Viral Video : ఇండియన్ సాంగ్‌తో పిచ్చెక్కిస్తున్న టాంజానియా వాసి
నిజమే. సంగీతానికి అవధుల్లేవు. అది యూనివర్సల్. ప్రాంతం, భాషతో అసలే సంబంధం లేదు. ఎవరైనా సంగీతాన్ని ఆస్వాదించవచ్చు.
- By Hashtag U Published Date - 12:00 PM, Mon - 29 November 21
నిజమే. సంగీతానికి అవధుల్లేవు. అది యూనివర్సల్. ప్రాంతం, భాషతో అసలే సంబంధం లేదు. ఎవరైనా సంగీతాన్ని ఆస్వాదించవచ్చు. మొన్నా మధ్య ఆఫ్రికాకు చెందిన ఓ కుర్రాడు తెలుగు పాటలు అద్భుతంగా పాడి సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాడు. అలాంటి వీడియో మళ్లీ ఒకటి వైరల్‌గా మారింది.
షేర్షా సినిమాలోని రాటాన్ లాంబియాన్ సాంగ్ ఈ మధ్య బాలీవుడ్‌ని ఒక ఊపు ఊపుతోంది. ఆ పాటను టాంజానియాకు చెందిన ఓ వ్యక్తి ట్యూన్‌కి తగ్గట్టుగా డ్యాన్స్ వేయడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది . ట్రెడిషనల్ మాసాయ్ డ్రెస్ వేసుకున్న టిక్‌టాక్ క్రియేటర్ కిలీ పాల్, అతని చెల్లి నీమా ఆ వీడియోలో ఉన్నారు.
సిద్ధార్ధ మల్హోత్రా నటించిన ఈ సినిమాలో సాంగ్ చాలా పాపులర్ అయింది. దీన్ని పాడి పోస్ట్ ని ఇండియాలో తెగ వైరల్ అవుతోంది. పాట పాడిన సింగర్ జుబిన్ తన ఇన్‌స్టాలో దీన్ని రీపోస్ట్ చేశారు. 1.5 మిలియన్ ఫాలోవర్స్ ఉన్న కిల్లీ పాల్ ఆఫ్రికాలో ఫేమస్ టిక్‌టాకర్.
Related News
KKR vs SRH: షారుఖ్ ఖాన్ స్మోకింగ్ వీడియో వైరల్
స్మోకింగ్ అలవాటున్న షారుఖ్ ఖాన్ బహిరంగంగానే సిగరెట్ తాగుతుంటాడు. గతంలో ముంబై విమానాశ్రయంలో స్మోక్ చేస్తూ కనిపించాడు. అప్పట్లో అది వివాదానికి దారి తీసింది.