Modi – Bihar : బీహార్ పై మోడీ ఫోకస్.. జూన్ 12 పాట్నా మీటింగ్ తో అలర్ట్
వచ్చే లోక్ సభ ఎన్నికలు టార్గెట్ గా విపక్ష పార్టీలు జూన్ 12న బీహార్ రాజధాని పాట్నాలో భేటీ కాబోతున్నాయి. ఈ తరుణంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జూన్‌లో బీహార్‌లో(Modi - Bihar )పర్యటించనున్నారు.
- By pasha Published Date - 04:03 PM, Wed - 31 May 23

వచ్చే లోక్ సభ ఎన్నికలు టార్గెట్ గా విపక్ష పార్టీలు జూన్ 12న బీహార్ రాజధాని పాట్నాలో భేటీ కాబోతున్నాయి. ఈ తరుణంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జూన్‌లో బీహార్‌లో(Modi – Bihar )పర్యటించనున్నారు. అక్కడ బీజేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. ఈవివరాలను బీజేపీ బీహార్ రాష్ట్ర అధ్యక్షుడు సామ్రాట్ చౌదరి ధృవీకరించారు. మరింత మందిని తమ పార్టీలోకి చేర్చుకునేందుకుగానూ మే 30 నుంచి జూన్ 30 వరకు బీహార్‌లో ‘జన్ సంపర్క్ అభియాన్’ను బీజేపీ నిర్వహించనుంది.
Also read : Bihar: బీహార్‌లో వింత పెళ్లి.. వధువు చెల్లిని పెళ్లి చేసుకున్న వరుడు.. అసలేం జరిగిందంటే..?
‘జన్ సంపర్క్ అభియాన్’ కార్యక్రమంలో భాగంగా నిర్వహించే సభకు రావాల్సిందిగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఆహ్వానించామని సామ్రాట్ చౌదరి బుధవారం మీడియాకు తెలిపారు. దీనికి ప్రధాని నుంచి సానుకూల స్పందన వచ్చిందన్నారు. ఆయన మీటింగ్ జరిగే రోజు(Modi – Bihar) కోసం ఎదురు చూస్తున్నామని వెల్లడించారు. ప్రధాని మోడీ హాజరయ్యే సభకు సంబంధించిన తేదీ, వేదికలను త్వరలో ఖరారు చేస్తామన్నారు. ప్రధాని మోడీ రాష్ట్ర పర్యటనకు అంగీకరించినట్లు తమకు అధికారిక ధృవీకరణ అందిందని పేర్కొన్నారు. బీహార్ ముఖ్యమంత్రి, జేడీయూ అధినేత నితీష్ కుమార్ 2024 లోక్‌సభ ఎన్నికల కోసం బీజేపీ వ్యతిరేక పార్టీలను ఏకం చేసే పనిలో ఉన్న తరుణంలో ప్రధాని మోడీ బీహార్ పై ఫోకస్ చేయడాన్ని పొలిటికల్ వార్ హీటెక్కింది అనడానికి సంకేతంగా రాజకీయ పరిశీలకులు అభివర్ణిస్తున్నారు.
Related News

Varanasi International Cricket Stadium : శివతత్వం ఉట్టిపడేలా వారణాసి క్రికెట్ స్టేడియం.. నమూనా చిత్రాలు చూశారా..!
Varanasi International Cricket Stadium దేశంలో మరో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం అందుబాటిలోకి వస్తుంది. కాశీ విశ్వనాథుడు