Telugu News

News
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Special
  • Off Beat
News
News
CloseIcon
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Photo Gallery
  • Speed News
  • Health
  • Life Style
  • Devotional
  • Off Beat

  • Telugu News
  • ⁄Andhra-pradesh News
  • ⁄Andhra Govt Warns Movie Theatre Owners

AP Theatres : ఏపీలో ఆ థియేటర్ల యజమానులకు వార్నింగ్! 24 గంటల్లో సంతకం చేయాలి.. లేదంటే సీజ్!

అందరికీ సినిమా వేసే థియేటర్ యజమానులకే బొమ్మ చూపిస్తోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. అధికారుల ధోరణితో సత్తెనపల్లిలోని కొన్ని సినిమా థియేటర్ల యజమానులకు చుక్కలు కనిపిస్తున్నాయి.

  • By Hashtag U Published Date - 02:02 PM, Mon - 20 June 22
AP Theatres : ఏపీలో ఆ థియేటర్ల యజమానులకు వార్నింగ్! 24 గంటల్లో సంతకం చేయాలి.. లేదంటే సీజ్!

అందరికీ సినిమా వేసే థియేటర్ యజమానులకే బొమ్మ చూపిస్తోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. అధికారుల ధోరణితో సత్తెనపల్లిలోని కొన్ని సినిమా థియేటర్ల యజమానులకు చుక్కలు కనిపిస్తున్నాయి. ఏపీ ప్రభుత్వం నిర్వహించే ఆన్ లైన్ విధానం ద్వారా టిక్కెట్ల అమ్మకాలకు ఓకే చెబుతూ సంతకాలు చేయాలని స్థానిక రెవెన్యూ శాఖ అధికారులు హుకుం జారీ చేశారు. దీనికోసం ప్రత్యేకంగా తయారుచేసిన ప్రొఫార్మాతో అధికారులంతా థియేటర్ల బాట పట్టారు.

ఇప్పటికే ఆన్ లైన్ టిక్కెట్ల అమ్మకాలు జరుగుతున్నాయి. కాకపోతే ప్రైవేటు సంస్థలు ఇలా చేస్తున్నాయి. అయినా సరే.. గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం ఆఫ్ లైన్ లోనే టిక్కెట్లను అమ్ముతున్నారు. వారికి ఆన్ లైన్ లో బుక్ చేసుకునేంత సదుపాయం ఉండదని థియేటర్ల యజమానులు అంటున్నారు. సినిమా టిక్కె్ట్ల అమ్మకాలపై థియేటర్ యజమానులు ఇప్పటికే జీఎస్టీ చెల్లిస్తున్నారు. ఇప్పుడీ కొత్త విధానం వల్ల ప్రతీ టిక్కెట్ పై రూ.2 సర్వీస్ ట్యాక్స్ కింద చెల్లించాల్సి వస్తుందన్నదానిపై చర్చలు జరుగుతున్నాయి.

నగరాల్లో ఆన్ లైన్ టిక్కె్ట్ల అమ్మకాలకు ఇబ్బందులు ఉండవని.. కానీ మండల కేంద్రాలు, గ్రామాల్లో ఉండే సీ గ్రేడ్ థియేటర్లలో కూడా ఆన్ లైన్ లోనే టిక్కెట్లు అమ్మాలనడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు థియేటర్ల యజమానులు. ఒకవేళ సంతకం చేయకపోతే థియేటర్లను సీజ్ చేస్తామని.. రూ.5 లక్షలు జరిమానా వసూలు చేస్తామంటున్నారు అధికారులు. దీంతో అధికారులు తమను ఇబ్బంది పెడితే.. తామే స్వచ్ఛందంగా థియేటర్లను మూసివేస్తామంటున్నారు వాటి యజమానులు. నరరావుపేట , వినుకొండ, మాచర్ల, పిడుగురాళ్ల, చిలకలూరిపేట ఇలాంటి చోట ఈ పరిస్థితి కనిపిస్తోంది.

