Platypus: భూమిపై మరో కొత్త జీవిని కనుగొన్న శాస్త్రవేత్తలు.. దాని ప్రత్యేకత ఏమిటో తెలుసా?
భూమి మీద ఎన్నో రకాల జీవులు ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. అయితే మనకు తెలిసిన జీవులు మాత్రమే కాకుండా శాస్త్రవేత్తలకు కూడా అంతుచిక్కని రకరకాల
- By Nakshatra Published Date - 03:26 PM, Sun - 2 July 23
భూమి మీద ఎన్నో రకాల జీవులు ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. అయితే మనకు తెలిసిన జీవులు మాత్రమే కాకుండా శాస్త్రవేత్తలకు కూడా అంతుచిక్కని రకరకాల పక్షులు జలచరాలు ఇలా ఎన్నో రకాల జీవులు ఉన్నాయి. అయితే ఇప్పటికే ఎన్నో రకాల జీవులను కనుగొన్న శాస్త్రవేత్తలు ఎప్పటికప్పుడు కొత్త కొత్త జీవుల గురించి పరిశోధనలు జరుపుతూనే ఉన్నారు. అయితే ఎప్పుడూ చూడని కొన్ని వింత జీవులను చూసినప్పుడు ఆశ్చర్య వేయడంతో పాటు వాటిని తెలుసుకోవాలి అన్న ఆతృత కూడా పెరుగుతూ ఉంటుంది.
అటువంటి వాటిలో ప్లాటిపస్ కూడా ఒకటి. కాగా ఈ జీవి చూసేందుకు చాలా విచిత్రంగా రకరకాల జీవులను పోలి ఉంటుంది. దీని ముఖం బాతు ముఖం మాదిరిగా ఉంటుంది. అలాగే దాని శరీరం సీల్ చేప మాదిరిగా ఉంటుంది. ప్లాటిపస్ అనేది క్షీర జాతికి చెందిన జీవి. ఇది పాలిచ్చే జంతువు అయినప్పటికీ గుడ్లు కూడా పెడుతుంది. ఇది మిశ్రమ జీవిలా కనిపిస్తుంది. ఇలాంటి మిశ్రమజాతి జీవులు ప్రపంచంలో ఐదు రకాల జీవులు మాత్రమే ఉంటాయి. అయితే ప్లాటిపస్ గురించి ఎవరికీ తెలియని మరిన్ని వివరాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం… మొట్టమొదటిసారి శాస్త్రవేత్తలకు ఈ ప్లాటిపస్ 1799లో కనిపించింది.
ఈ జీవిని చూసిన శాస్త్రవేత్తలు ఆశ్చర్యపోయారు. ఈ జీవి చూడడానికి ఎంతో వింతగా ఉండడంతోపాటు ఇతర జీవుల మాదిరిగా కాకుండా కాస్త భిన్నంగా కనిపించడంతో వారు దాని గురించి తెలుసుకోవాలి అనుకున్నారు. అంతేకాకుండా అటువంటి జీవి భూమిపై ఉంది అన్న విషయాన్ని నమ్మలేకపోయారు. మొదట రెండు జీవులుగా భావించిన శాస్త్రవేత్తలు ఆ తర్వాత పరిశోధనలు జరిపి అది ఒక జీవి మాత్రమే అని తేల్చారు. ఆ తర్వాత అటువంటి జీవి సజీవంగానే లభ్యమయ్యింది. అయితే ఇవి ఇతర జీవుల నుంచి తమను తాము రక్షించుకోవడం కోసం విషంను చిమ్ముతూ ఉంటాయి. దాని వెనుక కాళ్ళలో ఒక ముళ్ళు లాంటిది ఉంటుంది. దానిలో విషం దాగి ఉంటుంది. తన రక్షణకు అది ముల్లును ఇతర జీవులకు గుచ్చుతుంది. అయితే మనిషికి ప్లాటిపస్ ముళ్ళు గుచ్చుకోవడం వల్ల ఎటువంటి హాని జరగదు. కానీ తట్టుకోలేని నొప్పి అయితే కలుగుతుంది.
Related News
Famous Beaches : ఆ బీచ్ లకు వెళ్తే..అక్కడ నగ్నంగా తిరగాల్సిందే
బీచ్ లో చల్లని బీరు తాగుతూ సముద్రపు అందాలను ఆస్వాదించాలని..మరికొంతమందికి కొంచం రొమాంటిక్ గా ఎంజాయ్ చేయాలనీ అనిపిస్తుంటుంది