లిదండ్రులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడం తో… పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
Indian Nurse : కేరళ నర్సుకు యెమన్‌లో మరణశిక్ష.. సాయం చేస్తానని ప్రకటించిన ఇరాన్ అధికారి
ఏపీ పోలీసులు ఈ ఘటనపై మరింత సమాచారం సేకరించేందుకు గోవా చేరుకున్నారు. గోవా ప్రభుత్వం కూడా ఈ ఘటనపై స్పందించింది. స్థానిక ఎమ్మెల్యే ఈ విషయంలో ప్రభుత్వంతో మాట్లాడి, మృతదేహాన్ని గోవా నుండి తాడేపల్లికి ప్రత్యేక విమానంలో తరలించేందుకు చర్యలు తీసుకున్నారు. ఈ హత్యకు సంబంధించిన వివరాలు బయటపడి, సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో, జనరల్ పబ్లిక్‌లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ ఘటనపై గోవా ప్రభుత్వం త్వరగా చర్యలు తీసుకుంటూ, బాధిత కుటుంబానికి న్యాయం అందించాలని ప్రజలు కోరుతున్నారు.