Tags  

  • AP government
  • movie theatres
  • Ticket price

Related News

YS Jagan : పారిశ్రామిక‌వేత్త‌ల‌కు జ‌గ‌న్ స‌ర్కార్ బంప‌రాఫ‌ర్

YS Jagan : పారిశ్రామిక‌వేత్త‌ల‌కు జ‌గ‌న్ స‌ర్కార్ బంప‌రాఫ‌ర్

పారిశ్రామిక‌వేత్త‌ల‌కు ఏపీ ప్ర‌భుత్వం భారీ రాయితీల‌ను ప్ర‌క‌టించింది. పాత బ‌కాయిలతో పాటు వ‌డ్డీ, ఆస్తి ప‌న్ను ఒకేసారి చెల్లిస్తే 5శాతం రాయితీ ఇవ్వ‌డానికి సిద్ధం అయింది.

  • Dulhan Scheme : దుల్హన్ పథకంపై చేతులెత్తేసిన ఏపీ ప్రభుత్వం.. కారణం?

    Dulhan Scheme : దుల్హన్ పథకంపై చేతులెత్తేసిన ఏపీ ప్రభుత్వం.. కారణం?

  • AP TDP Leaders Arrest : ఏపీలో టీడీపీ నేత‌ల‌ అరెస్ట్‌ల ప‌ర్వం

    AP TDP Leaders Arrest : ఏపీలో టీడీపీ నేత‌ల‌ అరెస్ట్‌ల ప‌ర్వం

  • YSR Village clinics: ఆంధ్రాలో లండ‌న్  త‌ర‌హా వైద్యం

    YSR Village clinics: ఆంధ్రాలో లండ‌న్ త‌ర‌హా వైద్యం

  • CM Jagan : ఏపీ మహిళలకు జగన్ సర్కార్ శుభవార్త…ఒక్కొక్కరికి రూ.5వేలు..!

    CM Jagan : ఏపీ మహిళలకు జగన్ సర్కార్ శుభవార్త…ఒక్కొక్కరికి రూ.5వేలు..!

Latest News

  • NITI Aayog : వైఎస్ఆర్ సంపూర్ణ పోషణను ప్ర‌శంసించిన నీతి ఆయోగ్

  • Hair Care: జుట్టు రాలకుండా ఉండాలంటే ఈ పనులు అస్సలు చెయ్యకండి.. అవి ఏంటంటే?

  • TTD : రేపు సెప్టెంబ‌ర్ నెల ప్ర‌త్యేక ద‌ర్శ‌న టికెట్లు విడుద‌ల‌ చేయ‌నున్న‌ టీటీడీ

  • Gurukul Schools : అన్ని గురుకుల పాఠ‌శాలల్లో ఇంట‌ర్మీడియ‌ట్ విద్య – సీఎం కేసీఆర్‌

  • Health Benefits: చికెన్, చేపలు తిన్న తర్వాత పొరపాటున కూడా ఇవి తాగకూడదు.. తాగితే అంతే!?

Trending

    • Air India Alert : ఎయిర్ ఇండియా పేరుపై ఆఫర్.. అది ఫేక్ అంటూ మహారాజా క్లారిటీ!

    • Service Charge In Hotels : హోట‌ల్స్, రెస్టారెంట్లపై ఫిర్యాదుకు టోల్ ఫ్రీ 1915

    • Viral Video: పిల్లి తింగరి చేష్టలు.. ఓనర్ రియాక్షన్.. వైరల్ గా మారిన వీడియో!

    • On Camera: వాస్తు నిపుణుడు దారుణ హత్య.. సీపీ పుటేజీలో నిక్షిప్తమైన వీడియో!

    • Google’s July 4 Animation: గూగుల్ ను తిడుతున్న నెటిజన్స్.. కారణం ఏమిటంటే?

  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
  • Copyright © 2022 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam
  • Follow us on: