HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Trending
  • >Why Nose Ring Is Worn Only On The Left Side Of The Nose Know The Scientific Reason Too

Nose Ring Secrets : ముక్కు పుడక..ఎడమ వైపే ఎందుకంటే ?

Nose Ring Secrets : ముక్కు పుడక.. మహిళలకు స్పెషల్ లుక్ ఇస్తుంది. ప్రస్తుత కాలంలో ముక్కు పుడకల హవా పెరిగింది.

  • By Pasha Published Date - 11:32 AM, Sun - 28 May 23
  • daily-hunt
Nose Ring Secrets
Nose Ring Secrets

Nose Ring Secrets : ముక్కు పుడక.. మహిళలకు స్పెషల్ లుక్ ఇస్తుంది. 

ప్రస్తుత కాలంలో ముక్కు పుడకల హవా పెరిగింది.

సిల్వర్, గోల్డ్, ప్లాటినం, పగడపు ముక్కు పుడకలు, రత్నపు ముక్కు పుడకలు తెగ సేల్ అవుతున్నాయి. 

కాలంతో పాటు ముక్కు పుడకల (Nose Ring Secrets) సైజు కూడా తగ్గింది. ప్రస్తుతం చిన్నసైజు ముక్కు పుడకల హవా నడుస్తోంది.  

పెళ్లిళ్లు, ఫంక్షన్లు వస్తే చాలు..చాలామంది డ్రెస్సింగ్ కు తగ్గట్టుగా ముక్కుపుడకలు పెట్టేస్తూ స్టైల్ గా ముస్తాబవుతున్నారు.

ముక్కు పుడకను ముక్కుకు ఎడమవైపే పెట్టుకుంటారు.. ఇంతకీ ఎందుకలా  ? 

కుడి చేయి శుభప్రదం అయినప్పుడు.. కుడి వైపు ఉండే  ముక్కు పుట శుభప్రదం కావాలి.

కానీ ముక్కు పుడక విషయంలో మాత్రం ఎడమవైపు ఉండే ముక్కు పుటకే ప్రాధాన్యత ఇస్తున్నారు. 

మహిళలకు ముక్కు కుట్టడం అనేది భారతీయ సంప్రదాయంలో ఒక భాగం. వివాహిత స్త్రీ యొక్క 16 అలంకారాలలో ముక్కు పుడకను ధరించడం ఒకటి. దీనివల్ల అందం పెరుగుతుందని, లక్ష్మీదేవి సంతోషిస్తుందని నమ్ముతారు. వివాహ సమయానికి అమ్మాయిలకు ముక్కుపుడక తప్పనిసరి అనేది ఆచారం. ఇప్పటికీ కొన్ని కుటుంబాల్లో ఈ విధానాన్ని ఆచరిస్తున్నారు. ఏడు నుంచి  పదకొండు సంవత్సరాల మధ్య వయస్కులకు ముక్కు కుట్టిస్తారు. ఇలా చిన్న వయస్సులో కుట్టించడం వల్ల ఆరోగ్యపరంగా చాలా మంచిదట. ముక్కుకు కుడివైపున సూర్యనాడి ఉంటుంది. ఎడమవైపున చంద్రనాడి ఉంటుంది. అందువల్ల ముక్కుకు ఎడమవైపున అర్ధ చంద్రాకారంలోని ముక్కు పుడక ధరించాలని పండితులు చెప్తున్నారు. అలంకారంగా స్థిరపడిన ముక్కెరను మేనమామ లేదా కాబోయే భర్త మాత్రమే బహూకరించడం అనేది ప్రాచీన కాలం నుంచీ వస్తున్న సాంప్రదాయం.

Also read : Nose Surgery: అందం కోసం ముక్కు ప్లాస్టిక్ సర్జరీ.. కొంత సేపటికే మృత్యువాత!

