12 Million Yrs Fossil: 12 మిలియన్ ఏళ్ల క్రితం శిలాజాలు కనుగొన్న పరిశోధకులు..?
శాస్త్రవేత్తలు కొన్ని కొన్ని ప్రదేశాలను సందర్శించి ఏళ్ల క్రితం అంతరించిపోయిన జీవులకు సంబంధించిన ఆనవాళ్లు బయటకు తెస్తుంటారు.
- By Anshu Published Date - 07:30 AM, Tue - 5 July 22

Bear Dog: శాస్త్రవేత్తలు కొన్ని కొన్ని ప్రదేశాలను సందర్శించి ఏళ్ల క్రితం అంతరించిపోయిన జీవులకు సంబంధించిన ఆనవాళ్లు బయటకు తెస్తుంటారు. ఇక అలా ఒకప్పుడు అంతరించిపోయిన జీవులకు సంబంధించిన ఆనవాళ్లు జాడలు కనిపించాయి అంటే వెంటనే వాటిని చేదించేంత వరకు నిద్రపోరు మన శాస్త్రవేత్తలు. అయితే ఇప్పటికే అంతరించిపోయిన డైనోసార్ లాంటి పెద్ద పెద్ద జీవులకు సంబంధించిన ఆనవాళ్లను కనుగొన్న విషయం తెలిసిందే.
అయితే ఇలా అంతరించిపోయిన జీవులకు సంబంధించిన గుర్తులు, ఎముకలు అలాగే వాటికీ సంబంధించిన గుడ్లు ఇలాంటివి చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటాయి. అయితే తాజాగా శాస్త్రవేత్తలకు ఒక దవడ ఎముక కనిపించింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. తాజాగా దక్షిణ ఫ్యాన్స్ లోని పైరినీస్ పర్వత శ్రేణి నుండి అపోసిలైడ్జ్ దిగువన ఒక దవడ ఎముక ఇటీవల కనుక్కున్నారు. అయితే ఇది ఒక కొత్త జాతి బేర్ డాగ్ ఉనికిని సూచిస్తున్నట్లు తెలిపారు పరిశోధకులు.
అయితే అత్యంత శక్తివంతమైన మాంసాహారులు దాదాపుగా 12 బిలియన్ సంవత్సరాల క్రితం ఫ్రాన్స్ లో ఇవి నివసించేవి. ఆ బేర్ డాగ్ లు ఎముకల నుండి మాంసాన్ని పీక్కుతిన గల సామర్థ్యం కలిగిన దవడలను కలిగి ఉండేవి. కాగా తాజాగా అందిన నివేదికల ప్రకారం ఈ ఎలుగుబంటి కుక్కలు.. ఆసియా, దక్షిణ ఆఫ్రికా, యూరప్, ఇతర ఆఫ్రికా వంటి ప్రాంతాలలో విహరించాయని తేలింది. అయితే దాదాపుగా 8 అంగుళాల పొడవు ఉన్న ఈ శిలాజాన్ని బాసెల్ నేచురల్ హిస్టరీ మ్యూజియంలోని పాలియోంటాలజిస్ట్ బాస్టియన్ మొన్నె కార్ట్ కనుగొన్నారు. లైవ్ సైన్స్ నివేదిక ప్రకారం తాజాగా జరుగుతున్న ఈ శిలాజం కొత్త జాతికి చెందినదని సూచించారు.