Self Marriage: సెల్ఫ్ మ్యారేజ్.. తనను తాను పెళ్లి చేసుకోబోతున్న గుజరాతీ యువతి!!
"బహుశా.. ఇండియాలో సోలోగామీ మ్యారేజ్ చేసుకోబోతున్న మొదటి వ్యక్తిని నేనే" అని పేర్కొంది. అన్నట్టు.. పెళ్లి తర్వాత తాను హనీమూన్ కోసం గోవాకు వెళ్తున్నట్లు బిందు వెల్లడించింది.
- By Hashtag U Published Date - 09:00 PM, Thu - 2 June 22

ఆడ, మగ పెళ్లిళ్లు చూశాం..
పాశ్చాత్య దేశాల్లో జరిగే ఆడ, ఆడ పెళ్లిళ్ల గురించి, మగ, మగ మ్యారేజ్ ల వ్యవహారాల కథలు విన్నాం..
కానీ గుజరాత్ లోని వడోదర కు చెందిన 24 ఏళ్ల యువతి క్షమ బిందు తనను తానే పెళ్లి చేసుకోబోతోంది. ఇందుకు ముహూర్తం జూన్ 11. ఇలా తనను తానే పెళ్లి చేసుకోవడాన్ని “సోలోగామీ” అంటారని బిందు చెబుతోంది. తనను తానే ప్రేమించుకొని ఈ పెళ్లి చేసుకున్నట్లు తెలిపింది. “నేను జీవితంలో అస్సలు పెళ్లి చేసుకోవద్దని అనుకునే దాన్ని. అయితే నాతో నేను ప్రేమలో పడ్డ తర్వాత ఆలోచన మారింది. కనీసం నన్ను నేను పెళ్లి చేసుకోవడం మంచిదని నిర్ణయించుకున్నాను” అని బిందు కామెంట్ చేసింది. “బహుశా.. ఇండియాలో సోలోగామీ మ్యారేజ్ చేసుకోబోతున్న మొదటి వ్యక్తిని నేనే” అని పేర్కొంది. అన్నట్టు.. పెళ్లి తర్వాత తాను హనీమూన్ కోసం గోవాకు వెళ్తున్నట్లు బిందు వెల్లడించింది.
హిందూ సంప్రదాయ ప్రకారమే..
హిందూ సంప్రదాయ ప్రకారమే పెళ్లి జరుగుతున్నా.. తనకు తానుగా మూడు ముళ్లు వేసుకుని వివాహం చేసుకోనుంది. గోత్రీలోని గుడిలో జరగనున్న వివాహంలో ఐదు ప్రమాణాలు చేయనుంది క్షమా. ఇది పూర్తిగా మహిళకు చెందిన విషయం కాబట్టి దీనిని హైలెట్ చేయాలనుకుంటున్నానని తెలిపిందామె.తన పేరెంట్స్ రియాక్షన్ గురించి అడగ్గా.. వాళ్లు ఓపెన్ మైండెడ్ అని.. పెళ్లికి ఒప్పుకున్నారని చెప్పింది క్షమ.