Train Video: వైరల్ వీడియో తీద్దామనుకున్నాడు.. చివరకు ఊహించని షాక్
తెలంగాణలోని హనుమకొండ జిల్లా కాజీపేటలో రైల్వే ట్రాక్‌కు సమీపంలో ఇన్‌స్టాగ్రామ్ కోసం వీడియో చేస్తున్న యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు.
- By Balu J Updated On - 01:12 PM, Mon - 5 September 22

తెలంగాణలోని హనుమకొండ జిల్లా కాజీపేటలో రైల్వే ట్రాక్‌కు సమీపంలో ఇన్‌స్టాగ్రామ్ కోసం వీడియో చేస్తున్న యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన ఆదివారం చోటుచేసుకుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది ఈ వీడియో. తెలంగాణలోని వడ్డేపల్లికి చెందిన అక్షయ్ రాజ్ (17) ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. సోషల్ మీడియా వ్యామోహం ఎక్కువ. ఈ నేపథ్యంలో రైల్వే ట్రాక్ దగ్గర నడుస్తూ వీడియోను తీయించుకోవాలనుకున్నాడు. వేగంగా వస్తున్న రైలుకు దగ్గరగా జేబుల్లో రెండు చేతులు పెట్టుకొని స్టైలిష్ గా నడుస్తుండటంతో రైలు ఒక్కసారిగా ఢీకొట్టింది.
కొన్ని సెకన్ల వ్యవధిలో రైల్వే ట్రాక్ పై ఎగిరిపడ్డడాడు. ఈ ఘటనలో అతనికి కాలు, చేయి విరిగిపోయింది. తలకు బలమైన గాయాలు కావడంతో ప్రాణప్రాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు. రైలు పట్టాల దగ్గర నడవరాదని, ఇది ప్రాణాంతక ప్రమాదాలకు దారితీయవచ్చని రైల్వే పోలీసులు పదే పదే హెచ్చరిస్తున్నారు. లైక్స్ కోసం లైఫ్ ను రిస్ట్ పెడుతున్నారు ఈ తరం కుర్రాళ్లు.
Related News

Jet Pack Suits: త్వరలో భారత సైనికులకు జెట్ ప్యాక్ సూట్స్
భారత సైనికులు ఇకపై సూపర్ మ్యాన్స్ లా మనకు గాల్లో ఎగురుతూ కనిపించనున్నారు.