Husbands Swapping : భర్తలను మార్చుకున్న ఇద్దరు యువతులు.. నాలుగేళ్ల తర్వాత ఏమైందంటే ?
Husbands Swapping : ఇదో విచిత్రమైన కేసు. భారత వివాహ సంప్రదాయాలకు, మానవ సంబంధాల విలువలకు విరుద్ధమైన వ్యవహారంతో ముడిపడిన కేసు ఇది.
- Author : Pasha
Date : 26-01-2024 - 11:39 IST
Published By : Hashtagu Telugu Desk
Husbands Swapping : ఇదో విచిత్రమైన కేసు. భారత వివాహ సంప్రదాయాలకు, మానవ సంబంధాల విలువలకు విరుద్ధమైన వ్యవహారంతో ముడిపడిన కేసు ఇది. చెడు ఎప్పుడూ అపసవ్యంగానే ఉంటుంది. అది చివరకు వినాశనం వైపే వెళ్తుంది అని ఈ కేసుకు సంబంధించిన ఉదంతం నిరూపించింది.
We’re now on WhatsApp. Click to Join.
వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్‌లోని బహ్రయిచ్‌కు చెందిన యువతికి ఓ యువకుడితో 2019 సంవత్సరంలో పెళ్లయింది. భార్యాభర్తలిద్దరూ ఢిల్లీలోని ఒక ఐటీ కంపెనీలో జాబ్ చేసేవారు. నాలుగేళ్ల క్రితం ఒకరోజు ఈ యువతి తన భర్తతో కలిసి స్నేహితురాలి ఇంటికి వెళ్లింది. అప్పుడు స్నేహితురాలి భర్త కూడా ఇంట్లోనే ఉన్నాడు. అప్పుడు నలుగురూ సరదాగా ముచ్చటించుకున్నారు. ఈ క్రమంలో వీరిందరి మధ్య చనువు బాగా పెరిగింది. 2019 సంవత్సరం డిసెంబర్‌లో ఈ రెండు జంటలు కలిసి క్రిస్మస్ పార్టీని సెలబ్రేట్ చేసుకున్నాయి. ఆ సందర్భంగానే స్నేహితురాళ్లు ఇద్దరూ తమ భర్తలను పరస్పరం మార్చుకోవాలని డిసైడయ్యారు. అప్పటి నుంచి పరస్పర అంగీకారంతో ఈ రెండు జంటల మధ్య వివాహేతర సంబంధం కొనసాగింది.
Also Read :Sania One Word : ఒక్క పదంతో సానియా మీర్జా ఇన్‌స్టా పోస్ట్.. దాని అర్థం అదేనా?
బహ్రయిచ్‌కు చెందిన యువతి భర్త, తన భార్య స్నేహితురాలికి బాగా దగ్గరయ్యాడు. చివరకు ఆమెతో ప్రేమలో పడ్డాడు. ఈ విషయం అతడి భార్యకు ఈవిషయం తెలిసింది. దీనిపై భర్తను బహ్రయిచ్ యువతి నిలదీసింది. చాలాసార్లు గొడవపడింది. భర్త తనతో విడాకులు తీసుకోకుండానే మరో పెళ్లి చేసుకున్నాడని కేసు పెట్టింది. దీంతో ఆ యువతి భర్త లఖ్నవూ ఫ్యామిలీ కోర్టులో విడాకుల పిటిషన్ వేశాడు. ఆ తర్వాత లఖ్నవూ ఫ్యామిలీ కోర్టు దంపతులిద్దరికీ కౌన్సెలింగ్ చేసింది. అయినా గొడవలు ఆగలేదు. ‘‘నిజానికి నేను వేరే మహిళను పెళ్లి చేసుకోలేదు. కేవలం భార్యను బెదిరించేందుకే పెళ్లి చేసుకున్నట్లు చెప్పాను’’ అని కోర్టుకు భర్త తెలిపాడు. ఈ కేసుపై(Husbands Swapping) లఖ్నవూ ఫ్యామిలి కోర్టులో విచారణ జరుగుతోంది.
హిజ్రాను పెళ్లాడిన యువకుడు
తెలంగాణలోని ఖమ్మం జిల్లాకు చెందిన ఓ హిజ్రాను ఒక యువకుడు ప్రేమ వివాహం చేసుకున్నాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే.. జిల్లాలోని ఏన్కూరులోని నక్షత్ర అనే ట్రాన్స్‌జెండర్‌ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేటకు చెందిన నందు అనే యువకుడు ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరిద్దరికీ వివిధ ప్రాంతాలకు చెందిన హిజ్రాలంతా కలిసి ఏన్కూరు మండలంలోని గార్లఒడ్డు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో ఆదివారం ఘనంగా పెళ్లి చేశారు. నందు, నక్షత్రలు గత కొంతకాలంగా ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ప్రేమించుకుంటూ వచ్చారు. ఈ ఇద్దరు పెళ్లి చేసుకోవాలని ట్రాన్స్‌జెండర్ సంఘం సభ్యులకు తెలియజేయగా, వారు పెళ్లికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేయడంతో పాటు దగ్గరుండిమరీ వివాహం జరిపించారు.