Wooden City : ప్రపంచంలోనే అతిపెద్ద కలప నగరం
Wooden City : ప్రపంచంలోనే అతిపెద్ద వుడ్ సిటీ నిర్మాణానికి ప్లాన్ రెడీ అయింది. పూర్తిగా కలపతో ఉండే ఈ నగరం 2.5 లక్షల చదరపు మీటర్ల స్థలంలో ఉంటుంది. దీని నిర్మాణానికి రూ.11,500 కోట్లు ఖర్చు చేయనున్నారు.
- By Pasha Published Date - 07:30 AM, Sun - 25 June 23

Wooden City : ప్రపంచంలోనే అతిపెద్ద వుడ్ సిటీ నిర్మాణానికి ప్లాన్ రెడీ అయింది.
పూర్తిగా కలపతో ఉండే ఈ నగరం 2.5 లక్షల చదరపు మీటర్ల స్థలంలో ఉంటుంది.
దీని నిర్మాణానికి రూ.11,500 కోట్లు ఖర్చు చేయనున్నారు.
ఈ సిటీలో కార్బన్ రిలీజ్ 40% తక్కువ.. అంటే ఎకో ఫ్రెండ్లీగా ఉంటుంది.
ఇంతకీ ఈ సిటీని ఎక్కడ నిర్మించబోతున్నారు ?
స్వీడన్ రాజధాని స్టాక్‌హోమ్ లోని సిక్లా ప్రాంతంలో ఈ వుడ్ సిటీని(Wooden City )నిర్మిస్తారు. పూర్తిగా కలపతో నిర్మించే ఈ సిటీలోని భవనాలకు మంటలు కూడా అంటుకోవు. ఫైర్ ప్రూఫ్ ఇంజినీరింగ్ కలపతో నిర్మాణాలు ఉంటాయి. స్వీడిష్ సిటీ డెవలప్‌మెంట్ కంపెనీ అట్రియం జంగ్‌బర్గ్ ఆధ్వర్యంలో 2025లో వుడ్ సిటీ నిర్మాణం ప్రారంభమవుతుంది. స్కాండినేవియన్ స్టూడియోలు హెన్నింగ్ లార్సెన్ , వైట్ ఆర్కిటెక్టర్ కలిసి ఈ సిటీని నిర్మిస్తాయి. ఇందులో రెస్టారెంట్లు, దుకాణాలతో పాటు 2,000 ఇళ్ళు, 7,000 కార్యాలయాలు ఉంటాయి. అడవి లాంటి ప్రశాంతత ఈ సిటీలో ఉంటుందని అంటున్నారు. ఈ సిటీలోని ఇళ్ళ పునాదిలో చాలా తక్కువ పరిమాణంలో కాంక్రీటు, స్టీల్‌ను ఉపయోగిస్తారు.ఈ భవనాలు చాలా తేలికగా ఉంటాయి. కాబట్టి వాటి పునాది చిన్నగా ఉంటుంది.
Also read : Private Army-Russia Deal : వెనక్కి తగ్గిన ప్రైవేట్ ఆర్మీ.. రష్యాతో డీల్ ఇలా కుదిరింది
అన్ని అంతస్తులు, గోడలు, క్రాస్ బ్రేస్‌లలో కలప ఉంటుంది. కలప భవనాలకు అగ్నిప్రమాదాల ముప్పు ఎక్కువగా ఉంటుంది. అందుకే వుడ్ సిటీలోని భవనాల్లో అనేక ఫైర్ సేఫ్టీ సిస్టమ్స్ ఏర్పాటు చేయనున్నారు. స్ప్రింక్లర్ సిద్ధంగా ఉంచుతారు.. అగ్ని నిరోధక పొరలు ఈ భవనాల్లోని గోడలపై ఉంటాయి. మంటలు అంటుకోకుండా ఉండేందుకు ఇంజినీరింగ్ కలపను మాత్రమే ఈ భవనం నిర్మాణానికి వినియోగిస్తారు. గతంలో నార్వేలోని మజోసా సరస్సు ఒడ్డున ఉన్న 85 మీటర్ల వుడ్ టవర్ ను “మజోస్టార్నెట్” పేరిట ఉంది. అందులోనూ ఫ్లాట్లు, హోటల్, స్విమ్మింగ్ పూల్ ఉన్నాయి. 2022లో అమెరికాలోని విస్కాన్సిన్‌లో 87 మీటర్ల ఎత్తైన వుడ్ బిల్డింగ్ కట్టారు. కెనడాలోని అంటారియోలో 90 మీటర్ల వుడ్ బిల్డింగ్ నిర్మించారు.