Fasalrin Loan : ఈ వెబ్ సైట్ లో రైతులకు తక్కువ వడ్డీకే లోన్స్
Fasalrin Loan : దేశంలోని రైతులకు తక్కువ వడ్డీకే లోన్లు ఇచ్చేందుకు కేంద్ర సర్కారు కొత్త పోర్టల్ ను తీసుకొచ్చింది.
- By Pasha Published Date - 09:43 AM, Sun - 8 October 23

Fasalrin Loan : దేశంలోని రైతులకు తక్కువ వడ్డీకే లోన్లు ఇచ్చేందుకు కేంద్ర సర్కారు కొత్త పోర్టల్ ను తీసుకొచ్చింది. అదే.. ‘ఫసల్ రిన్’ (fasalrin) !! దీన్నే ‘‘పీఎం కిసాన్ రిన్ పోర్టల్’’ అని కూడా పిలుస్తారు. కొన్ని రోజుల కిందటే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ https://fasalrin.gov.in/ వెబ్‌సైట్ ను ప్రారంభించారు.రైతులకు కేంద్రం అందిస్తున్న పలు పథకాలు, రుణాలు, వాటి వడ్డీ రేట్ల వివరాలన్నీ ఫసల్ రిన్ పోర్టల్ లో అందుబాటులో ఉన్నాయి. కిసాన్ క్రెడిట్ కార్డ్ స్కీంతో రైతులు సబ్సిడీ వడ్డీ రేటుకే రూ. 3 లక్షల వరకు లోన్ పొందొచ్చు.
We’re now on WhatsApp. Click to Join
రిన్ పోర్టల్‌లో రైతుల పూర్తి డేటా, లోన్లు తీసుకున్న వివరాలు, వడ్డీ రాయితీల క్లెయిమ్ వంటి సమాచారం మొత్తం నిక్షిప్తమై ఉంటుంది. రైతులు ఇకపై బ్యాంకులకు వెళ్లకుండానే ఈ వెబ్‌సైట్ నుంచి లోన్ తీసుకోవచ్చు. 97 కమర్షియల్, 58 రీజినల్ రూరల్ బ్యాంకులు, 512 సహకార బ్యాంకులు లోన్లు అందించేందుకు ఈ పోర్టల్‌లో భాగస్వామ్యం అయ్యాయి. మార్చి 30 నాటికి మన దేశంలో 7.35 కోట్ల కిసాన్ క్రెడిట్ కార్డులు జారీ కాగా, వాటి ద్వారా రూ. 8.85 లక్షల కోట్ల లోన్లు మంజూరయ్యాయి. దీంతోపాటు రైతులను ఆదుకునేందుకు కేంద్ర సర్కారు అర్హులైన వారికి పంట సాయంగా ఏటా రూ. 6 వేలు అందిస్తోంది. దీనిని 3 విడతలుగా ప్రతి 4 నెలలకు ఓసారి రూ. 2 వేల చొప్పున (Fasalrin Loan) ఇస్తున్నారు.