Pregnant Man : ప్రెగ్నెంట్ మ్యాన్.. 36 ఏళ్ళు కవలలను కడుపులో మోశాడు
Pregnant Man : ప్రెగ్నెంట్.. ఇది కేవలం మహిళలకే వర్తించే పదం !! కానీ మన ఇండియాలో ఓ పురుషుడిని కూడా ప్రెగ్నెంట్ అని పిలిచారు.. ఇందులో నిజమెంత ? అతడు ప్రెగ్నెంట్ అయ్యాడా ?
- Author : Pasha
Date : 24-06-2023 - 8:15 IST
Published By : Hashtagu Telugu Desk
Pregnant Man : ప్రెగ్నెంట్.. ఇది కేవలం మహిళలకే వర్తించే పదం !!
కానీ మన ఇండియాలో ఓ పురుషుడిని కూడా ప్రెగ్నెంట్ అని పిలిచారు..
ఇందులో నిజమెంత ? అతడు ప్రెగ్నెంట్ అయ్యాడా ?
అతని పేరు సంజూ భగత్. వయసు 60 ఏళ్ళు. మహారాష్ట్రలోని నాగ్‌పూర్ వాసి. సంజూ భగత్ ఒక మధ్యతరగతి వ్యక్తి. అతడు చిన్నప్పటి నుంచే పెద్ద పొట్టతో కనిపించేవాడు. అయితే ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండేవాడు. 20 సంవత్సరాల వయసు వచ్చేసరికి పొట్ట పరిమాణం బాగా పెరిగింది. బతుకుదెరువు కోసం కష్టపడటంపైనే నిత్యం ఫోకస్ చేసిన భగత్.. పొట్ట వాపును పెద్దగా పట్టించుకోలేదు. ఇరుగుపొరుగువారు పొట్టను చూసి గేలి చేసినా భరించాడు. సంజును కొందరు ‘ప్రెగ్నెంట్ మ్యాన్'(Pregnant Man) అని ఆటపట్టించేవారు. కానీ, సరదాగా అతడ్ని ఆట పట్టించడానికి అన్న మాటలే నిజమవుతాయని ఎవరూ అనుకోలేదు.
Also read : Russia Vs Wagner Group : రష్యాలో సైనిక తిరుగుబాటు ? తిరగబడిన కిరాయి సైన్యం వాగ్నెర్ గ్రూప్
1999 సంవత్సరంలో సంజూ భగత్ కు శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారింది. చివరకు ముంబైలోని ఒక ఆసుపత్రికి తరలించారు. భగత్ ను చెక్ చేసిన డా. అజయ్ మెహతా అతడి పొట్టలో ట్యూమర్ లేదా క్యాన్సర్ కణితి ఉండొచ్చని భావించారు. కానీ సర్జరీ పూర్తి చేశాక.. అతని కడుపులో మానవ దేహానికి సంబంధించిన భాగాలు ఉండే సరికి షాక్‌కు గురయ్యారు. కడుపులో జననాంగం, ఎముకలు, వెంట్రుకలు, దవడ వంటి శరీర భాగాలు బయటపడ్డాయని వెల్లడించారు. సంజు కడుపులో కవలల అవయవాలు ఛిద్రమైనట్లు వైద్యులు గుర్తించారు. ఈ వ్యాధిని ఫోయిటస్ ఇన్ ఫోయిటస్ (పిండంలో పిండం) అంటారని తెలిపారు. ఫోయిటస్ ఇన్ ఫోయిటస్ అంటే.. పిండంలో మళ్లీ ఓ పిండం పెరగడమని నిపుణులు చెప్పారు. ఇది ఓ అరుదైన వ్యాధి అని స్పష్టం చేశారు. సంజు పుట్టినప్పటి నుంచే అతడి కడుపులో ఈ కవలలు పెరిగాయని చెబుతున్నారు. ఈ లెక్కన భగత్ 36 ఏళ‍్లపాటు ఇద్దరు కవలలను తన కడుపులో మోశాడు. శస్త్ర చికిత్స అనంతరం సంజూ ఇప్పుడు సాధారణ జీవితం గడుపుతున్నాడు.