MP Gorantla episode: రూ. 10కోట్ల పరువు నష్టం దావా వేయనున్న ABN ఎండీ వేమూరి రాధాకృష్ణ..!!
ఏపీ ఎంపీ గోరంట్ల మాధవ్ సంబంధించిన వీడియో వ్యవహారం బుధవారం పలు కీలక మలుపులు తిరిగింది.
- By hashtagu Published Date - 07:03 PM, Wed - 10 August 22

ఏపీ ఎంపీ గోరంట్ల మాధవ్ సంబంధించిన వీడియో వ్యవహారం బుధవారం పలు కీలక మలుపులు తిరిగింది. ఈ వీడియో నకిలీ అంటూ అనంతపురం జిల్లా ఎస్పీ ఫకీరప్ప ఓ ప్రకటన చేశారు. ఎస్పీ ప్రకటనను ఎంపీ గోరంట్ల ఆహ్వానించగా…టీడీపీ నేతలు తీవ్రంగా తప్పుబట్టారు. మరోవైపు ఈ వీడియోను తొలుత ప్రసారం చేసిన ABNఆంధ్రజ్యోతి ఛానెల్…దాని యజమాని వేమూరి రాధాకృష్ణపై..ఇప్పటికే ఎంపీ గోరంట్ల తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.
కాగా ఎంపీ మాధవ్ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన ఏబీఎన్ ఎండీ…న్యాయపరమైన చర్యలకు రెడీ అయ్యారు. ఈ వీడియో ప్రసారమైన సందర్భంలో ఢిల్లీలో విలేకర్లతో మాట్లాడిన సందర్భంగా తనను ఎంపీ గోరంట్ల దుర్భాషలాడారని ఆరోపించారు. అందుకు ఎంపీ మాధవ్ పై న్యాయపరమైన చర్యలకు సిద్ధమైనట్లు చెప్పారు. ఎంపీపై రూ. 10కోట్లకు పైగా పరువు నష్టం దావా వేసేందుకు రాధాకృష్ణ నిర్ణయించారు. అంతేకాదు ఎంపీపై క్రిమినల్ , డిఫమేషన్ చర్యలకు సిద్ధమయ్యారు రాధాకృష్ణ.