Viral Story: ప్రసవ వేదనతో ఆసుపత్రికి సైకిల్ పై వెళ్లిన ఎంపీ..ఎక్కడంటే…?
న్యూజిలాండ్ లోని గ్రీన్ పార్లమెంట్ సభ్యురాలు జూలీ అన్నే జెంటర్ ప్రసవ వేదనతో ఆసుపత్రికి సైకిల్ పై వెళ్లారు. ఇప్పుడు ఇది సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షించింది.
- By Hashtag U Published Date - 07:03 PM, Sun - 28 November 21

న్యూజిలాండ్ లోని గ్రీన్ పార్లమెంట్ సభ్యురాలు జూలీ అన్నే జెంటర్ ప్రసవ వేదనతో ఆసుపత్రికి సైకిల్ పై వెళ్లారు. ఇప్పుడు ఇది సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షించింది. ఎంపీ జూలీ అన్నే జెంటర్ గతంలో తన మొదటి బిడ్డ పుట్టిన సమయంలో కూడా ఇలాగే చేశారు. తాను ప్రసవ వేదనతో ఆసుపత్రికి సైకిల్ తొక్కుకుంటూ వెళ్లడాన్ని జెంటర్ ఇటీవల ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ లో తెలిపారు.
https://www.instagram.com/p/CWyamppvZgH/?utm_source=ig_web_copy_link
ఉదయం 3.04 నిమిషాలకు తమ కుటుంబంలో కొత్త సభ్యుడికి స్వాగతం పలికామని ఆమె సోషల్ మీడియాలో తెలిపింది.తాను సైకిల్ తొక్కుతూ ఆసుపత్రికి వెళ్లడానికి ప్లాన్ చేయలేదని అది అలా జరిగిపోయిందని ఆమె పేర్కొంది. అయితే జెంటర్ పోస్ట్‌పై నెటిజన్ల నుండి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. కొంతమంది ఈ వార్తలపై సంతోషం వ్యక్తం చేయగా…మరికొందరు సైక్లింగ్ కంటే వ్యాయామం చేయడం వల్ల డెలివరీ సమయంలో చాలా ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటుందని సూచించారు. ప్రసవం కోసం సైకిల్‌పై ఆసుపత్రికి వెళ్లడం ఇదే మొదటిసారి కాదు. మూడు సంవత్సరాల క్రితం…ఆమె ఆరోగ్యకరమైన మగబిడ్డకు జన్మనివ్వడానికి ఆక్లాండ్ ఆసుపత్రికి సైకిల్ తొక్కింది. మొత్తానికి జెంటర్ ప్రసవ వేదనతో సైకిల్ తొక్కుతూ ఆసుపత్రికి వెళ్లిన ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది.

https://www.facebook.com/JulieAnneGenter/posts/4916210785057860