HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Trending
  • >Know These Factors Before Buying Gold Jewellery

Gold Buying: బంగారం కొంటున్నారా..ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోండి?

భారతీయులు బంగారాన్ని ఎంతగా ఇష్టపడతారో మనందరికీ తెలిసిందే. బంగారాన్ని ఒక ఆస్తిగా భావిస్తూ ఉంటారు.

  • Author : Anshu Date : 02-09-2022 - 7:40 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Gold
Gold

భారతీయులు బంగారాన్ని ఎంతగా ఇష్టపడతారో మనందరికీ తెలిసిందే. బంగారాన్ని ఒక ఆస్తిగా భావిస్తూ ఉంటారు. అంతేకాకుండా చాలామంది కష్టపడి సంపాదించిన డబ్బుతో వారికి ఇష్టమైన బంగారు నగలను చేయించుకుంటూ ఉంటారు. అయితే బంగారం కొనే సమయంలో కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి. బంగారం కొనే సమయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని ఇప్పుడు మనం తెలుసుకుందాం.. బంగారం ధర నిత్యం మారుతూ ఉంటుంది. ఈ బంగారం ధరలను పేరున్న వెబ్సైట్లో మాత్రమే పొందుపరుస్తూ ఉంటారు.

అయితే బంగారం కొనుగోలు చేసే ముందు నాలుగైదు షాపులు ధరల వివరాలు కనుక్కొని ఆ తర్వాత ఎక్కడ తక్కువగా ఉంటుందో అక్కడ నగలు కొనుగోలు చేయాలి. ఇక నగల బంగారాన్ని 22 క్యారెట్లు 18 క్యారెట్లు 14 క్యారెట్ల స్వచ్ఛతతో తయారుచేస్తారు అన్న విషయం తెలిసిందే. ఇటువంటి బంగారాన్ని కొన్నా కూడా దానిపై బిఐఎస్ హాల్ మార్క్ గుర్తుండి తీరాలి. ఒకవేళ అటువంటి గుర్తు లేకపోతే అటువంటి గోల్డ్ ను కొనుగోలు చేయకూడదు. అలాగే జువెలరీ షాపు వారు బంగారు నగలపై తరుగు,మజూరి పేరుతో అదనపు చార్జీలను వేస్తూ ఉంటారు.

ఇవి ఒక్కొక్క షాపులో ఒక్కొక్క విధంగా ఉంటాయి. కాబట్టి ఎక్కడ అయితే తరువు చార్జీలు తక్కువగా పడతాయో అక్కడే కొనుగోలు చేయడం మంచిది. అలాగే మీరు కొనే నగల్లో రాళ్లు ఉంటే ధర ఎక్కువగా ఉంటుంది. రాళ్ల వల్ల నగల తయారీలో వేస్టేజ్ ఎక్కువగా ఉంటుంది. పనికిరాళ్లకు అంతగా విలువ ఉండదు. కొనుగోలు చేసే వారు ఈ విషయాన్ని గుర్తు పెట్టుకొని బంగారాన్ని కొనుగోలు చేయడం మంచిది. అలాగే నగల షాపు వారు కావాలనే ధర ఎక్కువగా చెప్పి ఆఫర్లు డిస్కౌంట్లు ఇస్తూ ఉంటారు. అలాగే డిస్కౌంట్లు,ఆఫర్లు పోగా ఎంత చెల్లించాల్సి వస్తుందో ముందే గమనించుకోవాలి. అలాగే బిల్లు ఇవ్వని షాపుల్లో నగలు ఎప్పుడు కొనుగోలు చేయకూడదు. ఎందుకంటే భవిష్యత్తులో మీరు నగలు అమ్మాలి అనుకుంటే ఆ బిల్లు మీకు చాలా అవసరం అవుతుంది. అంతేకాకుండా బంగారం విషయంలో మోసం జరిగితే కోర్టులో బిల్లు మీకు ఆధారంగా పనిచేస్తుంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • gold
  • things
  • things to remember for buying gold jewellery
  • tips for buying gold jewellery

Related News

Today Gold Silver Prices

Gold And Silver Prices Today : పసిడి ప్రియులకు బిగ్ షాక్..భారీగా పెరిగిన గోల్డ్ ధర

బంగారం ధరలు చుక్కలు చూపిస్తుంటే.. వెండి ధర మాత్రం కొనుగోలుదారులకు స్వల్ప ఊరటనిచ్చింది. అనూహ్యంగా ఒక్కరోజులోనే కేజీ వెండిపై రూ. 10,000 తగ్గడం విశేషం

    Latest News

    • Mamnoor Airport : ఏడాదిలోగా అందుబాటులోకి మామునూరు ఎయిర్‌పోర్టు

    • Lands of Sarada Peetham : శారదా పీఠం భూములపై బీఆర్ఎస్ , కాంగ్రెస్ ఫైట్ !

    • ఏపీ కొత్త CSగా సాయిప్రసాద్ బాధ్యతలు

    • HPV Vaccine : తెలంగాణ లో ఫ్రీగా HPV వ్యాక్సిన్.. ఎక్కడెక్కడ వేస్తారంటే?

    • Explosion at Fireworks : ఏపీలో భారీ పేలుడు.. 18 మంది మృతి!

    Trending News

      • Science Day: ఫిబ్రవరి 28నే సైన్స్ డే ఎందుకు?

      • టీమిండియా కోసం దైవ ద‌ర్శ‌నాలు మొద‌లుపెట్టిన కోచ్ గంభీర్‌!

      • తెలంగాణలో మార్చి 1 నుంచి కొత్త రూల్స్‌!!

      • 2 ఓవర్లలోనే 46 పరుగులు.. ఇదేం బౌలింగ్ దూబే!!

      • టీమిండియాను టెన్ష‌న్ పెడుతున్న వెస్టిండీస్‌!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd