HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Trending
  • >Nasa Calls Off Artemis I Rocket Launch To Moon On Sept 27 Due To Tropical Storm

Rocket To Moon: ఆర్టెమిస్‌-1 ప్రయోగం మూడోసారీ వాయిదా? కొత్త డేట్ అక్టోబరు 2.. అది మిస్సయితే నవంబర్లోనే!

చంద్రుడిపైకి మనిషిని పంపే నాసా మిషన్ లో భాగమే ఆర్టెమిస్‌-1. చంద్రుడిపై శాశ్వత నివాసానికి పునాదులు వేసే ప్రయత్నాల్లో భాగంగా నాసా ఈ ప్రయోగాన్ని చేపడుతోంది.

  • By Hashtag U Published Date - 06:10 AM, Sun - 25 September 22
  • daily-hunt
Artemis Sept 27 Imresizer (1)
Artemis Sept 27 Imresizer (1)

చంద్రుడిపైకి మనిషిని పంపే నాసా మిషన్ లో భాగమే ఆర్టెమిస్‌-1. చంద్రుడిపై శాశ్వత నివాసానికి పునాదులు వేసే ప్రయత్నాల్లో భాగంగా నాసా ఈ ప్రయోగాన్ని చేపడుతోంది. ఆర్టెమిస్‌-1కు సంబంధించి ఇప్పటివరకు నిర్వహించిన రెండు ప్రయోగాలు ఫెయిల్ అయ్యాయి. సెప్టెంబరు 27న (మంగళవారం) జరగాల్సిన ఆర్టెమిస్‌-1 మిషన్ ప్రయోగం కూడా ముచ్చటగా మూడోసారి వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి. ఈ ప్రతిష్టాత్మక ప్రయోగం జరగాల్సిన ఫ్లోరిడా తీర ప్రాంతాన్ని తుఫాను మేఘాలు కమ్ముకున్నాయి. ఈ తుఫాను సోమవారం కల్లా హరికేన్ గా మారి.. గురువారం కల్లా ఫ్లోరిడా తీరాన్ని తాకొచ్చని వాతావరణ విభాగం హెచ్చరించింది. ఈ వార్నింగ్స్ నేపథ్యంలో సెప్టెంబరు 27న జరగాల్సిన ఆర్టెమిస్‌-1 ప్రయోగాన్ని వాయిదా వేసే అవకాశాలు ఉన్నాయి. దీనిపై ఇంకా ఎలాంటి తుది నిర్ణయాన్ని నాసా ప్రకటించలేదు. గత 15 రోజులుగా ఆర్టెమిస్‌-1 రాకెట్ లాంచ్ ప్యాడ్ వద్దే ఉంది.

మళ్లీ ఎప్పుడంటే ?

ఆదివారం రోజున నాసా శాస్త్రవేత్తలు సమావేశమై లాంచ్ ప్యాడ్ వద్దే ఆర్టెమిస్‌-1 రాకెట్ ను ఉంచాలా ? వద్దా ? అనే దానిపై నిర్ణయం తీసుకోనున్నారు. ఒకవేళ లాంచ్ ప్యాడ్ దగ్గరే రాకెట్ ను ఉంచాలని డిసైడ్ చేస్తే మాత్రం.. సెప్టెంబర్ 27 కు బదులు అక్టోబర్ 2న ఆర్టెమిస్‌-1 మిషన్ ప్రయోగం జరుగుతుంది. ఒకవేళ ఆదివారం రాత్రి లేదా సోమవారం ఉదయం కల్లా లాంచ్ ప్యాడ్ నుంచి ఆర్టెమిస్‌-1 రాకెట్ ను తొలగించి నాసా వెహికిల్ అసెంబ్లీ బిల్డింగ్ లోకి పంపిస్తే మాత్రం..ఈ ప్రయోగాన్ని నవంబర్ నెలకి వాయిదా వేసే ఛాన్స్ ఉంటుంది.

Artemis I update: @NASA is foregoing a launch opportunity Tuesday, Sept. 27, and preparing for rollback, while continuing to watch the weather forecast associated with Tropical Storm Ian.

Learn more: https://t.co/A7M6KfWynN pic.twitter.com/Ul12GiPEte

— NASA's Kennedy Space Center (@NASAKennedy) September 24, 2022

గతంలోనూ 2 సార్లు వాయిదా

నాసా చేపట్టిన ఈ ప్రయోగం పలు కారణాలతో గతంలోనూ రెండు సార్లు (ఆగస్టు 29, సెప్టెంబర్23) వాయిదా పడిన విషయం తెలిసిందే. నాసా ప్రయోగంలో భాగంగా ఆర్టెమిస్‌-1 రాకెట్ ద్వారా అందులో ఉన్న ఓరియన్‌ క్యాప్సూల్‌ మానవరహితంగానే చంద్రుడి కక్ష్యలోకి వెళ్లి రానుంది. 2024లో ఆర్టెమిస్‌-2, 2025లో ఆర్టెమిస్‌-3 ప్రయోగాలను సైతం నాసా చేపట్టనుంది.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Artemis I
  • Moon mission
  • nasa
  • Nasa Knennedy space centre

Related News

    Latest News

    • Bullet 350: జీఎస్‌టీ రేట్లలో మార్పులు.. ఈ బైక్‌పై భారీగా త‌గ్గుద‌ల‌!

    • GST Reforms Impact: హోట‌ల్స్ రూమ్స్‌లో ఉండేవారికి గుడ్ న్యూస్‌!

    • PM Modi: మ‌రో దేశ అధ్యక్షుడితో ప్ర‌ధాని మోదీ చ‌ర్చ‌లు.. ఎందుకంటే?

    • Team India Jersey: టీమిండియా న్యూ జెర్సీ చూశారా? స్పాన్సర్‌షిప్ లేకుండానే బ‌రిలోకి!

    • Lunar Eclipse: రేపే చంద్ర‌గ్ర‌హ‌ణం.. ఏ దేశాల‌పై ప్ర‌భావం అంటే?

    Trending News

      • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

      • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

      • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

      • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

      • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd