Twitter – 1 Dollar – 1 Year : సంవత్సరానికి 1 డాలర్.. ట్విట్టర్ సబ్ స్క్రిప్షన్ ప్లాన్
Twitter - 1 Dollar - 1 Year : ట్విట్టర్ (ఎక్స్) నుంచి ఆదాయాన్ని సంపాదించడంపై ఎలాన్ మస్క్ ఫోకస్ పెట్టారు.
- By Pasha Published Date - 09:47 AM, Wed - 18 October 23
Twitter – 1 Dollar – 1 Year : ట్విట్టర్ (ఎక్స్) నుంచి ఆదాయాన్ని సంపాదించడంపై ఎలాన్ మస్క్ ఫోకస్ పెట్టారు. ఈ దిశగా ఆయన కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై ఫిలిప్పీన్స్, న్యూజిలాండ్ దేశాలలో కొత్తగా ట్విట్టర్ అకౌంట్ ను తెరిచే వారు కంటెంట్ ను పోస్ట్ చేయడానికి సంవత్సరానికి 1 డాలర్ చొప్పున ఛార్జీగా చెల్లించాల్సి ఉంటుందని వెల్లడించారు. ‘మాకు సపోర్ట్ చేయండి’ అంటూ ఈమేరకు ట్విట్టర్ (ఎక్స్) ఒక పోస్ట్ ను ఇవాళ తెల్లవారుజామున పోస్ట్ చేసింది. ఆ దేశాల్లో కొత్తగా ట్విట్టర్ అకౌంట్స్ ను తెరిచే వారి నుంచి వార్షిక ఛార్జీలను వసూలు చేసే ఈ సబ్ స్క్రిప్షన్ ప్రోగ్రామ్ కు ‘నాట్ ఎ బాట్’ అని పేరు పెట్టామని వెల్లడించింది. ఇప్పటికే ట్విట్టర్ ప్లాట్ ఫామ్ పై ఉన్నవారి నుంచి ఛార్జీలు వసూలు చేయబోమని తేల్చి చెప్పింది.
We’re now on WhatsApp. Click to Join.
స్పామ్ అకౌంట్లను తగ్గించడానికి, బాట్ అకౌంట్లను తొలగించడానికే ఈ ప్రయత్నం చేస్తున్నామని తేల్చి చెప్పింది. కేవలం 1 డాలర్ వార్షిక ఫీజుతో అనవసర అకౌంట్లు ట్విట్టర్ లో క్రియేట్ కాకుండా చేయగలుగుతామని ట్విట్టర్ (ఎక్స్) అంటోంది. ఈ పేమెంట్ చేశాకే.. కంటెంట్ పోస్ట్ చేసే సెక్షన్ యాక్టివేట్ అవుతుందని వివరించింది. ఒకవేళ సంవత్సరానికి 1 డాలర్ సబ్ స్క్రిప్షన్ తీసుకోకుంటే.. కేవలం ట్వీట్లను చదవవచ్చని తెలిపింది.అయితే ఈ ఏడాది చివరికల్లా మరిన్ని దేశాల్లో ఇదే తరహా సబ్ స్క్రిప్షన్ ప్లాన్ ను ట్విట్టర్ ప్రవేశ పెట్టే అవకాశం ఉందనే అంచనాలు (Twitter – 1 Dollar – 1 Year) వెలువడుతున్నాయి.
Starting today, we're testing a new program (Not A Bot) in New Zealand and the Philippines. New, unverified accounts will be required to sign up for a $1 annual subscription to be able to post & interact with other posts. Within this test, existing users are not affected.
This…
— Support (@Support) October 17, 2023
Also Read: BJP First List : 50 మందితో బీజేపీ ఫస్ట్ లిస్ట్.. జాబితాలో ప్రముఖ నేతల పేర్లు ?
Related News
Tim Southee: కెప్టెన్సీ నుంచి తప్పుకుంటారా..? సమాధానమిచ్చిన టిమ్ సౌథీ..!
న్యూజిలాండ్తో జరిగిన రెండో టెస్టులో ఆస్ట్రేలియా విజయం సాధించింది. టిమ్ సౌథీ (Tim Southee) నేతృత్వంలోని కివీస్ జట్టు 3 వికెట్ల తేడాతో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది.