AP Poll : ఏపీ ఎన్నికల వేళ కేంద్ర మంత్రి అమిత్ షా కీలక ట్వీట్..
- Author : Sudheer
Date : 13-05-2024 - 10:46 IST
Published By : Hashtagu Telugu Desk
ఏపీలో 175 అసెంబ్లీ , 25 పార్లమెంట్ స్థానాలకు సంబదించిన ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. ఉదయం 7 గంటల నుండే ఓటర్లు పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు చేరుకొని తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోటీ పడ్డారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి పోలింగ్ శాతం ఉండబోతుందని ఈసీ అధికారులు , రాజకీయ ప్రముఖులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే అన్ని పార్టీల అధినేతలు , అభ్యర్థులు తమ ఓటు హక్కును వినియోగించుకొని అందరు ఓటు వేయాలని కోరడం జరిగింది.
We’re now on WhatsApp. Click to Join.
ఇదిలా ఉంటె ఏపీలో ఎన్నికల పోలింగ్ కొనసాగుతున్న వేళ కేంద్ర మంత్రి , బిజెపి అగ్ర నేత అమిత్ షా సోషల్ మీడియా వేదికగా ట్విట్టర్ వేదికగా ఓ పోస్ట్ చేసారు. తెలుగు భాష, సంస్కృతి, గౌరవాన్ని రక్షించి, ప్రోత్సహించి, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని మతమార్పిడి, అవినీతి, దుష్పరిపాలన పంజాల నుండి విముక్తి చేసి, ఎస్సీ, ఎస్టీలు మరియు ఓబీసీల అభ్యున్నతి కోసం కృషి చేసే ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను అని ట్వీట్ చేశారు.
అలాగే ‘తెలంగాణలో నేడు నాలుగో దశ పోలింగ్ జరగనుంది. రాష్ట్ర సంస్కృతిని, గౌరవాన్ని పెంపొందించి, సుపరిపాలనను కొనసాగించి, వ్యవసాయ రంగంలో ఆర్థిక బలాన్ని నింపి, రైతుల సమస్యలపై శ్రద్ధ వహించి, బుజ్జగింపులు మరియు అవినీతిని అంతం చేసే ప్రభుత్వానికి ఓటు వేయాలని నేను రాష్ట్ర ప్రజలను కోరుతున్నాను. అభివృద్ధి, మరియు సమాన అవకాశాలను అందించడం ద్వారా SCలు, STలు మరియు OBCలకు అధిక లాభం చేకూరుతుంది’ అని తెలంగాణ లోక్ సభ ఎన్నికలను ఉద్దేశించి ట్విట్టర్ చేసారు.
ప్రస్తుతం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉదయం 10 గంటల వరకు 15 శాతం పోలింగ్ జరిగిందని తెలుస్తుంది. అదే విధంగా రాష్ట్రంలోని పలు జిల్లాలో పలుచోట్ల పలు దాడులు , గొడవలు జరిగాయి. వైసీపీ – టీడీపీ శ్రేణుల మధ్య దాడులు జరగడంతో పలువురికి గాయాలు అయ్యాయి.
లోక్ సభ ఎన్నికల నాలుగో దశలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లోక్ సభతో పాటు అసెంబ్లీ ఎన్నికలకు కూడా పోలింగ్ జరగనుంది. తెలుగు భాష, సంస్కృతి, గౌరవాన్ని రక్షించి, ప్రోత్సహించి, రాష్ట్రాన్ని మతమార్పిడి, అవినీతి, దుష్పరిపాలన పంజాల నుండి విముక్తి చేసి, ఎస్సీ, ఎస్టీలు మరియు ఓబీసీల అభ్యున్నతి…
— Amit Shah (@AmitShah) May 13, 2024
తెలంగాణలో నేడు నాలుగో దశ పోలింగ్ జరగనుంది. రాష్ట్ర సంస్కృతిని, గౌరవాన్ని పెంపొందించి, సుపరిపాలనను కొనసాగించి, వ్యవసాయ రంగంలో ఆర్థిక బలాన్ని నింపి, రైతుల సమస్యలపై శ్రద్ధ వహించి, బుజ్జగింపులు మరియు అవినీతిని అంతం చేసే ప్రభుత్వానికి ఓటు వేయాలని నేను రాష్ట్ర ప్రజలను కోరుతున్నాను.…
— Amit Shah (@AmitShah) May 13, 2024
Read Also : TS : ఎన్నికల వేళ యువతకు మెగాస్టార్ సందేశం