Holi : ఇంట్లోనే సహజ సిద్ధమైన రంగులు సిద్ధం చేసుకోవచ్చు..ఎలా అంటే !
Holi : సహజ రంగులు తయారుచేసుకోవడం కష్టమైన పని కాదు. పసుపు పొడి, తంగేడు పువ్వులు, చామంతి, రేల పూలతో పసుపు రంగును సిద్ధం చేయొచ్చు
- By Sudheer Published Date - 07:00 AM, Fri - 14 March 25

హోలీ (Holi ) అనేది ఆనందం, ఉత్సాహం, రంగుల పండుగ. కానీ మార్కెట్లో లభించే రసాయన రంగులు ఈ ఆనందాన్ని ఆరోగ్య సమస్యలుగా మారుస్తున్నాయి. ఈ కెమికల్ రంగుల్లో ఉండే హానికర పదార్థాలు చర్మానికి హాని చేయడంతోపాటు, కళ్లలో పడితే తీవ్ర ఇబ్బందులు కలిగిస్తాయి. అంతేకాకుండా కొన్ని రంగులు శరీరంపై రోజులు తరబడి ఉండి, అలర్జీలు, దద్దుర్లు, దురద వంటి సమస్యలకు కారణమవుతాయి. ఈ సమస్యలన్నింటినీ నివారించాలంటే సహజసిద్ధమైన రంగులను ఉపయోగించడమే ఉత్తమ పరిష్కారం.
ఇంట్లోనే సహజ రంగులు (Holi Colours) ఎలా తయారు చేయాలి?
సహజ రంగులు తయారుచేసుకోవడం కష్టమైన పని కాదు. పసుపు పొడి, తంగేడు పువ్వులు, చామంతి, రేల పూలతో పసుపు రంగును సిద్ధం చేయొచ్చు. అలాగే, గులాబీ, మందారం పూలు, బీట్‌రూట్, టమాటా గుజ్జుతో ఎరుపు రంగును తయారు చేసుకోవచ్చు. ఆకుపచ్చ రంగు కోసం పాలకూర, కొత్తిమీర, పుదీనా ఆకులను మెత్తగా నూరి నీటిలో కలిపి వాడొచ్చు. వేసవిలో విరివిగా లభించే మోదుగ పూలతో కాషాయరంగు రంగును సులభంగా తయారు చేయవచ్చు. ఈ సహజ రంగులు శరీరానికి హానికరం కాకుండా, ఆరోగ్యాన్ని మెరుగుపరిచేలా పనిచేస్తాయి.
సురక్షిత హోలీ – అందరికీ ఆరోగ్యానికి మేలు
హోలీ పండుగను ఆనందంగా, ఆరోగ్యంగా జరుపుకోవాలంటే సహజ రంగులను ప్రోత్సహించాలి. హోలీ ఆడే ముందు చర్మానికి కొబ్బరి నూనె లేదా మాయిశ్చరైజర్ రాసుకుంటే, రంగులు సులభంగా తొలగిపోతాయి. కళ్లను రక్షించడానికి సన్‌గ్లాసెస్ ధరించాలి. హోలీ అనంతరం చర్మంపై ఇబ్బందులు కలిగితే వెంటనే నీటితో శుభ్రంగా కడిగి, అవసరమైతే వైద్యుడిని సంప్రదించాలి. సహజ రంగులతో హోలీని జరుపుకోవడం ద్వారా మన ఆరోగ్యాన్ని కాపాడుకుంటూనే, పర్యావరణాన్ని కూడా రక్షించవచ్చు.
Good News : ఏపీలో పింఛన్‌లు తీసుకునేవారికి అదిరిపోయే న్యూస్