Iran Hijab Controversy: హిజాబ్ ఉద్యమానికి మద్దతుగా బట్టలన్నీ తీసేసి…నటి ఎల్నాజ్ నౌరోజీ మద్దతు.!!
హిజాబ్ విషయంలో ఇరాన్‌లో చెలరేగిన మంటలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వ్యాపించాయి.
- By hashtagu Published Date - 03:00 PM, Tue - 11 October 22

హిజాబ్ విషయంలో ఇరాన్‌లో చెలరేగిన మంటలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వ్యాపించాయి. హిజాబ్ ఉద్యమానికి వ్యతిరేకంగా పలు చోట్ల నిరసనలు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు పలువురు సెలబ్రిటీలు కూడా హిజాబ్ నిరసనలకు మద్దతు పలికారు. తాజాగా ఈ ఉద్యమంపై నటి ప్రియాంక చోప్రా స్పందించింది. ఇప్పుడు నటి ఎల్నాజ్ నౌరోజీ కూడా ఈ వివాదంలోకి దూకారు. ఎల్నాజ్ నెట్‌ఫ్లిక్స్ హిట్ సిరీస్ సేక్రేడ్ గేమ్స్ తో చాలా ఫేమస్ అయ్యింది.
హిజాబ్ ఉద్యమానికి మద్దతుగా బట్టలన్నీ తీసేసి…
హిజాబ్ ఉద్యమానికి మద్దతుగా, నటి ఎల్నాజ్ నౌరోజీ తన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. అందులో ఆమె చాలా బట్టలు ధరించి కనిపించింది. ఎల్నాజ్ మొదట బురఖాలో కనిపించింది. ఆపై దానిని తీసివేసి కుర్తాలో కనిపించింది. దీని తరువాత, ఆమె తన బట్టలన్నీ ఒక్కొక్కటిగా తీసివేసి, చివరికి లోదుస్తులు మాత్రమే ధరించి కనిపిస్తుంది. వీడియోను పంచుకునేటప్పుడు, ఎల్నాజ్ ఒక మహిళ తనకు కావలసినది ధరించవచ్చు. అది బుర్ఖా అయినా లేదా బికినీ అయినా ధరించవచ్చు అని క్యాప్షన్ ఇచ్చారు. ఇప్పుడా వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.