కంట్రోల్ లోకి కోపం 

  • బంగారం, వెండి కలిపిన ముక్కు పుడకను ధరించడం మంచిదని అంటారు. బంగారం వల్ల శరీరానికి శక్తి.. వెండి వల్ల  శరీరానికి చల్లదనం వస్తాయి. ఇక పూర్తిగా వెండితో తయారు చేసిన ముక్కు పుడకను ధరించడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుందని అంటారు.
  • ముక్కు యొక్క ఎడమ పుటకు ఋతుస్రావంతో సంబంధం ఉంటుందని నమ్ముతారు. ముక్కు ఎడమ పుటను కుట్టిస్తే.. రుతుక్రమం కంట్రోల్ లోకి వస్తుందని చెబుతారు. దీనివల్ల మహిళలకు బహిష్టు సమయంలో వచ్చే సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుందని అంటారు.
  • జననాంగాలు, గర్భాశయానికి సంబంధించిన నాడికి ముక్కు ఎడమ భాగంతో సంబంధం ఉంటుందని.. ముక్కుకు ఎడమవైపున  పుడకను ధరిస్తే గర్భకోశవ్యాధులు తగ్గుతాయని విశ్వసిస్తారు.
  • పురిటి నొప్పులు ఎక్కువ కలగకుండా సుఖ ప్రసవం అవడానికి ఇది సహకరిస్తుందట.
  • ముక్కు పుడకను ధరించడం వల్ల నాసికా బిందువుపై ఒత్తిడి ఏర్పడుతుంది. తద్వారా ఆడవారు తమ కోపాన్ని కంట్రోల్ చేసుకోగలుగుతారని అంటారు.
  • ఈ ఆభరణం ఆడవారి శ్వాస నాళాలకు రక్షణ కల్పిస్తుంది.  తద్వారా వాయుమార్గంలో ఎటువంటి సమస్యలు తలెత్తవు. సైనస్, ఇస్నోఫీలి వంటి ముక్కుకు సంబంధించిన సమస్యల నుంచి రక్షణ లభిస్తుంది.

గమనిక: ఈ కథనంలో ఉన్న ఏదైనా సమాచారం/మెటీరియల్/లెక్కల యొక్క ఖచ్చితత్వం లేదా విశ్వసనీయతకు హామీ లేదు. ఈ సమాచారం వివిధ మాధ్యమాలు/జ్యోతిష్యులు/పంచాంగాలు/ఉపన్యాసాలు/నమ్మకాలు/గ్రంధాల నుండి సేకరించిన తర్వాత మీ ముందుకు తీసుకురాబడింది. మా లక్ష్యం సమాచారాన్ని అందించడం మాత్రమే, దాని వినియోగదారులు దానిని కేవలం సమాచారంగా తీసుకోవాలి. అదనంగా, దాని యొక్క ఏదైనా ఉపయోగం వినియోగదారు యొక్క పూర్తి బాధ్యత.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • left side of the nose
  • Nose Ring
  • Nose Ring Secrets
  • only left side
  • Scientific Reason
  • worn

Related News

    Latest News

    • India: హాకీ ఆసియా కప్.. ఫైన‌ల్‌కు చేరిన భార‌త్‌!

    • Lunar Eclipse: చంద్ర‌గ్ర‌హ‌ణం రోజున‌ గర్భిణీలు చేయాల్సినవి, చేయకూడనివి ఇవే!

    • GST Rates: జీఎస్టీ మార్పులు.. భారీగా త‌గ్గ‌నున్న ధ‌ర‌లు!

    • Aligned Partners: ట్రంప్ కొత్త వాణిజ్య విధానం.. ‘అలైన్డ్ పార్టనర్స్’కు సున్నా టారిఫ్‌లు!

    • MMTS Trains: రైల్వే ప్ర‌యాణికుల‌కు గుడ్ న్యూస్‌.. ఉద‌యం 4 గంట‌ల వ‌ర‌కు రైళ్లు!

    Trending News

      • GST Reforms Impact: హోట‌ల్స్ రూమ్స్‌లో ఉండేవారికి గుడ్ న్యూస్‌!

      • Lunar Eclipse: రేపే చంద్ర‌గ్ర‌హ‌ణం.. ఏ దేశాల‌పై ప్ర‌భావం అంటే?

      • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

      • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

      • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd