Nasa Satellites: రెండు ఉపగ్రహాలను కోల్పోయిన నాసా.. ఏమైందంటే..?
నాసా ప్రయోగాలు దాదాపు సక్సెస్ అవుతుంటాయి. అలాంటిది తాజాగా ఒక ప్రయోగం విఫలమైంది .
- By Hashtag U Published Date - 04:57 PM, Mon - 13 June 22
 
                        నాసా ప్రయోగాలు దాదాపు సక్సెస్ అవుతుంటాయి. అలాంటిది తాజాగా ఒక ప్రయోగం విఫలమైంది . తుఫానులు, హరికేన్లు, సైక్లోన్ల ముప్పును అంచనా వేయడంతో పాటు వాటి తీవ్రతను గుర్తించే 2 చిన్న ఉపగ్రహాలతో పంపిన రాకెట్ “ఆస్ట్ర” విఫలమైంది. 2 ఉపగ్రహాలను నిర్ణీత భూ కక్ష్యలోకి ప్రవేశపెట్టే లక్ష్యంతో నిప్పులు నిమ్ముతూ నింగికి ఎగిసిన రాకెట్ మొదటి దశను విజయవంతంగానే పూర్తి చేసింది. కానీ రెండో దశలో రాకెట్ లోని ఇంజిన్ నిర్ణీత సమయం కంటే ముందే షట్ డౌన్ (ఆఫ్) అయింది.
దీంతో రెండు ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టే ప్రయత్నానికి పెను విఘాతం కలిగింది. ఈ ప్రయోగాన్ని లైవ్ లో వీక్షిస్తున్న శాస్త్రవేత్తలు ఈమేరకు కామెంట్స్ చేశారు. ఆస్ట్ర సంస్థ రాకెట్ ద్వారా నాసా నిర్వహించిన ప్రయోగ పరీక్ష విఫలం కావడం ఈ ఏడాదిలో ఇది రెండోసారి.