Royals Marriages : సామాన్యులను పెళ్లాడిన ఐదుగురు ప్రిన్స్‌లు వీరే..
Royals Marriages : ధనవంతుల పిల్లలకు ధనవంతుల పిల్లలతోనే పెళ్లిళ్లు జరగడాన్ని మనం చూస్తుంటాం.
- By Pasha Published Date - 08:44 PM, Sat - 13 January 24

Royals Marriages : ధనవంతుల పిల్లలకు ధనవంతుల పిల్లలతోనే పెళ్లిళ్లు జరగడాన్ని మనం చూస్తుంటాం. కానీ లక్షల కోట్ల ఆస్తిపాస్తులు కలిగిన రాజుల ఫ్యామిలీకి చెందిన వారసులు.. సామాన్యులను పెళ్లాడి అందరినీ ఆశ్చర్యపరిచారు. అలాంటి కొన్ని కేస్ స్టడీలను ఇప్పుడు మనం చూద్దాం..
We’re now on WhatsApp. Click to Join.
బ్రూనై సుల్తాన్ కుమారుడు
బ్రూనైకి చెందిన సుల్తాన్ హసనల్ బోల్కియా కుమారుడు అబ్దుల్ మతీన్ మరోసారి వార్తల్లో నిలిచాడు. 32 ఏళ్ల అబ్దుల్ మతీన్ 29 ఏళ్ల యాంగ్ ములియా అనిషా రోసన్నాను పెళ్లి చేసుకున్నాడు. ప్రపంచంలోనే ఎక్కువ కాలం పాలించిన రాజు కొడుకు పెళ్లి కావడం వల్లే.. దానిపై పెద్దగా చర్చ జరగలేదు. ఈ వార్త అబద్ధమై ఉండొచ్చని తొలుత అందరూ భావించారు. కానీ దీనిపై బ్రూనై రాజ కుటుంబం(Royals Marriages) నుంచి అధికారిక ప్రకటన వెలువడటంతో పూర్తి స్పష్టత వచ్చేసింది.
ప్రిన్స్ విలియం, కేట్ మిడిల్టన్
బ్రిటన్ రాజకుటుంబానికి చెందిన ప్రిన్స్ విలియం.. కేట్ మిడిల్టన్ అనే సామాన్య మహిళను పెళ్లాడారు. వీరి పెళ్లి టైంలో వివిధ విమర్శలు వచ్చాయి. విలియం రాజవంశం పేరు చెడగొట్టాడనే ట్రోలింగ్ కూడా జరిగింది. వాళ్లిద్దరి మ్యారేజ్ 2011లో జరిగింది.
ప్రిన్స్ హ్యారీ, మేఘన్ మెర్కెల్
బ్రిటన్ రాజకుటుంబానికి చెందిన ప్రిన్స్ హ్యారీ.. మేఘన్ మెర్కెల్ అనే సామాన్య వనితను పెళ్లాడాడు. నిజానికి ఆమె అమెరికన్ నటి. వాళ్ల పెళ్లి 2018లో జరిగింది. ఇద్దరూ బ్రిటన్ ప్యాలెస్ వదిలేసి.. 2020 సంవత్సరంలో అమెరికాలోని కాలిఫోర్నియాకు షిఫ్ట్ అయ్యారు.
జపాన్ ప్రిన్సెస్ మాకో, కీ కొమురో
జపాన్ ప్రిన్సెస్ మాకో 2021 సంవత్సరంలో కీ కొమురో అనే సామాన్యుడిని పెళ్లాడింది. వారిద్దరూ టోక్యోలోని ఇంటర్నేషనల్ క్రిస్టియన్ యూనివర్సిటీలో కలిసి చదువుకునేవారు. ఈ పెళ్లి చేసుకోవడానికి జపాన్ ప్రిన్సెస్ మాకో తన రాచరిక వారసత్వాన్ని వదులుకుంది. తన ఆస్తిని వదులుకుంది. సాధారణ వ్యక్తిని వివాహం చేసుకుంది.
ప్రిన్స్ కార్ల్ ఫిలిప్, సోఫియా హెల్‌క్విస్ట్
స్వీడన్ ప్రిన్స్ కార్ల్ ఫిలిప్ 2015లో సోఫియా హెల్‌క్విస్ట్ అనే సామాన్యురాలిని పెళ్లి చేసుకున్నారు. ఆమె ఒక మోడల్, రియాలిటీ టీవీ స్టార్. 2009లో ఇద్దరూ నైట్ క్లబ్‌లో కలుసుకున్నారు. ఆ ప్రేమ చిగురించి పెళ్లయింది.
కింగ్ అబ్దుల్లా II, రానియా అల్-యాసిన్
జోర్డాన్ కింగ్ అబ్దుల్లా II, రానియా అల్-యాసిన్ అనే సామాన్య వనితను పెళ్లి చేసుకున్నారు. అంతకుముందు ఆమె బ్యాంకులో పని చేసేది. వారిద్దరూ 1992లో ఒక డిన్నర్ పార్టీలో కలుసుకున్నారు. 1993లో పెళ్లి చేసుకున్నారు. 1999లో తన తండ్రి మరణం తర్వాత కింగ్ అబ్దుల్లా II రాజు అయ్యాడు.