Messenger Lite – Shut Down : వచ్చే నెలలో ఆ మెసేజింగ్ యాప్ మూసివేత.. మీరు వాడుతున్నారా?
Messenger Lite - Shut Down : ఫేస్ బుక్ కు చెందిన ‘మెసెంజర్ లైట్’ యాప్ త్వరలో మనకు వీడ్కోలు చెప్పనుంది.
- By Pasha Published Date - 03:20 PM, Fri - 25 August 23
 
                        Messenger Lite – Shut Down : ఫేస్ బుక్ కు చెందిన ‘మెసెంజర్ లైట్’ యాప్ త్వరలో మనకు వీడ్కోలు చెప్పనుంది. ఇంటర్నెట్ కవరేజీ తక్కువగా ఉండే ప్రాంతాల వారి కోసం ఫేస్ బుక్ ఇన్నాళ్లూ అందుబాటులో ఉంచిన ఈ యాప్ ఇక అల్ విదా చెప్పనుంది. తక్కువ ఇంటర్నెట్ లోనూ ఫేస్ బుక్ ‘మెసెంజర్ లైట్ యాప్’ ద్వారా ఇన్నాళ్లూ మెసేజ్ లను ఈజీగా పంపుకునేవారు. ఇకపై ఆ సౌలభ్యం ఉండదు. ఎందుకంటే ఆ యాప్ ను మూసివేయనున్నారు. ప్రస్తుతం పాత వినియోగదారులకు మాత్రమే అది అందుబాటులో ఉంది. కొత్త యూజర్స్ దాన్ని డౌన్ లోడ్ చేసుకోలేరు. ఎందుకంటే ఫేస్ బుక్ ‘మెసెంజర్ లైట్’ యాప్ ను (Messenger Lite – Shut Down) గూగుల్ ప్లే స్టోర్ నుంచి తీసేశారు.
Also read : Virat Kohli: విరాట్ కోహ్లీకి బీసీసీఐ వార్నింగ్.. అసలేం చేశాడంటే..?
ఇప్పటికే దాన్ని వాడుతున్న వారు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే.. సెప్టెంబర్ 18 తర్వాత ఆ యాప్ పనిచేయదు. తక్కువ స్టోరేజీ, తక్కువ ఇంటర్నెట్ కనెక్టివిటీ, తక్కువ ప్రాసెసింగ్ శక్తి కలిగిన ఆండ్రాయిడ్ ఫోన్ల కోసం 2016లో ఫేస్ బుక్ ‘మెసెంజర్ లైట్’ యాప్ ను రిలీజ్ చేసింది. ఐఫోన్ల యూజర్స్ కోసం కూడా Messenger Liteని విడుదల చేసినప్పటికీ, దాన్ని 2020లోనే నిలిపివేశారు. Messenger Liteని యాప్ ను ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా దాదాపు 76 కోట్ల మంది డౌన్ లోడ్ చేసుకున్నట్లు సమాచారం. ఇందులో ఎక్కువమంది భారతదేశం, బ్రెజిల్, ఇండోనేషియా దేశాలవారే.