Super Saturn: ఆ నక్షత్రం చుట్టూ 30 వలయాలు.. శనిగ్రహ వలయాల కంటే 200 రెట్లు పెద్దవి!!
ఇప్పుడు వలయాల సైజు, బరువు విషయంలో శని గ్రహాన్ని మించిన ఒక నక్షత్రాన్ని గుర్తించారు. దాని పేరు "J1407"
- Author : Hashtag U
Date : 23-09-2022 - 6:30 IST
Published By : Hashtagu Telugu Desk
సూర్యుడి నుంచి అత్యంత దూరంగా ఉన్న గ్రహం “నెప్ట్యూన్”. దాని చుట్టూ ఉన్న వలయాలు అబ్బురపరిచేలా ఉంటాయి.
సూర్యుడికి కాస్త దగ్గరలోనే ఉండే జూపిటర్, శని గ్రహాలకు కూడా చుట్టూ వలయాలు ఉంటాయి.
అత్యంత పెద్ద వలయాలున్న గ్రహం మాత్రం.. శని గ్రహమే!!
ఇప్పుడు వలయాల సైజు, బరువు విషయంలో శని గ్రహాన్ని మించిన ఒక నక్షత్రాన్ని గుర్తించారు. దాని పేరు “J1407”. ఈ నక్షత్రం అన్ని గ్రహాలకు అవతల ఉంది. దీనికి సంబంధించిన కొన్ని ఫోటోలను నాసాకు చెందిన జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ ఇటీవల తీసి పంపింది. వాటిని విశ్లేషించిన శాస్త్రవేత్తలు తాజా నిర్ధారణకు వచ్చారు. “J1407″ నక్షత్రం చుట్టూ కోట్లాది కిలోమీటర్ల వ్యాసార్ధంతో దాదాపు 30కి పైగా వలయాలు ఉన్నాయి. ఇవి శని గ్రహం చుట్టూ ఉన్న వలయాల కంటే 200 రెట్లు పెద్దవి.
అయితే J1407 అత్యంత దూరంగా ఉన్నందు వల్ల దాని వలయాలు కనిపించడం లేదని శాస్త్రవేత్తలు తెలిపారు. ” J1407 చుట్టూ ఉన్న వలయాలు ఎంత పెద్దవంటే.. వాటిని తీసుకెళ్లి శని గ్రహం వలయాల ప్లేస్ లో పెడితే వాటిని రాత్రి వేళ భూమి నుంచి కూడా చూడొచ్చు. సంపూర్ణ చంద్రుడి కంటే J1407 చుట్టూ ఉన్న వలయాలు చాలా పెద్దగా ఉంటాయి. అందుకే J1407 నక్షత్రాన్ని సూపర్ శాటర్న్ అని కూడా అంటున్నారు. చుట్టూ ఉన్న వలయాల వల్లే J1407 నక్షత్రం కాంతి పూర్తిస్థాయిలో బయటకు కనిపించడం లేదని సైంటిస్టులు చెబుతున్నారు. రాబోయే కొన్ని లక్షల సంవత్సరాల్లో J1407 నక్షత్ర వలయాలు పలుచబడుతాయని అంచనా వేశారు. భవిష్యత్ లో ఇలాంటి మరెన్నో కొత్త కొత్త నక్షత్రాలు, గ్రహాలను జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ కనుగొనే ఛాన్స్ ఉంది.